ఉపోద్ఘాతం :
రాశులు ఊహాజనితమైనవి అని అందరికీ తెలిసిందే, అలా అని మన సరదాకి ఊహించుకోకూడదు.
గోదారి గట్టుంది, గట్టుమీద చెట్టు ఉంది, చెట్టుమీద పిట్టఉంది, పిట్ట మనసులో ఏముంది, ఇది చాలా పాత పాట కానీ ప్రస్తుతానికి మనం వాడుకుందాం.
ఇలా అన్నీ కలిసిన దృశ్యాన్ని చూడ్డానికి చాలా బాగుంది అనిపిస్తుంది, దాంట్లో ఏ ఒక్కటి విడిగా ఉన్న మనం గుర్తించగలుగుతాం, అన్ని కలిసున్నా గుర్తించగలుగుతాం.
అలాగే ఒక గ్రహం ఒక రాశిలో ఉంది, ఒక నక్షత్రంలో ఉంది, లగ్నం నుంచి ఒక స్థానంలో ఉంది, మరో గ్రహం చేత చూడబడుతుంది, మరో గ్రహంతో కలిసింది ఇలా అనేక సందర్భాల పరిణామాన్ని మనం గుర్తించడం వస్తే జ్యోతిష్య ఫలితం చెప్పడం సునాయాసం అవుతుంది.
ఇంతకుముందుగా మనం మాట్లాడుకున్న గొప్పరాజ్యం అనే కథ ఆధారంగా రాశి, గ్రహ కారకత్వాల మీద ఒక అవగాహన వచ్చుంటుంది. ఇప్పుడు దాన్ని ఫలిత జ్యోతిషంలో ఎలా వాడాలనేదే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం.
లగ్నమే ఆధారం :
ఆకాశంలో అందంగా ఎగిరే గాలిపటానికి దారమే ఆధారమైతే, లగ్నం లేనిదే ఫలిత నిర్ణయం చేయడం అసాధ్యం, కాబట్టి మనం నేర్చుకునేటప్పుడే లగ్నం ఆధారంగా అర్థం చేసుకుంటే ఫలిత జ్యోతిష్యంలో ఉపయోగపడుతుంది.
పలిత జ్యోతిష్యంలో రాశుల ప్రాముఖ్యత :
గ్రహాలు జ్యోతిష్య పరిశీలనకు ముఖ్యమైనవి అవి లగ్నం ఆధారంగానే పరిశీలించాల్సి ఉంటుంది. గ్రహాలు రాసి అనే ఒక భూమి మీద, నక్షత్రం అనే ఒక రోడ్డుపై, వాహనం లాగా సంచరిస్తాయని మనం మాట్లాడుతున్న, కాబట్టి భూమి ఎంత సారవంతమైనది, రోడ్డు ఎంత బలమైనది అనుకూలమైనది అనేది గ్రహానికి చాలా ముఖ్యం.
ప్రస్తుతానికి భూమిగా మాట్లాడుతునే ఈ రాశులను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
రాశుల విభజన :
ప్రపంచంలోనే అన్ని సందర్భాలకు జ్యోతిష ఫలితాన్ని చెప్పాలి కాబట్టే మన అవసరం కోసం దాన్ని వాడాలంటే అనేక రకాలుగా విభజన చేస్తున్నారు.
- సరి, భేసి రాశులు
- పగటి రాశులు, రాత్రి రాశులు
- చర, స్థిర, ద్విస్వభవ రాశులు
- భూత, వర్తమాన, భవిష్యరాశులు
- పొట్టి, మధ్యమ, పొడుగు రాశులు
- సాత్విక, రజో, తామసిక రాశులు
- మనిష్య, పశు, జల, కిటక రాశులు
- అగ్ని, భూమి, వాయు, జలరాశులు
- పూర్ణ, అర్ధ, పాద, నిర్జల రాశులు
- గుడ్డి, చెవిటి, మూగ, కుంటి రాశులు
- రాశులు – కాలపురుషాంగాలు
ఇవన్నీ ఫలిత భాగంలో ఎలా వాడుకోవచ్చో చెప్పే ప్రయత్నం చేస్తాను.
సరిరాసులు, బేసి రాసులు :
ఒకటి నుండి 12 రాశుల్లో మేషం నుండి లెక్కిస్తే సరి సంఖ్య కలిగినవే సరిరాసులు, బేసి సంఖ్య వస్తే బేసి రాశులవుతాయి.
