Docs

11) Retrograde Planets

ఉపోద్ఘాతం :

ఒకరోజు నాకు బాగా సన్నిహితుడైన ఒక పెద్దాయనతో జ్యోతిష్యం గురించి మాట్లాడుతున్నాను, రవి పాపగ్రహం కదా ఆయనని గ్రహరాజుని ఎందుకు చేశారు అని నన్ను అడిగారు. 

ఆ రోజు నేను సమాధానం చెప్పలేకపోయాను. ఇన్ని శుభగ్రహాలు ఉండగా మహర్షులందరూ సూర్యుని ఉపాసన చేస్తూ జ్యోతిష్య గ్రంథాలు రచించారు. ఎందుకనేది నాకు అర్థం కాలేదు అన్నారాయన. దీనికి సమాధానం ఈ వ్యాసం అయ్యేవరకు మీకు అర్థం అయిపోతుంది లే.

గ్రహాలు కాంతిని ప్రసరించడం లేదా పరివర్తించడం చేస్తాయి, జన్మజాతకం గ్రహ ఆధారితమైనది కాబట్టి కాంతి లేని జీవితం చీకటి అవుతుంది. కొన్ని సందర్భాలలో చీకట్లో దీపంతో జీవిస్తాం, దీపం వెలుగు సూర్యకాంతితో ఎన్నటికీ సమానం కాలేదు. 

ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఇది ఎలా అనేది మీకు ఇంకా పూర్తిగా అర్థం అవుతుంది. 

పరమానందయ్య గారి శిష్యుల కథ అందరికీ తెలిసే ఉంటుంది, వారందరూ పూర్వ జన్మలో ఋషులు, అడివిలో రాత్రిపూట నడుస్తూ మరో రుషి యొక్క తపస్సు బంగానికి కారణమైనందుకు ఆ మహర్షి జ్ఞానం లేకుండా ప్రవర్తించినందుకు తింగరి వాళ్ళగా పుట్టమని శపించారు. 

ఋషులందరూ ప్రాధేయపడగా ఆ మహర్షి ఒక శాప విమోచనం ఇచ్చారు, మీరు జ్ఞానవిహీనులైనప్పటికీ మీరు చేసే పనుల వలన ఏ జీవికి అపాయం కలగదు, లోక కళ్యాణార్థం మీ పనులు ఉపయోగపడతాయి అని వరమిచ్చారు.

దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, జాతక చక్రంలో ఒక వక్రత్వం వంటి శాపానికి విమోచన వచ్చినప్పటికీ కొంత శాతం ఆ భావం సరిగ్గా ఉండదు. 

చిన్న ఉదాహరణతో చెప్పాలంటే చక్కర పొంగలి తినాలనుకున్న వాడికి అరటి పండుతో సరిపెట్టుకోమంటే, రెండు తీయగానే ఉంటాయి కదా, అంటే ఒకే రకమైన ఆనందం దక్కదు కదా.

చీకటి మరియు వెలుగు :

మనం ఇప్పటివరకు ఎన్నో సూర్య, చంద్ర గ్రహణాలను పరిశీలించి ఉన్నాం, జ్యోతిష్యం తెలియకపోయినా గ్రహణాలు తెలియని వారు ఉంటారని నేను అనుకోవటం లేదు.

సూర్యుడు స్వయం ప్రకాశిత గ్రహం, గ్రహణం రోజున ఆ యొక్క కిరణాలు భూమి మీద పడవు, ఇదేవిధంగా ప్రపంచం ఎల్లప్పుడూ ఉంటే, భూమి మీద మనుగడ సాగదు. ఇప్పటికే వెలుగు ఎంత ముఖ్యమో అనేది మీకు అర్థం అయిపోయింది అనుకుంట.

ఖగోళ శాస్త్రం గురించి నాకు అర్థమైనంత వరకు సూర్యుడు యొక్క స్వయం ప్రకాశిత కిరణాలు సూర్యుడి చుట్టూ ఒక కక్షలో తిరిగే ప్రతి గ్రహం మీద ప్రసరిస్తూ ఉంటాయి, తిరిగి ప్రతి గ్రహము పరివర్తన కాంతిని కలగజేస్తుంది, అది తిరిగి భూమి మీద కూడా పడుతుంది.

కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఇతర గ్రహాలు సూర్యుడు నుంచి దూరంగా వెళ్ళినప్పుడు సూర్యుడి యొక్క కాంతి వాటి మీద సరిగా ప్రసరించకపోవడం కానీ, భూమికి సూర్యుడికి మధ్య ఇతర గ్రహాలు అడ్డు రావడం వల్ల కానీ భూమి మీద ఆ యొక్క ఇతర గ్రహాల కాంతి కిరణాలు సరిగా పడకపోవచ్చు. దీనినే కొన్ని సందర్భాలలో గ్రహణం గానీ, వక్రత్వం గానీ అని పిలుస్తారు. 

కాంతులేని జీవితం ఎలాంటి నరకమో, గ్రహాలు గ్రహణం భారి పడిన, వక్రత్వాన్ని పొందిన, రాహు కేతువులతో కలిసిన అది ఒక శాపంగా నేను భావిస్తాను. 

భూమిపై నుంచి చూస్తుంటే గ్రహాలు వెనక్కి వెళుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అందుకే దానికి వక్రత్వం అనే పేరు వచ్చింది, నిజానికి గ్రహాలు ఎప్పుడు వెనక్కి వెళ్ళవు.

రవిచంద్రులు ప్రత్యక్ష దైవాలు వాళ్ళు ఎప్పుడు వక్రీంచరు. రాహు కేతువులు వక్రించి వెనక్కి వెళ్లడమే వారికి సవ్యమైన మార్గం. 

మిగిలిన పంచతారగ్రహాలు వక్రీస్తు ఉంటాయి. ( కుజ, బుధ, గురు, శుక్ర, శని ) రాసి చక్రంలో కుజ, గురువు, శనులు ఉన్న రాశి నుంచి 120 డిగ్రీలకు దూరంగా సూర్యుడు ఉన్న దాదాపు వక్రిస్తారు. 

గ్రహాల వక్రత్వం

బుధుడు:

   – వక్రత్వం 3-4 సార్లు సంవత్సరంలో ఉంటుంది.

   – సుమారు 24 రోజుల పాటు వక్రత్వం ఉంటుంది.

శుక్రుడు:

   – వక్రత్వం ప్రతి 18 నెలలకు ఒకసారి ఉంటుంది.

   – సుమారు 42 రోజుల పాటు వక్రత్వం ఉంటుంది.

కుజుడు:

   – వక్రత్వం ప్రతి 26 నెలలకు ఒకసారి ఉంటుంది.

   – సుమారు 60-80 రోజుల పాటు వక్రత్వం ఉంటుంది.

గురుడు :

   – వక్రత ప్రతి 9 నెలలకు ఒకసారి ఉంటుంది.

   – సుమారు 120 రోజుల పాటు వక్రత్వం ఉంటుంది.

శని :

   – వక్రత్వం ప్రతి సంవత్సరం ఉంటుంది.

   – సుమారు 140 రోజుల పాటు వక్రత్వం ఉంటుంది.

గ్రహాలన్నిటికీ వక్రత్వ దోషం :

రాసి చక్రంలో రవిచంద్రులకు ఏకాదిపత్యము, మిగిలిన పంచ గ్రహాలకు రెండు రెండు రాశులు చొప్పున పంచారు. 

ఏ రాశ్యధిపతి అయితే వక్రతదోషాన్ని పొందుతాడో లగ్నము నుంచి ఆ భావములు సరైన ఫలితాన్ని ఇవ్వవు. 

రవిచంద్రులతో సహా అన్ని గ్రహాలకి వక్రతదోషం ఏ విధంగా కలుగుతుంది అనేది నా పరిశీలన, కేవలం నా ఆలోచనతో మీ ముందు పెడుతున్నాను, నచ్చితేనే వాడుకోండి.

దీనికోసం నేనొక ఫ్లో చాట్ ప్రిపేర్ చేశాను, దీని ద్వారా ఒక గ్రహానికి వక్రత్వ దోష స్థితి పొందినదా లేదా అని మీరు సునాయాసంగా చెప్పవచ్చు, గణిత పరంగా ప్రతి విషయాన్ని కూలంకుశంగా చర్చిద్దాం. 

ముఖ్యమైన విషయాలను మొదట సులభంగా ఇక్కడ తెలియజేస్తాను.

