Docs

10) Planetary Conjunctions (Yogas)

ఉపోద్ఘాతం :

గ్రహగమనంలో ఒక గ్రహం మరో గ్రహంతో ఏదో ఒక రాశిలో కలవడంసహజం, లగ్నము ఆధారంగా వాళ్లు మిత్రులై శుభ స్థానాల్లో కలిసిన అది చాలా గొప్ప ఫలితాన్ని ఆ జాతకుడికి కలగజేస్తుంది. 

ప్రతి జాతకంలో కేంద్ర స్థానాలు ఆ వ్యక్తి  కష్టపడే తత్వాన్ని, సామర్థ్యాన్ని తెలియజేస్తాయి, కోన స్థానాలు అదృష్టాన్ని తెలియజేస్తేయి.

ఎప్పుడైతే కష్టానికి అదృష్టం తోడవుతుందో దాన్నే రాజయోగం అంటారు. కేంద్ర కోణాధిపతులు కేంద్రాలలో కలిస్తే దానినే రాజయోగం, కోణాలలో కలిసిన యోగం అనకపోయినా శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే యోగాలు ఎప్పుడూ కేంద్రాలలోని ఏర్పడతాయి. ఇతర స్థానాలు మధ్యమాలు, దుస్థానాలు అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వవు. నక్షత్ర జ్యోతిష్యం ఆధారంగా ఒక గ్రహం యొక్క నక్షత్రాధిపతి విశేష యోగాన్ని ఏర్పరిచిన ఆ గ్రహము అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.

యోగములు :

గ్రహాల కలయిక, స్వక్షేత్రము, స్థానము, ఉచ్చస్థితి వంటి ఆధారంగా అనేక రకముల గ్రహ యోగములు ఉన్నాయి. అయితే మనం చూసిన ప్రతి జాతకంలోనూ ఆ గ్రహ యోగములు మనం నేర్చుకున్న మాదిరిగానే కనిపించవు. నక్షత్రం ఆధారంగా వాటిని మనం సరిగా ఎలా అర్థం చేసుకోవచ్చు ఎప్పుడు పని చేస్తాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

అనేక రకమైన యోగములను బృహత్ పరశాస్త్ర వంటి గ్రంథాలలో పొందుపరిచారు, అయినా పూర్తిస్థాయిలో నక్షత్ర పరిశీలను ఆపాదించి చెప్పలేం కాబట్టి కావలసిన ముఖ్యమైన యోగాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మిగిలినవి మీ జ్ఞానం కొద్దీ ఆపాదించండి. 

ప్రతి మనిషి ఉన్నత జీవితాన్ని కోరుకుంటాడు, ఉన్నత జీవితం దక్కుతుందా లేదా అని జ్యోతిష్యులు అనేక యోగాలను పరిశీలిస్తారు, ఉన్నత జీవితమంటే నాలుగు కేంద్రాలు ప్రాథమికమైనవి, ఆరోగ్యము, ఉద్యోగము, గృహము, వివాహం. ఆ తరువాత అదృష్టము, సంతానము వంటివి. అన్ని రకాల సౌఖ్యముతో జాతకుడు జీవించుచు పదిమందికి ఉపయోగపడితే అదే విశేషం. 

గ్రహాలను లగ్నము నుంచి, చంద్రుని నుంచి, రవి నుంచి, దశానాధుడి నుండి ఇలా అనేక విధాలుగా పరిశీలించే సాంప్రదాయాలు ఉన్నాయి, కానీ మనం మాత్రం ఎప్పుడూ లగ్నం నుంచే పరిశీలించి ఫలితాన్ని నిర్ణయిస్తాము.

  • రాజయోగాలు
  • విపరీత రాజయోగాలు 
  • పంచ మహాపురుష యోగాలు 
  • ధనయోగము 
  • గజకేసరియోగము 
  • బుధాదిత్య యోగము 
  • చంద్రమంగళ యోగము 
  • సరస్వతి యోగము 
  • శంఖ యోగము
  • వంశోద్ధారక యోగము 
  • పరివర్తన యోగాలు 
  • ద్విగ్రహ యోగాలు 
  • త్రిగ్రహ యోగాలు
  • నీచ భంగ రాజ యోగాలు
  • యోగ బంగాలు & రాహుకేతు ప్రభావం 

యోగం :

ఒక గ్రహము ఒక స్థానంలో లేక మరో గ్రహంతో కలిసిన దానినే యోగమనబడును. అయితే ఇది శుభమా అనేది దాని నక్షత్ర స్థానాలను బట్టి ఆధారపడి ఉంటుంది.

ఒక గ్రహం యొక్క నక్షత్రాధిపతి ఆ లగ్నమునకు విశేష యోగ యోగకారకుడునితో సంబంధం ఏర్పడిన మనం అనుకున్నంత దానికి మించి శుభ ఫలితాలు ఇస్తారు.

ప్రతిసారి గ్రహము యొక్క నక్షత్రాధిపతిని పరిశీలించాలని పదేపదే నేను చెప్తుంటే మీకు విసుగు వస్తుంది, మీకు విసుగు వచ్చినా నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఎందుకంటే దానివల్లే ఫలితం వస్తుంది కాబట్టి, నక్షత్రాధిపతి స్వక్షేత్ర, ఉచ్ఛ, నక్షత్ర దిబ్బలము, యోగ కారక గ్రహ సంబంధం వంటి వాటిని పరిశీలించాలి.

రాజయోగాలు :

పన్నెండు లగ్నములకు విడివిడిగా కేంద్ర కోణాధిపతులు సమానంగా ఉంటారు, దానిలో శుభులు, పాపులు కూడా సమానమే.

కేంద్ర కోణాధిపతుల కలయికనే రాజయోగం అంటారు, కేంద్రాలు ఒక వ్యక్తి కష్టపడగలిగే తత్వాన్ని ఇస్తాయి, కోణములు పూర్వకర్మను అదృష్టాన్ని సూచిస్తాయి. 

మనం చేసే పనికి ఎక్కువ రెట్లు విజయం అదృష్టం కారణంగా కలుగుతుంది.