బేసి రాసులు : 1, 3, 5, 7, 9, 11
సరి రాశులు : 2, 4, 6, 8, 10, 12
బేసిరాశుల్ని పురుష రాశులని, సరిరాశుల్ని స్త్రీ రాశులని పరిగణిస్తారు. పురుష రాశుల సహజంగా క్రూర రాశులు, స్త్రీ రాశులు సౌమ్య రాశులు.
ఫలిత జ్యోతిష్యంలో వాడడానికి ఓ చిన్న ఉదాహరణ, పంచమరాశి పురుషరాశి అయ్యి, పంచమాధిపతి పురుష భాగంలో ఉంటే పురుష సంతానం కలగవచ్చు. దీనిని పూర్తిగా వివరించలేదు ఇంకా చాలా విషయాలు పరిశీలించాలి.
వృషరాశిలో 30 డిగ్రీలు ఉంటే, మొదటి 15 డిగ్రీలను పురుష భాగమని, మిగిలిన 15 డిగ్రీలను స్త్రీ భాగమని విభజిస్తారు, అలాగే స్ర్తీ రాశిలో మొదటి 15 డిగ్రీలు స్ర్తీ భాగం గా, మిగిలిన 15 డిగ్రీలు పురుష భాగంగా నిర్ణయిస్తారు.
మరో ఉదాహరణ, ఒక వ్యక్తి జాతకంలో గ్రహాలన్నీ స్త్రీ రాశుల్లో స్త్రీ భాగాల్లో ఉంటే ఆ వ్యక్తి పురుషుడైన స్త్రీ వలె సున్నిత మనస్కుడు అయ్యే దానికి అవకాశం ఉంటుంది.
చర, స్థిర, ద్విస్వభవ రాశులు :
చర రాశులు :
(మేషం, కర్కాటకం, తుల, మకరం) మార్పు మరియు అనుకూలతను సూచిస్తాయి మరియు ఈ రాశుల క్రింద జన్మించిన వ్యక్తులు చురుకుగా మరియు సరళంగా ఉంటారు.
చర అంటే కదిలేది అని అర్థం. చరరాశులకు పదకొండవ స్థానము బాధక స్థానం అవుతుంది. శరీరము రోగయుక్తమైనప్పుడు ఈ బాధకుడు. బాధక స్థానంలో ఉన్న గ్రహము ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.
జీవితమంటేనే తికమక, మకతిక….. ఉద్యోగం బదిలీ వద్దు దేవుడా అంటే వెంటనే బదిలీ అయిపోతుంది, బదిలీ కావాలని కోరుకున్న ఎంతసేపటికి బదిలీ కాదు.
చరరాశి ప్రభావం లగ్నము, దశానాదడిపై ప్రభావం ఉంటే ఆ వ్యక్తి ఆరు నెలల నుంచి ఒక ప్రదేశంలో ఉద్యోగం చేయ లేక పోతాడు. ఏదో ఒక కారణంగా ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి తరలి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది.
చర అనే మూలకాన్ని 12 భావాలకు ఎలా అన్వయించాలి అనేది ప్రయోగిద్దాం.
లగ్నంపై ప్రభావం వలన ప్రయాణాలు, ద్వితీయంపై ప్రభావం పడితే అతని ధనము రకరకాల చేతులు మారే అవకాశం ఉండవచ్చు, తృతీయంపై ప్రభావం పడితే చాలా వేగంగా మాట్లాడే మనస్తత్వం ఉండవచ్చు, చతుర్ధమైతే స్థిరాస్తుల కన్నా చరాస్తులైన వాహనాలపై మక్కువ ఉండవచ్చు. ఇవన్నీ ఒక ఊహాత్మకంగా మాత్రమే రాస్తున్నాను. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అన్వయించాల్సి ఉంటుందని మీకొక అవగాహన ఇవ్వడానికి.
స్థిర రాశులు :
స్థిర రాశులు (వృషభం, సింహం, వృశ్చికం, కుంభం) స్థిరత్వం మరియు అనుగుణ్యతను సూచిస్తాయి మరియు ఈ సంకేతాల క్రింద జన్మించిన వ్యక్తులు నిర్ణయాత్మకంగా మరియు విశ్వసనీయంగా ఉంటారు.