  1. ఒక గ్రహం వక్రీంచకూడదు 
  1. సహజంగా గ్రహం వక్రస్తుంది. 
  2. రాహుకేతువులు ఉన్న నక్షత్రంలో ఉంటే వక్రత్వ దోషం.
  3. గ్రహం వక్రంచి రాహుకేతులతో ఉంటే వక్రత్వ దోషం రద్దు అవుతుంది.
  1. ఒక గ్రహం యొక్క నక్షత్రాధిపతి  వక్రీంచకూడదు 
  1. సహజంగా గ్రహం వక్రస్తుంది 
  2. రాహుకేతువులు ఉన్న నక్షత్రంలో ఉంటే 
  3. గ్రహం వక్రంచి రాహుకేతులతో ఉంటే వక్రత్వ దోషం రద్దు అవుతుంది.
  1. గ్రహము మరియు నక్షత్రాధిపతి వక్రించిన వక్రత దోషం ఉండదు.( – * – =  + )
  1. గ్రహమునకు వక్రత్వ దోషం వచ్చిన నక్షత్ర నాథుడు 1, 2, 11, 10 స్థానములలో ఉంటే వక్రత దోషం ఉండదు, పదవ స్థానము కొంత వరకు మాత్రమే.
  1. ఒక గ్రహము స్వనక్షత్రంలో ఉన్న, నక్షత్ర పరివర్తన చెందిన రాశ్యధిపతి బట్టి పరిశీలించాలి, అయితే రాశ్యధిపతికి  వచ్చిన మినహాయింపులు (4) ఈ గ్రహానికి ఇవ్వలేడు. 
  1. గ్రహములు తమ స్వనక్షత్రంలో ఉన్నప్పుడు రాహుకేతులతో కలిసిన వక్రత్వం వంటివి రావు, వారి రాశ్యాధిపతిని పరిశీలించి దాన్ని బట్టి వక్రత్వం చెప్పాలి. 

ఇతర ముఖ్య విషయాలు :

  1. రాహు కేతువుల అపసవ్య లో సంచరిస్తారు, అది వారికి సహజం కాబట్టి ఎప్పుడైనా గ్రహాలు రాహు కేతువుల నక్షత్రాలలో ఉంటే వక్రత్వంగా పరిగణలోకి తీసుకోరాదు. 
  1. వక్రత్వం అనేది జన్మజాతకంలోనే కాకుండా పుట్టినరోజు నుంచి దాదాపు 120 రోజుల పాటు పరిశీలించాలి. ఎందుకంటే దైవమానం మనుష్యమానం అనే ఒక నానుడి ఉంది, మనకి ఒక సంవత్సరకాలం దైవానికి ఒక్కరోజు అని అంటారు. అయితే మీకు పది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఉదాహరణకు బుద్ధ దశ జరుగుతుందనుకోండి, బుధుడు వక్రించి ఉన్నాడు ఆ లగ్నానికి యోగ కారకుడు అయ్యాడు అనుకోండి, అప్పుడు అది అనుకున్నంత స్థాయిలో శుభ ఫలితాన్ని ఇవ్వదు.
  1. జన్మజాతకంలో ఉన్న గ్రహాల యొక్క గ్రహస్ఫటాన్ని పరిశీలించాలి, అది ఎప్పుడూ కూడా ప్రతి గ్రహము ఉన్న గ్రహస్పటానికి ముందుకి సాగుతూనే వెళ్లాలి వెనక్కి వక్రీంచకూడదు, ఒకవేళ వక్రీచినచో మళ్లీ దాని నక్షత్రాధిపతి 1, 2, 11, 10 ఉంటేనే దానికి మినహాయింపు వస్తుంది. 
  1. ఉదాహరణకు జన్మజాతకంలో శుక్రుడు, బుధుడు నక్షత్రంలో ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత శని నక్షత్రంలో వక్రఇంచాడు, అప్పుడు ఆ శని జాతక చక్రంలో అనుకూల భావములో అన్నా ఉండాలి, లేదంటే వక్రత్వ దోషాన్ని పొందైన ఉండాలి, అప్పుడే ఈ శుక్రుడుకు వక్రతదోషం పోతుంది. 
  1. ఒక గ్రహం ఏ నక్షత్రంలో ఉందో అదే నక్షత్రంలో రాహుకేతువుల ఉంటే ఆ గ్రహానికి వక్రత్వం ఆపాదించబడుతుంది.
  1. లగ్నమునకు శుభులు వక్రించిన భావము, యోగము రెండు ఫలితాలను పాడు చేస్తారు, లగ్నమునకు పాపి అయినవాడు వక్రించిన భావము చెడిపోయి యోగ ఫలితాన్ని పెంచుతాడు. 
  1. వక్రించిన గ్రహం యొక్క నక్షత్రాధిపతి ఉచ్చ పొంది, యోగ కారకుడైన కేవలం కొంతవరకు మాత్రమే శుభత్వం. 
  1. ఒక గ్రహం వక్రత్వ దోషాన్ని ఒక నిర్ణీతమైన వయస్సులో పొందినప్పుడు, ఆ గ్రహమునకు సంబంధించిన దశ గాని, భుక్తి గాని జరిగిన దానితో మరియు ఆ గ్రహం యొక్క నక్షత్ర నాథుడు దుస్థాన సంబంధము పొందిన ఏదో ఒక చెడు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది.
  1. ఒక గ్రహం జన్మ జాతకంలో ఉన్న డిగ్రీల కన్న ముందుకు వెళ్లి వక్రిస్తే కొంతవరకు నయం. వెనక్కి వెళితే ఇబ్బందే.
  1. వక్రత్వం వల్ల ఒక్కో సారి పరివర్తన, స్వనక్షత్ర స్థితి కోల్పోయే అవకాశం ఉంది.