అయితే ఈ గ్రహముల యొక్క నక్షత్రాధిపతులు కేంద్ర కోణాధిపతులతో కలిసి యోగ కారక స్థితిలో ఉన్న ఆ యొక్క దశలో జాతకుడు విశేషాలు అభివృద్ధి పొందును. 

ఉదాహరణకు సింహ లగ్నానికి పంచమాధిపతి అయిన గురువు విశేష యోగ కారకుడు మరియు కోణాధిపతి రవితో కలిసి దశమ స్థానంలో ఉన్న విశేషం, అయితే వీరిద్దరూ చంద్రుడు యొక్క నక్షత్రంలో ఉంటూ చంద్రుడు అక్కడే ఉన్న మరింత గొప్ప ఫలితాన్ని ఈ యోగం ఇస్తుంది. 

రవి దశమంలో ఉండడం, లగ్నాధిపతి దశమస్థితి వల్ల, దాని నక్షత్రాధిపతి కూడా దశమంలో ఉండడం వలన విశేషమైన దిబ్బలం పొందినది, యోగ కారకుడు కూడా ఉచ్చ పొందిన చంద్రుడుతో కలవడం వలన రవికి మరింత బలం చేకూరినది, కాబట్టి జాతకుడు ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న గొప్ప స్థితికి వెళ్లే అవకాశం ఉంటుంది, దీనికి కావలసినది కొంచెం అనుకూలమైన దశ దొరికితే చాలు.

విపరీత రాజయోగాలు :

లగ్నము నుండి 6, 8, 12 స్థానములను దుస్థానములని, త్రికములని ముద్దుగా పిలుస్తారు. కానీ ఇది మన సరదా తీర్చేసే స్థానాలే. 

ఒక్కోసారి గ్రహములు ఈ దుస్థానమందు ఉన్న ప్రతికూల ఫలితాన్ని కలగజేస్తాయి, ఆరవ స్థానము రోగస్థానం, ఎనిమిదవ స్థానము ప్రమాద స్థానం, 12వ స్థానము ఖర్చు స్థానం ఇవన్నీ ప్రతికటిస్తే జీవితంలో ఆరోగ్యము ధనము లేక అడుగడుగునా భయపడుతూ జీవించాల్సిందే. 

ఎప్పుడైతే ఈ స్థానాధిపతులు స్వక్షేత్ర స్థితి పొందిన, మరో దుస్థానాధిపతి యొక్క స్థానంలో ఉన్న విపరీతమైన అభివృద్ధిని కలగజేస్తాయి.

అది ఎలా అనేది ఒక చిన్న ఉదాహరణతో తెలియజేస్తాను పది రూపాయలు ఉన్న విషయం పదివేల వరకు వెళ్లొచ్చు అది ధనము ఆరోగ్యము అధికారము ఏదైనా, తరువాత 2000 దాకా కిందికి వచ్చేస్తుంది అంటే ఎదురు దెబ్బ తగలొచ్చు తరువాత 50,000 వరకు పైకి వెళుతుంది, దీని అర్థం ఏంటంటే ప్రమాదం మీద ఒక అవగాహన కలగజేసి ఆ వ్యక్తికి ఒక చిన్న చురకలాగా అంటించి ప్రమాదాల భారీ పడకుండా ఎలా ఎదగాలి అనేది తెలియచేస్తాయి, అయితే ఈ విషయం జాతకుడు కాల్చుకుంటేనే తప్ప తెలియదు కాబట్టి ఇవి మనం ఊహించినట్టు సాఫీగా అభివృద్ధిలోకి వెళ్లరు. 

అయితే మనం నక్షత్ర జ్యోతిష్యాన్ని అవలంబిస్తున్నాం కాబట్టి ఒక చిన్న ఉదాహరణతో మీకు అర్థం చేయిస్తాను, వృశ్చిక లగ్నానికి కుజుడు లగ్నసత్యధిపతి అష్టమ స్థానంలో తన స్వనక్షత్రమైన మృగశిర లో ఉన్నాడు. 

లగ్నాధిపతి సహజంగా అష్టమ స్థానంలో ఉండకూడదు అయినా షష్ఠాధిపతి అయినందువలన అష్టమ స్థానంలో స్వనక్షత్రంలో ఉండడం ఒక విపరీత యోగం, ఇక్కడ ఒక గ్రహం సు నక్షత్రంలో ఉన్నప్పుడు అష్టమాధిపతి అయిన బుధుడు మేషన్లో ఉండి దాని నక్షత్రాధిపతి శుక్రుడు అయ్యి శుక్రుడు కూడా అక్కడే ఉన్నా మరింత విశేషంగా విపరీత యోగం ఏర్పడుతుంది. 

ఇక్కడ మూడు విపరీత యోగాలు ఏర్పడినాయి వ్యాధిపతి అయిన శుక్రుడు సునక్షత్రంలో, ఆరవ స్థానంలో ఉంటే, రాష్ట్రీయధిపతి అష్టమంలో ఉన్నాడు, బుధుడు అష్టమాధిపతి అయ్యి సస్టంలో ఉండి, నక్షత్రాధిపతి కూడా అక్కడే ఉన్నాడు.

ఒకవేళ ఇదే వృశ్చిక లగ్నానికి గురువు గనక ద్వితీయంలో ఉండి వీరిని (6, 8 స్థానాలను) చూసిన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. 

పంచ మహాపురుష యోగాలు :

పంచ మహాపురుష యోగాలు, పంచతార గ్రహాల చేత మాత్రమే ఏర్పడతాయి. (కుజుడు,బుధుడు, గురుడు, శుక్రుడు, శని)  లగ్నం నుండి గ్రహం స్వస్తానంలో లేదా ఉచ్ఛస్థానంలో కేంద్రములో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. 

మనం ఈ యోగాన్ని ఒక గ్రహం యొక్క నక్షత్ర నాధుడిని తీసుకుని మాత్రమే పరిశీలించుకుని ఏ దశలో దాని ఫలితం జరుగుతుందో చెప్పవచ్చు. 

రుచిక మహాపురుష యోగం : ఇది కుజుడి ఆధారంగా యోగం ఏర్పడుతుంది, ఆ లగ్నమునకు కుజుడు శుభుడా పాపా అనే విషయం సంబంధం లేకుండా ఇది పనిచేస్తుంది. ధైర్యం మరియు శారీరక శక్తిని ఇస్తుంది.