స్థిరరాశులకు తొమ్మిదవ స్థానము బాదక స్థానం అవుతుంది.
ఏ విషయాన్ని మంచిగానో చెడుగానో నిర్ణయించలేము, కేవలం కాలమే సమాధానం చెప్పగలరు.
ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక ఉన్నత ఉద్యోగంలో పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడనుకోండి. అదే పని అదే జీవితం ఒకే రకంగా స్థిరంగా ఉండటం వల్ల కొన్ని సందర్భాలలో వాళ్లు మానసిక సంఘర్షణకు గురయ్య అవకాశం కూడా ఉంటుంది.
ఒక వ్యక్తికి స్థిరమైన ఆస్తి జీవితమంతా కలిగి ఉంటే అది ఆ వ్యక్తికి భరోసాగా కూడా మారవచ్చు. స్థిరము అనే విషయాన్ని సమయ సందర్భాలను బట్టి వాడవలసి ఉంటుంది.
ద్విస్వభావ రాశులు :
ద్విస్వభావ రాశులు (మిధునం, కన్య, ధనుస్సు, మీనం) వశ్యత మరియు అనుకూలతను సూచిస్తాయి మరియు ఈ రాశులలో క్రింద జన్మించిన వ్యక్తులు బహుముఖ మరియు విభిన్న పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు.
ప్రతి ద్వి స్వభావ లగ్నమునకు సప్తమ స్థానం బాధక స్థానం అవుతుంది. బాధకుడు నొప్పిని బాధను తెలియజేస్తాడు.
ఇది స్థిరమైనది కాదు, చరమైనది కాదు సందర్భానుసారంగా మార్పు పొందేది. అంటే ఒక వ్యక్తి ఒకే ప్రదేశంలో ఎప్పుడూ ఉంటాడని, రకరకాల ప్రదేశాలకి మారుతూ ఉంటాడని కచ్చితంగా చెప్పలేము. అవసరం వస్తే మారొచ్చు, అవసరం లేకపోతే అక్కడే ఉండొచ్చు.
వారి నిర్ణయాలు ఆలోచనలు సందర్భం బట్టి పరిస్థితిని బట్టి తీసుకోవలసి ఉంటుంది.
చరరాశులు అన్నింటికన్నా బలమైనది, స్థిరరాశులు అంతకంటే తక్కువ, చివరిగా దిస్ స్వభావ రాసులు నిలుస్తాయి. అంటే ఒక గ్రహం ద్వస్వభావ రాశి కంటే స్థిరరాశిలో బలమైనది, ఒకవేళ చరరాశిలో ఉంటే అది ఇంకా బలమైనది అని అర్థం చేసుకోవచ్చు. బలము అనేది శుభాన్ని ఆశుభాన్ని ఏదైనా ఇవ్వడంలో బలంగా ఉండవచ్చు.
భూత, వర్తమాన, భవిష్యరాశులు :
రాశులను మూడు రకాలుగా విభజించారు. భూతకాలం అంటే జరిగిపోయినది, వర్తమాన కాలం అంటే ప్రస్తుతం జరుగుతున్నది, భవిష్యకాలం అంటే జరగబోయేది అని అర్థం.
ఇది ప్రశ్న జ్యోతిష్యంలో ఎక్కువగా వాడుతున్నారు, ఒక వ్యక్తి ఒక వ్యాపారం చేయాలని అనుకుంటున్నాడు ప్రశ్నకాల లగ్నం భవిష్య రాశిని సూచిస్తే అతనికి లాభాలు రావడానికి చాలా సమయం పట్టవచ్చు, ప్రస్తుత కాలం సూచిస్తే తగిన కష్టానికి అప్పటికప్పుడే లాభాలు వస్తాయి. భూతకాల రాశి సూచిస్తే గతంలో అతను చేసిన పని వల్ల ఈ వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, గతంలో ఎటువంటి ప్రయత్నం లేకపోతే తక్కువ లాభాలు వస్తాయి.
ఇదే విషయాన్ని జన్మజాతకంలో పరిశీలిస్తే, మనం నక్షత్ర జ్యోతిష్యం వాడుతున్నాం కదా, ఒక గ్రహం యొక్క నక్షత్రాధిపతి భూత, వర్తమాన, భవిష్య రాశులలో దీనిలో ఉన్నాడని చూసి, దీనిని ఒక పారామీటరుగా వాడి చెప్పే ప్రయత్నం చేయండి.