గణిత సూత్రం – x – = + :

గణిత సూత్రం ఆధారంగా ఒక వక్రించిన గ్రహము మరో వక్రించిన గ్రహము యొక్క నక్షత్రంలో ఉన్న దానికి వక్రత్వ దోషం ఉండదు. 

దీన్ని ఉదాహరణతో మీరు ఈ వ్యాసంలో ముందుకు సాగే కొద్దీ నేను వివరిస్తాను.

యోగము vs భావం :

చాలా వరకు లగ్నాలకు అష్టమాధిపతి పాపి అవుతాడు, అయితే అష్టమాధిపతి బాగోపోతే ఆయుర్ధాయం ఉండదు, అంటే దీని అర్థం అన్ని అధిపతులు తమ భావాలు చెడిపోకుండా ఉండాల్సిందే, లగ్నమునకు వీరు పాపులు వీరు శుభులు అని సంబంధం లేదు.

భావము అనగా మనం ముట్టుకోగలిగేది, అనుభవించగలిగేది, యోగమనేది అది మనకుంటుంది ముట్టుకోలేము ఏమి చేసుకోలేం, కానీ అది కావాలి. 

లగ్నమునకు శుభులు వక్రించిన భావము, యోగము రెండు ఫలితాలను పాడు చేస్తారు, లగ్నమునకు పాపి అయినవాడు వక్రించిన భావము చెడిపోయి యోగ ఫలితాన్ని పెంచుతాడు. 

సంఖ్య భావం యోగం 
1తనువుఆలోచనలు 
2కుటుంబం పేరు, ప్రఖ్యాతలు, ధనం 
3సోదరులు సామర్థ్యం 
4తల్లి భూమి, స్థలం, సుఖం 
5సంతానం తెలివితేటలు
6చుట్టాలు, మిత్రులు సహకారంపోరాడే తత్త్వం, ఆరోగ్యం, రోగనిరోధక శక్తి 
7భార్య/భర్త ప్రజాదరణ
8శరీరము ఆయుర్దాయ, అకాస్మిక దానం, పరిశోధన
9తండ్రిఆస్తులు, తత్వశాస్త్రం
10ఉద్యోగంఉద్యోగ సంతోషం/ అసంతృప్తి
11పెద్ద అన్నయ్యలాభం
12సుఖ నిద్రఖర్చు, పెట్టుబడి 

గ్రహ వక్ర దోష ఫ్లో చార్ట్ :

నక్షత్ర నాధుని పరిశీలన :

భావ విశ్లేషణ :

  • రాశి లో బలమైన గ్రహం
  • రాశి అధిపతి 
  • భావ కారకుడు 

దశ విశ్లేషణ :

ఒక గ్రహానికి వక్రత్వ దోషం వచ్చింది, ఆ దశలో అన్ని దైవ నిర్ణయాలని వదిలేసి, జరిగే విషయాన్ని గట్టిగా మార్చాలని నిర్ణయం తీసుకోకుండా ఉంటే చాలు, దాదాపు అంతా మంచే జరుగుతుంది.