మేష లగ్నానికి లగ్నంలో, వృషభ లగ్నానికి సప్తమంలో, కర్కాటక లగ్నానికి సప్తమ, దసమాల్లో, సింహ లగ్నానికి చతుర్ధమందు, కుంభ లగ్నానికి దశమంలో కుజుడు ఉన్న రుచిక మహాపురుష యోగం అంటారు. కుజుడు దశమ స్థానంలో దిగ్బలాన్ని పొందుతాడు.

ఒక చిన్న ఉదాహరణతో నక్షత్ర జ్యోతిష్యంలో అర్థం చేసుకుందాం, సింహ లగ్నానికి శుక్ర దశ జరుగుతుంది, శుక్రుడు చిత్తా నక్షత్రంలో తృతీయ స్థానంలో ఉన్నాడు, నక్షత్రాధిపతి అయిన కుజుడు గురువుతో కలిసి చతుర్ధ స్థానంలో ఉన్నాడు. 

శుక్రుడు సింహలగ్నానికి పాపి అయినా, నక్షత్ర నాథుడు అయిన కుజుడు మరో మిత్రుడు అయిన గురువుతో కలిసి స్వక్షేత్రగతుడై రుచిత మహాపురుష యోగాన్ని ఏర్పరిచి, శుక్రుడు యొక్క నక్షత్ర నాథుడు దిబ్బలం పొందిన కారణంగా ఖచ్చితంగా శుక్ర దశ విశేషమైన ధన భూ విద్య వ్యాపార లాభాలను అనేక విధాలుగా జాతకుడికి కలగచేయను. 

అయితే ఒక ముఖ్య గమనిక ఈ కుజుడు గురువు ఏదైతే నక్షత్రంలో ఉన్నారో వారి ఉన్న నక్షత్రాలలో రాహుకేతువులు కచ్చితంగా ఉండకూడదు, కుజగురువులిద్దరూ కూడా వక్రీంచకూడదు అప్పుడే ఈ యోగం పూర్తిగా పనిచేస్తుంది ఇది నా పరిశీలన. 

భద్ర మహాపురుష యోగం : ఇది బుధ గ్రహం ఆధారంగా ఏర్పడుతుంది, లగ్నం నుంచి బుధుడు కచ్చితంగా కేంద్రాల్లో ఉంటూ ఉచ్చ లేదా స్వక్షేత్రగతులు అయి ఉండవలసింది, ఇది తెలివితేటలు మరియు వాక్చాతుర్యాన్ని ఇస్తుంది.

మీన లగ్నానికి బుధుడు సప్తమ మారకాధిపతి అయినా సప్తమంలో ఉన్న అది భద్ర మహాపురుష యోగం అవుతుంది, అయితే ఈ విషయాన్ని ఎప్పుడు ఎలా పరిశీలిస్తున్నామనేది చాలా ముఖ్యం. 

ఉదాహరణకు ఇదే మీన లగ్నానికి బుధ దశ జరుగుతుంది, బుధ చంద్రులు ఇద్దరు కూడా హస్తా నక్షత్రంలో సప్తమ స్థానంలో ఉన్నారు, బుద్ధుని యొక్క నక్షత్రాధిపతి యోగ కారకుడు.

చతుర్ధ సప్తమాధిపతి చేత కలవడం వలన చంద్రుడు దిగ్బలాన్ని పొందాడు, యోగ కారకుడు యొక్క సంబంధం వలన, ఉచ్చ పొందిన గ్రహముతో కలిసి ఉండటం వలన కచ్చితంగా సప్తమ భావ ఫలితాలు విశేషంగా ఉంటాయి. కొసమెరుపుగా మంచి సత్సంతాన యోగం కూడా ఏర్పడింది. 

ఈ విధంగా ఇతర లగ్నాలకు భద్ర మహాపురుష యోగం ఎలా ఏర్పడుతుందో ఒక్కసారి ఆలోచించండి. 

హంస మహా పురుషయోగం :  గురువు హంస మహా పురుష యోగాన్ని ఏర్పరుస్తాడు, స్వక్షేత్ర ఉత్సక్షేత్రం ఉంటూ లగ్నం నుండి కేంద్రాలలో ఉండాలి.  జ్ఞానం మరియు ఆధ్యాత్మికతను ఇస్తుంది.

మేష లగ్నానికి చతుర్దంలో, తుల, మిధున లగ్నాలకు దశమంలో, ధనుర్ లగ్నానికి లగ్న చతుర్ధాలలో గురువు వలన హంస మహాపురుష యోగం ఏర్పడుతుంది. 

ఆ లగ్నాలకు యోగ కారకుడైన మరింత అనుకూలంగా ఉంటుంది దానిలో ఎటువంటి సందేహం లేదు, ఒకవేళ ఆ గురువు ఆ లగ్న యోగ కారకులు యొక్క నక్షత్రంలో ఉంటూ ఈ యోగాన్ని ఏర్పరిచిన ఇతర లగ్నాలకు కూడా విశేషంగా యోగిస్తుంది. 

మిధున లగ్నానికి గురుదశ జరుగుతుంది, గురువు మీనంలో ఉంటూ హంస మహా పురుష యోగాన్ని ఏర్పరిచాడు, నక్షత్రాధిపత అయిన బుధుడు లగ్నమందు దిబ్బలం పొంది యోగ కారకుడైన శుక్రుడితో కలిసి ఉన్నాడు, దీని కారణంగా గురుదశ అఖండంగా యోగించును. 

మాలవ్య మహాపురుష యోగం :  శుక్రుడి వలన ఏర్పడుతుంది, ఇది అందం, వైభవం మరియు కళాత్మక ప్రతిభను ఇస్తుంది.

మనకు తెలిసిన గ్రహబలాలను, గ్రహణం యొక్క నక్షత్రనాధునికి ఆపాదిస్తేనే సరైన ఫలితాన్ని చెప్పగలుగుతాం.