భూత : మేషం, కర్కాటకం, తుల, మకరం
వర్తమాన : వృషభం, సింహం, వృశ్చికం, కుంభం
భవిష్య : మిధునం, కన్య, ధనస్సు, మీనం
పొట్టి, మధ్యమ, పొడుగు రాశులు :
పొట్టి : మీనం, కుంభం, మేషం, వృషభం
మధ్యమ : ధనస్సు, మకరం, మిధునం, కర్కాటకం
పొడుగు : సింహం, కన్య, తుల, వృశ్చికం
ఒక వ్యక్తి లగ్నం బలంగా ఉందా చంద్రుడు బలంగా ఉన్నాడా లగ్న నక్షత్రాధిపతి ఎక్కడ ఉన్నాడు అతని ఎంత ఎత్తు ఉన్నాడు. ఒక్కోసారి లగ్నం మొదటి డిగ్రీలో పడినప్పుడు పొడుగ్గా ఉండే అవకాశం ఉంటుంది, యోగం బలంగా ఉండేటప్పుడు కొన్ని కొన్ని లగ్నాలకి ఒక్కో రకమైన ఎత్తు ఉండే అవకాశం ఉంటుంది, ఒక్కో రకమైన రంగులో ఉండే అవకాశం ఉంటుంది, ఇలాంటి అన్ని గుర్తించడానికి ఇవన్నీ పెట్టారు.
సాత్విక, రజో, తామసిక రాశులు :
గ్రహాలను, రాశులను త్రిగుణాలైన సాత్విక, రాజసిక, తామసిక వర్ణాలుగా విభజించారు.
మీకు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ, సాత్వికం అంటే ఏ విషయాన్ని ఆశించకుండా సహాయం చేయగలుగుతుంది, రాజసిక గుణం ప్రతిఫల ఆపేక్షతో నడుచుకుంటుంది, తామసిక గుణం మనం సహాయం చేసిన తిరిగి సహాయం పొందలేకపోవచ్చు, కొన్ని సందర్భాలలో ఎవరు చేయలేని పనిని చేయగలగవచ్చు.
ఇది మంచి, ఇది చెడు అని కాలం నిర్ణయిస్తుంది,
సాత్విక – గురు, బుధులు
రాజసిక – రవి, చంద్ర, శుక్రులు
తామసిక – శని, కుజ, రాహు, కేతువులు
ఈ గ్రహాలకు సంబంధిత రాశులు కూడా అదే వర్ణాన్ని కలిగి ఉంటాయి.
ఒక ఇనప సువ్వను వంచాలి అని అంటే తామసిక గుణం కలిగి ఉండాలి, ఇప్పుడు మీకు అర్థం అయి ఉంటుంది ఇది మంచి చెడు అనేది సమయ సందర్భాలను బట్టి ఉపయోగపడుతుంది.
ఒక గురువుకి తామసిక గుణం వచ్చిన ధనాపేక్ష విపరీతంగా ఉంటుంది.
ఒక వ్యాపారికి సాత్విక గుణం కలిగిన, దానధర్మాలు పేరిట వ్యాపారం కుప్పకూలుతుంది.
ఒక రాచకార్యానికి రాజసిక గుణ కావాల్సి వస్తుంది.
జాతక ఫలితంలో వాడడానికి ఒక చిన్న ఉదాహరణ, మేష లగ్నానికి మకరంలో కుజుడు తామసిక రాశిలో, తన స్వనక్షత్రంలో అదీ తామసిక నక్షత్రం అవడం, రాశ్యాధిపతి అయిన శని లాభంలో రాహు నక్షత్రంలో ఉండడం, కుజుడు స్వనక్షత్రంలో ఉండడం వలన రాశ్యాధిపతి పరిశీలించాలి, శని కూడా సొంత రాశిలో తామసిక నక్షత్రమైన రాహు నక్షత్రంలో ఉండడం వలన, జాతకుడు గొప్ప యోధుడి వలె తన వృత్తిలో విపరీతంగా కష్టపడి సాధించే అవకాశం ఉంటుంది.