ఉదాహరణ :

Example 1

AgeSuMoMaMeJuVeSaRaKe
11004010010040404010040
51004010010090409010090
101004010010090409010090
151004010010090409010090
201004010010090409010090
251004010010090409010090
301004010010090409010090
351004010010090409010090
401004010010090409010090
451004010010090409010090
501004010010080409010040
551004010010080409010040
601004010010080409010040
651004010010080409010040
701004010010040409010040
751004010010040409010040
801004010010040409010040

Example 2

AgeSuMoMaMeJuVeSaRaKe
110030309010010045100100
510030309010010045100100
1010030309010010045100100
1510030309010010045100100
2010030309010010045100100
2510030309010010045100100
3010030303010010045100100
351009030303030453030
401009030753030453030
451009030753030453030
501009030903030453030
5510090309030301003030
6010090309030301003030
6510090309030301003030
7010090309030301003030
7510030309030301003030
8010030309030301003030

పాశ్చాత్య జ్యోతిష్యంలో వక్ర గ్రహాలు :

రాబోయే వ్యాసాలలో దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం, మీరు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి ఇది చదువుతారని ఆశిస్తున్నాను. 

పాశ్చాత్య జ్యోతిష్యంలో రెండు గ్రహాల మధ్య దూరాన్ని ఆధారంగా జ్యోతిష్య ఫలితాలు చెప్తారు, దానిలో ఐదు ముఖ్యమైన గ్రహ దూరాలను, దృష్టిలుగా పరిగణిస్తారు. దీనిలో రెండు శుభదృష్టిలు, రెండు పాపదృష్టిలు, ఒకటి శుభగ్రహాల మధ్య ఏర్పడితే శుభదృష్టి, పాప గ్రహాల మధ్య ఏర్పడితే పాపదృష్టిగా పరిగణిస్తారు.

ఒక గ్రహం స్వయంగా వక్రించిన, రాహుకేతులతో కలిసిన, ఆ గ్రహమునకు శుభ దృష్టి కలిగితే

 అశుభము గాను, అశుభ దృష్టి కలిగితే శుభముగాను ప్రవర్తిస్తుంటాయి. 

గ్రహాలు వక్రించినప్పటికీ దాని నక్షత్రాధిపతి 1, 2, 11, 10 స్థానాలలో ఉంటే దోషం కొంతవరకు హరించబడుతుంది.

ముగింపు :

నాకైతే మాత్రం జ్యోతిష్యంలో వక్ర గ్రహ దోషం అనేది Game Changer లాగా అనిపిస్తుంది, మీరు అవుతది అనుకున్నది కాదు, కాదు అనుకున్నది అవుతూ ఫలిత జ్యోతిష్యాన్ని తారుమారు చేసేస్తుంది. నేను దీన్ని చాలా తక్కువ సమయ వ్యవధితో ఉన్న జాతకాల మీద వక్రత్వాన్ని పరిశీలించాను. 

ఒక గ్రహం వక్రీస్తే ఋజు మార్గం పొందడానికి  చాలా రోజుల సమయం పడుతుంది. ఉదాహరణకు ద్వితీయాధిపతి వక్రరించిన మనం రోజు భోజనం చేయడం మానం కదా, మహా అంటే కొంచెం ఆలస్యం అవుతుంది. అలాంటప్పుడు ఏ లగ్నం జరుగుతుంది ఆ లగ్నానికి ఆ వక్కిరించిన గ్రహం లాభం లోకి వెళ్ళిందా అనేది ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేయండి. 

అందరి జీవితంలోనూ అన్ని ఉండవు, కానీ కొన్ని సందర్భాలలో గ్రహాల వక్రించినప్పుడు ఆ విషయాలు వాళ్లకి అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. 

సింపుల్గా చెప్పాలంటే ప్రతి రోజు గొడవ పెట్టే భార్య ఈ వారం రోజులు చాలా ప్రేమగా మాట్లాడినట్టు అనిపిస్తుంది.

పూర్తిగా ఈ వ్యాసం చదివాక కూడా ఒక దశని ఒక భావాన్ని ఎలా విశ్లేషించాలని అనేది ఇంకా అర్థం కాలేదు అనిపిస్తుంది కానీ ముందున్న వ్యాసాలలో భావము మరియు దశ విశ్లేషణ గురించి ఇంకా వివరిస్తాను.

Ref : https://app.rahasyavedicastrology.com/ephemeris