శుక్రుడు చతుర్ధమందు దిబ్బలాన్ని పొందుతాడు, ఉత్తమ దేఖానము, వర్గోతమము వంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఒక ఉదాహరణ చెప్పుకుందాం. 

మిధున లగ్నానికి దశమ స్థానంలో రేవతి నక్షత్రంలో శుక్రుడు ఉచ్చ పొంది ఉన్నాడు, శుక్రదసే జరుగుతుంది, శుక్రుడు ఉత్తమద్రేకనంలో వర్గోతమం చెంది, చతుర్ధాధిపతి నక్షత్రం అవడం వలన దిక్బలాన్ని కూడా పొందాడు. శుక్ర బుధులు సహజంగా పక్కపక్కనే ఉంటారుగా బుధుడు మాత్రం భరణి నక్షత్రంలో మేషం లో ఉన్నాడు, ఇప్పుడు చెప్పండి ఈ మాలవ్య యోగం ఎందుకు గొప్పగా పని చేయదు. 

ఒక గ్రహము స్వ నక్షత్రంలో ఉన్న, పరివర్తన పొందిన రా. రాశి అధిపతి సరిగా లేకపోయినా కొన్ని సందర్భాలలో గ్రహాలు వక్కిరించిన, రాహుకేతులతో కలిసిన సరైన ఫలితాలు రావు.

శశ మహా పురుష యోగం : శని స్వక్షేత్ర ఉచ్చ క్షేత్ర గతుడై లగ్నము నుండి కేంద్రాలలో ఉన్న ఈ యోగం ఏర్పడను, ఇది క్రమశిక్షణ మరియు నాయకత్వ లక్షణాలను ఇస్తుంది.

తులా లగ్నం, లగ్నంలో శని శుక్రులు కలిసిన కేంద్ర కోణాధిపతుల కలయిక రాజయోగం అవుతుంది, రెండు గ్రహాలు ఇక్కడ ఉండడం వలన మాలవ్య మహాపురుష యోగము అలానే శశి మహాపురుష యోగము ఏర్పడుతుంది, ఏదైనా ఒక గ్రహం ఎక్కడ ఉన్నా శని గాని శుక్రుడు యొక్క నక్షత్రంలో గానీ ఉంటే ఆ దశ కచ్చితంగా విశేషం అవుతుంది.

శని స్వక్షేత్రగతుడవడం, దిగ్బలాన్ని పొందడం, దాని నక్షత్రాధిపతి కూడా బాగుండడం ఇలాంటి వాటిని పరిశీలించి ఇంకా గొప్పగా మీరు ఫలితాన్ని చెప్పవచ్చు, మరి ఈ విధంగా శశ మహాపురుష యోగం ఏర్పడుతుందో ఊహించుకోండి. ఇతర లగ్నాలకు శని వల్ల యోగం ఏర్పడిన, శని తో పాటు ఆ లగ్నానికి యోగ కారకుడు యొక్క సంబంధం ఉంటే చాలా మంచిది.

అన్ని పురుష యోగాలు ఉన్నాయి, స్త్రీకి అటువంటి యోగాలు లేవా అని సందేహం రావచ్చు, ఇదే యోగాన్ని స్త్రీపురుష జాతకాల్లో పరిశీలించవచ్చు, మహర్షి ఏ భావనతో రాసాడు అనేది ఇంకా నాకు తట్టలేదు 😃

ధనయోగము :

జాతక చక్రంలో ద్వితీయము ధనస్థానము, ఒక వ్యక్తి తాను చేసే పని వల్ల సహజంగా ధనాన్ని సంపాదిస్తాడు, కొన్ని సందర్భాల్లో పూర్వీకుల యొక్క ఆస్తి, ఆకస్మిక ధన ప్రాప్తి మరీ ఇతర విషయముల వల్ల కూడా ధనము రావచ్చు, రాకుండా ఉండవచ్చు కూడా, అనుకున్న దాని కన్నా తక్కువ కూడా రావచ్చు. 

పంచమస్థానము భాగ్యస్థానము జాతక చక్రంలో అదృష్ట స్థానాలు గా చెప్తారు, పూర్వ జన్మలో చేసుకున్న శుభకర్మ ఆధారంగా ఆ యొక్క గ్రహాల అనుకూలతను బట్టి జాతకుడు ఈ జీవితంలో తను చేసిన పనికి ఎక్కువ రేట్లు ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. 

ధనస్థానంలో లేక మరీ ఇతర స్థానంలో అయినా పంచమ భాగ్యస్థానాల సంబంధము, లాభ స్థాన సంబంధం ఏర్పడిన జాతకుడు ధనవంతుడు అవుతాడు, వీటికి దుస్తాన సంబంధం ఏర్పడిన కొంత ధనం ఖర్చు అవుతుంది, కేవలం దుస్థానాలతో సంబంధమే ఉంటే ఎంత డబ్బు ఉన్నా నిలవదు. 

ఉదాహరణకి ఒక లగ్నము తీసుకొని చెప్పుకుందాం, కుంభ లగ్నానికి కుజదశ జరుగుతుంది, కుజుడు యొక్క నక్షత్రాధిపతి శుక్రుడయ్యాడు, శుక్రుడు బుధుడు, గురువుతో కలిసి ఏకాదశంలో ఉన్నాడు.

దశానాధుడు యొక్క నక్షత్ర నాథుడు ద్వితీయ లాభాధిపతి అయిన గురువుతో కలిసి ఉండడం, పంచమ భాగ్యాధిపతులైన యోగ కారకులు గురువుతో కలవడం, శుభగ్రహాలన్నీ లాభంలో ఉండడం వలన కచ్చితంగా విశేషమైన ధన ప్రాప్తి జరుగుతుంది. ఇప్పుడు ఈ జాతకుడికి ఏ గ్రహమైన శుక్ర, బుధ, గురు నక్షత్రాల్లో ఉంటే వీరు లాభంలో ఉండడం వల్ల ఆ దశలన్నీ ధనాన్ని కచ్చితంగా ఇస్తాయి.

