Docs

Planets Colors in Astrology | ep4

గ్రహాల రంగులు :

గ్రహాలకు ఆపాదించిన రంగులను తెలుసుకోవడం వల్ల ఫలిత భాగంలో ఉపయోగపడుతుంది.

ఉదాహరణకి నేను ఏ రంగు బట్టలు వేసుకుంటే కలిసి వస్తుంది లేదా నాకు కాబోయే భార్య ఏ రంగులో ఉండొచ్చు అని అడిగితే ఆ విషయం చెప్పడానికి, ఏ గ్రహానికి ఏ రంగు ఆపాదించారు అని తెలియాలి.

ఒక వ్యక్తి ఏ రూపంలో ఉన్నాడు అని ఎలా వర్ణిస్తామో అలాగే ఒక గ్రహం ఏ రూపంలో ఉంటుందో రాశిని బట్టి, నక్షత్రాన్ని బట్టి, గ్రహ కలయికలు బట్టి, తెలుసుకోవాల్సి ఉంటుంది.

గ్రహాలు మరియు వాటి వర్ణం

  • రవి గ్రహం – తెలుపు వర్ణం, కాషాయ వర్ణం
  • చంద్ర గ్రహం – తెలుపు వర్ణం
  • కుజ గ్రహం – ఎరుపు వర్ణం
  • బుధ గ్రహం – ఆకు పచ్చ వర్ణం
  • గురు గ్రహం – పసుపు వర్ణం
  • శుక్ర గ్రహం – తెలుపు వర్ణం
  • శని గ్రహం – నీలి వర్ణం, నలుపు వర్ణం
  • రాహు – నలుపు వర్ణం, గచ్చకాయ రంగు
  • కేతు – చిత్రవర్ణం ( రెండు మూడు రంగుల కలయిక )
  • ఉదాహరణకు ఒక వ్యక్తి కొత్త బట్టలు కొనడానికి వెళ్లాడు అనుకుదాం ఆరోజు ఉన్న నక్షత్రాన్ని బట్టి తన దశ భక్తి మరియు అతని గ్రహస్థితిని బట్టి ఏ రంగు బట్టలు కొనడానికి అవకాశం ఉంది అనేది చెప్పవచ్చు. అలా చెప్పడానికి కి గ్రహాల యొక్క రంగులు మనకు తెలిసి ఉండాలి.

    ఏదైనా నా ఒక సందర్భాన్ని నిర్ణయించి ఫలితం చెప్పినప్పుడు ఫలానా ఉద్యోగం లో చేరే రోజున ఈ రంగు దుస్తులు ధరించి ఉంటావు అని ఫలితం చెప్తే పాఠకులు చాలా ఆశ్చర్య పోయే దానికి అవకాశం ఉంటుంది.

    జ్యోతిష్యంలో ఫలితమైన ఎంతవరకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అనే విచక్షణ ను జ్యోతిష్యుడు కలిగి ఉండాలి.

    planets, stars, rashi everything is important right. her i have explained about planet’s colors.