గ్రహాలు తమ సొంత తత్వాన్ని, సొంత గుణాన్ని కలిగి ఉన్నప్పుడు బలంగా ఉంటాయి, అది అనుకూలము ప్రతికూలము అనేది అది ఉన్న భావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
అగ్ని, భూమి, వాయు, జలరాశులు (పంచభూతాలు)
రాశులను నాలుగు రకాలుగా విభజించారు. అవి మేషం నుండి కర్కాటకం వరకు, సింహం నుండి వృశ్చికం వరకు, వృశ్చికం నుండి మీనం వరకు, ఈ ఒక్కొక్క నాలుగు రాశులకి నాలుగు తత్వాలను ఆపాదించారు. అవి వరుసగా అగ్ని, భూమి, వాయు, జలరాశులు. ఐదవ పంచభూతమైన ఆకాశం అన్నింటిలోనూ ఉంటుందని చెప్పారు.
ఇవి ఫలిత జ్యోతిష్యంలో అనేక రకాలుగా వాడుతుంటారు. ప్రపంచ జ్యోతిష్యంలో భాగంగా మేషరాశిలో గ్రహదోషం ఏర్పడిన అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మీ మేషం అగ్ని తత్వ రాసి కాబట్టి, మకరం వంటి భూతత్వరాశిలో గ్రహ దోషం ఏర్పడిన ప్రజలు రకరకాల రోగాలకు గురవుతారు. తుల వంటి వాయుతత్వరాశిలో గ్రహదోషం ఏర్పడిన వాయు కాలుష్యము, టోర్నీ డోలు, గ్యాస్ లీకేజ్ వంటి ప్రమాదాలు జరగవచ్చు, వృశ్చికం వంటి జరరాశుల్లో గ్రహదోషం ఏర్పడిన ఉప్పెనలు, తీవ్ర వర్షపాతం, సముద్రాలు పొంగడం, సునామీలు, సుడిగుండాలి ఏదైనా జరగొచ్చు.
అగ్నితత్వ ప్రభావం వలన, ఒక వ్యక్తి చురుగ్గా ఉంటాడు, కొంత కోపదారు మనిషి అయ్యే అవకాశం ఉంది.
భూతత్వం వలన ఇప్పుడు ఏదైతే కళ్లకు కనిపిస్తుందో, జరిగే దానికి అవకాశం ఉందో, వాస్తవానికి దగ్గరగా ఉండే ఆలోచనలు కలిగి ఉంటాడు.
వాయు తత్వ రాశి ప్రభావం వలన అన్ని విషయాలను సత్వరమే సాధించాలనే వేగాన్ని కలిగి ఉంటాడు. చాలా త్వరగా చలోక్తులు వేయడం, మాట్లాడడం ఇలాంటివి గమనించవచ్చు. ఒక్కోసారి వాయువేగంలో ప్రయాణించే అంబులెన్స్ కూడా కావచ్చు.
జలరాశి ప్రభావం వల్ల కొన్నిసార్లు సున్నితమైన మనస్తత్వాన్ని, పాపగ్రహ సంబంధమైన ఏర్పడిన కఠినమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.
గ్రహాలు ఆధారంగా ఒక్కోసారి రాశులు విన్న ఫలితాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధమవుతాయి.
గ్రహాలు కూడా ఈ విధంగా నాలుగు రకాలుగా వర్గీకరించారు, రవి, కుజులు అగ్నితత్వ గ్రహాలు, అవి అగ్నితత్వరాసుల్లో ఉంటే బాగా బలంగా ఉంటాయి, అగ్నికి పరస్పర శత్రువైన జలరాసుల్లో ఉంటే బలహీనమవుతాయి. ఈ విధంగా కూడా ఇక గ్రహహబలాన్ని నిర్ణయించడానికి రాశి తత్వాలను పరిశీలిస్తుంటారు.
గురువు ఆకాశతత్వగ్రహం, శని, రాహువు వాయు తత్వ గ్రహం, చంద్ర, శుక్ర, కేతువు జలతత్వ గ్రహాలు, బుధుడు భూతత్వ గ్రహం.
మరో చిన్న విషయం పరిశీలిస్తే జలము భూమి మీద పడితే మొక్కలు పెరుగుతాయి, అగ్నికి వాయువు తోడైతే మరింత గొప్పగా మండే అవకాశం ఉంటుంది. మేషాధిపత అయిన కుజుడు వాయు తత్వరాశుల్లో బలంగా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే జలరాశికి అధిపతి అయిన చంద్రుడు, భూతత్వమైన వృషభంలో ఉచ్చ పొందాడు. తత్వాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరి మకరంలో కుజుడు ఎందుకు ఉచ్చలో ఉన్నాడని అడక్కండి.