గజకేసరియోగము :

గజము అనగా ఏనుగు కేసరి అనగా సింహం ఈ రెండు పరస్పరం విరుద్ధమైన జంతువులు, ఏనుగు కలలోకి సింహం వచ్చినా ఏనుగు చనిపోతుంది, సింహం కలలోకి ఏనుగు వచ్చినా సింహం చనిపోతుంది, అంత విరుద్ధమైన జంతువులు. అలాంటి రెండు జంతువులు కలిసి ఒక తాటి మీదికి వచ్చి ఏదైనా విషయం కోసం పని చేస్తే ఎంత బాగుంటుందో ఈ యోగం యొక్క ఫలితం అంత బాగుంటుంది. 

గురు చంద్రుడు కేంద్ర స్థానాలలో కలిసినప్పుడు, అది గురువుకి గానీ చంద్రుడికి గాని స్వక్షేత్ర ఉత్స క్షేత్రాలైనప్పుడు ఈ యోగం వర్తిస్తుంది. 

ఉదాహరణకు సింహ లగ్నానికి రవి మకరంలో శ్రవణా నక్షత్రంలో ఉన్నాడు, గురు చంద్రులు ఇద్దరు కలిసి దశమ స్థానంలో రోహిణి నక్షత్రంలో ఉన్నారు. 

ఇప్పుడు రవి దశ జరిగితే, నక్షత్రాధిపతి దశమంలో ఉచ్చ పొంది యోగ కారకుడితో కలుస్తూ, ఉత్తమ ద్రెక్కన్నాన్ని పొందడం, వర్గత్తమం, పుష్కర నవాంస, దిగ్బలం పొందడం విశేషం అవుతుంది.

గురువు మేధస్సు, జ్ఞానానికి, చంద్రుడు సున్నితత్వానికి, సుఖానికి, మానసిక సంతోష ఉన్నసానికి, ధనము ఆహారము అన్ని జీవితంలో సమృద్ధిగా దొరుకుతాయి. 

రెండు శుభగ్రహాలు కలవడం లేక పరస్పర కేంద్రాలలో ఉండడం వలన ఏదైతే సాధించగలుగుతామో దానిని లక్ష్యంగా పెట్టుకొని సాధిస్తారు. 

బుధాదిత్య యోగము :

రవి బుధులు కలిసి కేంద్రాలలో ఉండి అవి స్వక్షేత్ర, ఉచ్చ క్షేత్రాలు అయితే బుధాదిత్య యోగం ఏర్పడుతుంది, దీని వలన అధికారం, తెలివితేటలు, మంచి మాటకారితనం కార్యక్రమం, విజయం లభిస్తాయి. 

కర్కాటక లగ్నానికి రవి బుధులు కలసి దశమ స్థానంలో ఏర్పడిన ఈ బుధాదిత్య యోగం ఏర్పడుతుంది, లగ్నం మీద గురుడు ఆశ్లేష నక్షత్రంలో ఉన్న, నక్షత్రాధిపతి బుధుడు రవితో కలిసి బుధాదిత్య యోగం ఏర్పడడం కారణంగా ఆ గురు దశ విశేష శుభ ఫలితాలను కలగజేస్తుంది.

చంద్రమంగళ యోగము :

చంద్రుడు ఏ గ్రహముతో కలిసిన అది ఒక యోగం ఏర్పడును, ప్రతి యోగమునకు ఫలితాలు ఉన్నాయి, అందులో చంద్రమంగళ యోగం విశిష్టమైనది.  యోగం కలిగిన వాళ్ల తలరాతను వాళ్లే రాసుకో గల శక్తివంతులు.

చంద్ర కుజులు కలిసి స్వక్షేత్రాల్లో, ఉచ్చ స్థానాల్లో ఉంటూ, లగ్నమునకు కేంద్రాల్లో ఉంటే ఈ యోగం ఏర్పడును. అయితే ఈ యోగం ఆ లగ్నాలకు అనుకూలమైతే శుభ ఫలితాలను ఇస్తుంది. 

ఉదాహరణకి కర్కాటక లగ్నానికి కుజ చంద్రుల కలయిక దశమ స్థానంలో శుభ ఫలితాన్ని ఇస్తుంది, ఏదైనా ఒక గ్రహం చంద్ర లేక కుజ నక్షత్రాలలో ఉంటే ఆ దశలు విశేషంగా యోగిస్తాయి.

రవి కుజలు కలిసిన రవి మంగళ యోగం, గురు కుజులు కలిసిన గురుమంగళ యోగం, ఇవన్నీ శుభ ఫలితాన్ని ఇస్తాయి. 

కుజ శుక్రులు కలిసిన అది ఒక రకమైన ఆకర్షయోగం. 

కుజ బుధులు కలవకూడదు. దీనివలన అనేక రకమైన ఆలోచనలతో ఏ పని ఆచరించలేక పోతుంటారు. కొన్ని సందర్భాలలో విశ్లేషకులుగా వ్యవహరిస్తారు.

సరస్వతి యోగము :

గురు బుధ శుక్రులు లగ్నం నుంచి కేంద్ర కోణములలో గాని, ద్వితీయంలో ఉన్న అది సరస్వతి యోగం అవుతుంది, దీనివల్ల విద్యా, జ్ఞానము, సాత్విక గుణము కలుగుతాయి. 

గురువు దేవ గురువైన బృహస్పతి, శుక్రుడు ధైర్యగురు వీరిద్దరూ గురువులు అయినందువలన, వారి కలయిక కూడా జ్ఞానాన్ని కలగజేస్తుంది. 

గురువు, బుధుల కలయిక మన మీద ఎదుటివారికి నమ్మకం ఉండేటట్టు చేస్తుంది. 

చత్ర యోగం :

లగ్న షష్ఠాధిపతుల కలయికను చత్ర యోగం అంటారు. వీళ్ళు ఆరాట పోరాటం తత్వాన్ని కలిగి ఉంటారు. వీళ్ళతో గొడవకు దిగితే మనం ఓడిపోవడమే.

శంఖ యోగము : need to verify

శంక యోగం (Sankh Yoga) ఏర్పడేందుకు శని మరియు కుజల మధ్య ఉన్న సంబంధం చాలా ముఖ్యమైనది. సాధారణంగా, ఈ యోగం ఏర్పడడానికి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి:

1. సంయుక్త రాశి: శని మరియు కుజ గ్రహాలు ఒకే రాశిలో ఉండడం.

2. అస్పెక్ట్: శని మరియు కుజ ఒకరినొకరు చూస్తే (అంటే ఒకరినొకరు అంగిలించేటప్పుడు), ఈ యోగం ఏర్పడుతుంది.

3. కేంద్ర సంబంధం: శని మరియు కుజలు జాతకంలో 4, 7, లేదా 10వ గృహాలలో పరస్పరం ఉన్నప్పుడు.

సంక యోగం ఏర్పడే ముఖ్యమైన పరిస్థితులు:

1. రాశి పరిణామం: శని మరియు కుజలు ఒకే రాశిలో ఉంటే లేదా పరస్పరం 7వ రాశిలో ఉంటే.

2. గ్రహ దృష్టి: శని కుజను దృష్టి చేస్తే లేదా కుజ శనిని దృష్టి చేస్తే.

3. కేంద్ర సంబంధం: శని మరియు కుజలు ఒకరికి 4వ, 7వ, లేదా 10వ గృహంలో ఉంటే.

ఉదాహరణలు:

1. రాశి పరస్పరం: శని మరియు కుజలు ఒకే రాశిలో ఉంటే (ఉదాహరణకు, శని మరియు కుజలు ఇద్దరూ మేష రాశిలో ఉంటే).

2. దృష్టి సంబంధం: శని 3వ గృహంలో ఉంటే మరియు కుజ 7వ గృహంలో ఉంటే, ఈ యోగం ఏర్పడవచ్చు.

3. కేంద్ర సంబంధం: శని లగ్నంలో ఉంటే మరియు కుజ 4వ గృహంలో ఉంటే.

ఈ యోగం ఏర్పడినప్పుడు, జాతకుడికి బలమైన సంకల్పం, దృఢత్వం మరియు అధిక ఆత్మవిశ్వాసం ఉంటుంది. కానీ, ఈ యోగం వలన కొన్నిసార్లు సంఘర్షణలు మరియు అడ్డంకులు కూడా ఎదురవచ్చు.

శని మరియు కుజ గ్రహముల కలయిక వలన సంక యోగం ఏర్పడుతుంది. సంక యోగం (Sankh Yoga) అనేది జ్యోతిష్యశాస్త్రంలో ముఖ్యమైన యోగాలలో ఒకటి, ఇది శని మరియు కుజ గ్రహాల సమాన శక్తి కలయిక వలన ఏర్పడుతుంది. ఈ యోగం వలన వ్యక్తి జీవితంలో కొన్ని ముఖ్యమైన ప్రభావాలు ఉంటాయి:

1. బలమైన సంకల్పం: ఈ యోగం కలిగి ఉన్న వ్యక్తులు బలమైన సంకల్పం మరియు ధైర్యం కలిగి ఉంటారు. వీరు తమ లక్ష్యాలను సాధించడానికి బలంగా కృషి చేస్తారు.

2. సంఘర్షణలు: శని మరియు కుజ గ్రహాల సమాన శక్తి వలన కొన్నిసార్లు వ్యక్తి జీవితంలో సంఘర్షణలు మరియు ఇబ్బందులు రావచ్చు. కానీ, వీరు ఈ సమస్యలను అధిగమించగలరు.

3. అధికారత: ఈ యోగం వలన వ్యక్తి సార్వభౌమ స్థాయిలో అధికారం కలిగి ఉండవచ్చు. వీరు తమ చుట్టూ ఉన్న ప్రజలపై ప్రభావం చూపగలరు.

4. శక్తి మరియు దృఢత్వం: శని యొక్క సహనం మరియు కుజ యొక్క శక్తి కలయిక వలన ఈ యోగం కలిగి ఉన్న వ్యక్తులు శక్తివంతంగా మరియు దృఢంగా ఉంటారు.

5. పోరాటం మరియు విజయం: ఈ యోగం ఉన్న వ్యక్తులు పోరాటం చేయడంలో నిష్ణాతులు అవుతారు మరియు చాలా సందర్భాలలో విజయాన్ని సాధిస్తారు.

ఈ యోగం యొక్క ప్రభావం జాతకంలో ఇతర గ్రహాల స్థితి, రాశి, మరియు అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. 

శంఖ యోగం (Shankh Yoga) జ్యోతిష్యంలో ఒక ముఖ్యమైన యోగంగా పరిగణించబడుతుంది. ఈ యోగం జాతకంలో ఉంటే, వ్యక్తికి బాగ్యవంతం, విద్య, సంపద, మరియు శ్రేయస్సు కలిగిస్తుంది. 

శంఖ యోగం ఏర్పడే పరిస్థితులు:

శంఖ యోగం ఏర్పడేందుకు జాతకంలో కొన్ని ప్రత్యేకమైన స్థితులు ఉండాలి:

1. లగ్నాధిపతి మరియు పంచమాధిపతి: లగ్నాధిపతి (Ascendant lord) మరియు పంచమాధిపతి (5th house lord) తమ తమ స్వస్థానంలో లేదా పరస్పర స్వస్థానంలో ఉండాలి.

2. కేంద్ర మరియు త్రికోణ సంబంధం: లగ్నాధిపతి మరియు పంచమాధిపతి గృహాలు 1వ, 4వ, 7వ, లేదా 10వ గృహాలలో ఉండాలి. 

3. లాభాధిపతి మరియు 9వ గృహాధిపతి: లాభాధిపతి (11th house lord) మరియు 9వ గృహాధిపతి (9th house lord) కూడా తమ తమ స్వస్థానంలో ఉండాలి లేదా పరస్పరం సంబంధం కలిగి ఉండాలి.

శంఖ యోగం యొక్క ఫలితాలు:

ఈ యోగం కలిగిన వ్యక్తులకు జీవితంలో వివిధ రంగాల్లో బాగ్యవంతం కలిగి ఉంటారు:

1. విద్యలో విజయం: విద్యారంగంలో అత్యద్భుత ఫలితాలు సాధిస్తారు.

2. ఆర్థిక అభివృద్ధి: సంపద, ధనం, మరియు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది.

3. విశిష్ట వ్యక్తిత్వం: మంచి వ్యక్తిత్వం, సత్సంగం, మరియు ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుంది.

4. పారిపార్శ్వాలు: జీవితంలో అన్ని పారిపార్శ్వాలలో కూడా అభివృద్ధి ఉంటుంది.

5. శ్రేయస్సు: శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

శంఖ యోగం వివిధ రాశులలో:

ప్రతి రాశిలో శంఖ యోగం ఏర్పడే విధానం, దాని ఫలితాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. అందుకని, జాతకాన్ని పూర్తిగా విశ్లేషించడం చాలా ముఖ్యం.

కొన్ని ముఖ్యమైన పాయింట్లు:

– శంఖ యోగం కలిగిన వ్యక్తులు జీవితంలో మంచి పేరుప్రతిష్ట పొందుతారు.

– ఈ యోగం వలన ఆత్మవిశ్వాసం, సంతోషం, మరియు ఆనందం కలిగివుంటాయి.

– శంఖ యోగం ఉన్నవారు సామాజిక మరియు కుటుంబ పరంగా కూడా మంచి స్థాయిలో ఉంటారు.

మొత్తం మీద, శంఖ యోగం జాతకంలో ఉంటే, అది మంచి ఫలితాలను కలిగించే యోగం అని చెప్పవచ్చు.

వంశోద్ధారక యోగము :

లగ్నాధిపతి దశమ స్థానంలో ఉంటే వంశోద్ధారక యోగం అంటారు. తల్లి గారి తరపున, అక్క గారి తరపున అందరిలోనూ ఎవరు సాధించలేనంత గొప్ప స్థితికి వెళ్లే అవకాశం ఉంది.

పరివర్తన యోగాలు :

పరివర్తన యోగాలలో నక్షత్ర పరివర్తనం విశేషమైనది, కేంద్ర కోణాధిపతులు పరివర్తన చెందిన అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. 

ఉదాహరణకు సింహ లగ్నానికి కుజ మరియు శుక్రులు రాశి పరివర్తనం చెంది వారి యొక్క స్వనక్షత్ర స్థితిని పొందిన విశేషం. 

మిధున లగ్నానికి శుక్ర బుధులు దశమ ఏకాదశ స్థానాలలో పరివర్తన విశేషం. ఇలాంటప్పుడు రాశి అధిపతులు బాగుంటేనే పూర్తి యోగం వర్తిస్తుంది.

మిధున లగ్నానికి షష్ట అష్టమాధిపతులైన శని కుజుల రాశి మరియు నక్షత్ర పరివర్తనం అవకాశం ఉంది, దీనివలన కూడా విశేష ఫలితాలు వస్తాయి. ఇది ఒక విపరీత యోగం. 

ఇదే పరివర్తనం అష్టమ భాగ్యాధిపతులు పరివర్తనం చెందిన ఆశుభ ఫలితాలు ఇస్తారు.

ద్విగ్రహ యోగాలు :

రెండు గ్రహాలు కలవడానికి ద్విగ్రహ యోగము అంటారు. అలా కలిసినప్పుడు వారిలో ఎవరు బలవంతులు, వారి సంబంధం బాగుందా, లేక వాళ్ళు ఏమన్నా గొడవ లాంటి పెట్టుకుంటున్నారా, మంచి నక్షత్రాల్లో ఉన్నారా, అందరూ ఒకే నక్షత్రాల్లో ఉన్నారా, ఇలా అన్ని బెరేజు వేసుకొని చెప్పాల్సి ఉంటుంది.

S NOPlanet 1Planet 2Result
1SuMoMood & Soul, Decision Wavering 
2SuMaCommand / Aggressive
3SuMeRight Mathematical 
4SuJuGreat teaching, Good with money
5SuVeExpects tasty food, Stylish
6SuSaHardworking, Sharp and Straightforward, Tough 
7SuRaEgo, Opportunity Losing 
8SuKeSceptical, Identity, Leading to Spiritual
9MoMaEmotional, Rewriting Destiny
10MoMeCreative at Writing, Art, Good at Communication 
11MoJuReachable Goals, Soft, Positive
12MoVeCreative at Painting, Art, Good at Signing, Dancing 
13MoSaWant to do everything quick, but everything is late
14MoRaWorried mind, no one can get out it 
15MoKeDetachment 
16MaMeFickle mind, diversions, analytical, criticism
17MaJuLogical, Problem solvers
18MaVeAttraction, Passion, Desire, Creative, Chemical
19MaSaAggressive, Tough, Extreme energy  
20MaRaTesting, Investigative, Research 
21MaKeAll of sudden, unexpected 
22MeJuGood at speech, Teaching, Training, Counselling
23MeVeBondage, Stragical, Ideas 
24MeSaAnalytical, Manipulative Mathematics
25MeRaGambling, Overthinking 
26MeKeDecision Making, Educational obstacles, past life karma ( good at maths etc ) 
27JuVeGreat knowledge, good at education, comfortable 
28JuSaPractical understanding of knowledge
29JuRaStuck in situation, Litigation
30JuKeSpiritual
31VeSaDissatisfied, Extreme of Specifications
32VeRaFantasy, Extreme of Imagination, Creative
33VeKeDisappointment in Comforts & Desires
34SaRaExtreme Ideology, Unconventional Thinking, Dark World
35SaKeDetached, Spiritual, Late of Late

త్రిగ్రహ యోగాలు :

మూడు గ్రహాలు కలవడాన్ని త్రిగ్రహ యోగం అంటారు. యోగాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. రవి శనులు కలిసిన అది ఒక దోషం, అయితే బుధుడు వారితో కలిసిన అంతగా దోషం ఉండదు. 

కుజ శనుల కలయిక యుద్ధప్రీతిస్తుంది, వారితో బుధుడు చేరిన ఆలోచన వలన అనవసరమైన యుద్ధానికి సిద్ధం కారు.

ఒక మచ్చుకి ఇలా వివరించాను, కానీ ఒక గ్రహం యొక్క నక్షత్రాధిపతి ఎవరెవరితో కలిసి ఉన్నాడు ఎక్కడున్నాడు ఎవరు చేత చూడబడుతున్నాడు, ఆ రాశిలో బలమైన గ్రహం ఏది, అది లగ్నానికి ఎంత అనుకూలమైనది ఇలాంటివన్నీ పరిశీలించుకొని ఫలితాన్ని చెప్పవలసి ఉంటుంది.

నీచభంగ రాజయోగం :

జ్యోతిష్యంలో ఒక ముఖ్యమైన యోగం. ఇది ఒక గ్రహం నించ స్థితిలో ఉన్నప్పుడు మరియు ఆ స్థితి భంగం చెయ్యబడినప్పుడు ఏర్పడుతుంది. నీచభంగ రాజయోగం ఉన్న వ్యక్తి జీవితంలో సమస్యలను అధిగమించి, సమృద్ధి, శ్రేయస్సు పొందుతాడు. 

నీచభంగ రాజయోగం ఏర్పడే పరిస్థితులు:

1. నీచ స్థితిలో ఉన్న గ్రహం అదే రాశిలో ఉన్న ఉత్తమ గ్రహం వల్ల భంగం చెయ్యబడాలి.

2. నీచ స్థితిలో ఉన్న గ్రహం యొక్క అధిపతి కేంద్రస్థానంలో లేదా త్రికోణ స్థానంలో ఉండాలి.

3. నీచ స్థితి ఉన్న గ్రహం యొక్క నక్షత్రంలో మంచి గ్రహం ఉండాలి.

ఉదాహరణలు:

1. శుక్రుడు కన్యా రాశిలో:

   – సంబంధం: కన్యా రాశిలో శుక్రుడు నీచ స్థితిలో ఉంటాడు.

   – నీచభంగ: కన్యా రాశిలో బుధుడు లేదా మెర్క్యురి కూడా ఉన్నప్పుడు, శుక్రుడి నీచస్థితి భంగం చెయ్యబడుతుంది. ఇది వ్యాపారంలో, విద్యలో విజయాలను ఇస్తుంది.

2. చంద్రుడు వృశ్చిక రాశిలో:

   – సంబంధం: వృశ్చిక రాశిలో చంద్రుడు నీచస్థితిలో ఉంటాడు.

   – నీచభంగ: వృశ్చిక రాశిలో కుజుడు లేదా అంగారకుడు కూడా ఉన్నప్పుడు, చంద్రుడి నీచస్థితి భంగం చెయ్యబడుతుంది. ఇది మానసిక శాంతి, కుటుంబ సుఖాలను ఇస్తుంది.

3. బుధుడు  మీనం రాశిలో:

   – సంబంధం: మీనం రాశిలో బుధుడు నీచస్థితిలో ఉంటాడు.

   – నీచభంగ: మీనం రాశిలో గురు లేదా జూపిటర్ కూడా ఉన్నప్పుడు, బుధుడి నీచస్థితి భంగం చెయ్యబడుతుంది. ఇది విద్య, వ్యాపార రంగాల్లో విజయాన్ని ఇస్తుంది.

4. సూర్యుడు తులా రాశిలో:

   – సంబంధం: తులా రాశిలో సూర్యుడు నీచస్థితిలో ఉంటాడు.

   – నీచభంగ: తులా రాశిలో శుక్రుడు లేదా వీనస్ కూడా ఉన్నప్పుడు, సూర్యుడి నీచస్థితి భంగం చెయ్యబడుతుంది. ఇది నాయకత్వ లక్షణాలు, అధికారాన్ని పెంచుతుంది.

ఫలితాలు:

నీచభంగ రాజయోగం ఉన్న వ్యక్తులు వారి జీవితంలో ఎలాంటి కష్టాలను అధిగమించి, విజయాలు, సుఖాలు పొందుతారు. ఈ యోగం ఉన్న వ్యక్తులు సాధారణంగా సమాజంలో ప్రతిష్ట పొందుతారు. 

నీచభంగ రాజయోగం ఉన్నతమైన స్థితిలో ఉండడానికి, జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ద్వారా జాతకాన్ని పరిశీలించడం మంచిది.

యోగ బంగాలు & రాహుకేతు ప్రభావం :

యోగాలు చూడడానికి చాలా స్వచ్ఛంగా అమాయకంగా కనిపిస్తూ ఉంటాయి, ఏదో ఒక గ్రహం వల్ల, దృష్టి వల్ల, కలయిక వల్ల, పాపార్గళం,  నక్షత్ర సంబంధం వల్ల ఇవి దెబ్బతింటూ ఉంటాయి. 

చిన్న ఉదాహరణతో మీకు చెప్తాను మేష లగ్నానికి చతుర్దంలో గురువు ఉన్న హంస మహాపురుష యోగంగా పరిగణిస్తారు, ఇప్పుడు చూడండి గురువు పుష్యమిలో ఉన్నాడు, రాహువు అనురాధ లో ఉన్నాడు వీళ్లిద్దరూ ఒకే నక్షత్రంలో ఉండడం వలన గురువులకు దోషం కలిగినది.

గురువు కొన్ని రోజుల తర్వాత వక్రీంచాడనుకుందాం అలాంటప్పుడు కూడా దోషం కలిగినట్టే.

అనేక రకమైన ఇతర పాప గ్రహాలు ఆ గురువుని వీక్షించిన అంత గొప్పగా ఫలితాన్ని ఇవ్వడు, గురువు పునర్వసు నక్షత్రంలోనే కర్కాటకంలో ఉన్నాడు అనుకున్న, రాశ్యధిపతి అయిన చంద్రుడు నీచంలో పడిన ఆ యోగం ఫలించదు. 

ముగింపు :

ఇన్ని యోగాలు చెప్తే ఎలా గుర్తు పెట్టుకుంటాం అనే ప్రశ్న తలెత్తుతుంది, అన్ని యోగాలు మర్చిపోండి, గ్రహం యొక్క నక్షత్రాధిపతి, అనుకూలమైన స్థానాల్లో ఉన్నాడా, మిత్రగ్రహాలతో కలిశాడా, స్వక్షేత్ర, ఉచ్చ పొందడా, కేంద్ర కోణాల్లో ఉన్నాడా అనేది ఒక్కటి చూడండి బావుందంటే అక్కడ యోగం ఉన్నట్టే.