పూర్ణ, అర్ధ, పాద, నిర్జల రాశులు
పూర్ణ జలరాశులు 100% : కర్కాటకం, మీనం, మకరం
అర్థ జలరాశులు 50% : వృషభం, ధనస్సు, కుంభం
పాద జలరాసులు 25% : మేషం, తుల, వృశ్చికం
నిర్జల రాశులు 0% : కన్య, మిధునం, సింహం
అనేక పాప గ్రహాలు పూర్ణ జలరాశుల్లో ఉన్న, అది ఒక రక జలదోషం అయ్యి ఆ వ్యక్తి జీవితంలో సంతోషానికి ఇబ్బంది కలిగించే అవకాశం కూడా ఉంటుంది.
ఇది ఎక్కువగా సంతాన విషయంలో ఫలితం చెప్పడానికి వాడుతుంటారు, పంచమాధిపతి, దాని నక్షత్రాధిపతి పూర్ణ జలరాసుల్లో ఉంటే, సంతాన దోషం లేనట్టయితే సునాయాసంగా సంతానం కలుగుతుంది. అదే ఒకవేళ నక్షత్రాధిపతి నిర్జల రాశుల్లో పడినట్లు అయితే సంతానం కష్టమవుతుంది.
మనిష్య, పశు, జల, కిటక రాశులు :
మనుషులు, పశువులు, జలచరాలు, కీటకాలు ఇలా నాలుగు రకాల జీవులు భూమి మీద మనుగడ సాగిస్తున్నయి.
రాశి చక్రంలో ఈ నాలుగు రకాలు జీవులను గుర్తించడం ద్వారా ఫలిత జ్యోతిష్యంలో రకరకాలుగా వాడుకోవచ్చు.
ఆరవ స్థానం జాతక చక్రంలో చిన్న జంతువులను, పడకండవ స్థానం పెద్ద జంతువులను సూచిస్తుంది. ఒక వ్యక్తికి ప్రమాదం సూచించినప్పుడు ఏ జంతువు వల్ల ఇబ్బంది కలగవచ్చు, ఒక వ్యక్తి జంతువుల వల్ల లాభం పొందినట్లయితే తేనెటీగల వల్ల లాభం పొందుతాడా, ఆవులు గేదలు వంటి వాటి వల్ల లాభం పొందుతాడా, కోళ్లను అమ్మే డబ్బులు సంపాదిస్తాడా ఇలా చెప్పడానికి అవకాశం ఉంటుంది.
మనుష్యరాసుల్లో పుట్టిన వారికి గ్రహ స్థితి ఆధారంగా ఒక రకమైన శక్తి ఉంటుంది. జంతు రాశుల్లో పుట్టిన వారికి ఎక్కువగా కష్టపడే శక్తి ఉంటుంది, ఉదాహరణకు వృషభం జంతురాశి, దీనివలన ఎంత పని ఇచ్చినా కూడా చేయగలిగే శక్తి ఉండవచ్చు.
వైద్య రంగాల్లో తేలు విషయాన్ని కూడా మందుగా వాడే అవకాశం ఉంది, కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యక్తులకు భోజనం ద్వారా గాని, మరి ఏ ఇతర సందర్భాలలో అయిన విషం వల్ల ఇబ్బంది ఏర్పడితే ఇలా వృశ్చికం వంటి రాశులను గ్రహాలను పరిశీలించవచ్చు.
మనుష్యరాసులు :
మిధునం, కన్య, తుల, కుంభం, ధనస్సులో మొదటి భాగం.
పశురాశులు :
మేషం, వృషభం, సింహం, ధనస్సులో రెండవ భాగం, మకరంలో మొదటి భాగం.
జలచర రాశులు :
కర్కాటకం, మకరంలో రెండవ భాగం, మీనం
కీటక రాశులు : వృశ్చికం
గుడ్డి, చెవిటి, మూగ, కుంటి రాశులు :
భగవంతుడు అన్ని అవయవాలను మనకు ఇవ్వడం అద్దృష్టం. కొన్ని సందర్భాలలో కొన్ని కారణాల వల్ల కావచ్చు, జన్మత: కావచ్చు కొన్ని అవయవాలు లేక మనుషులు ఇబ్బంది పడుతూ ఉంటారు.
గుడ్డి : మేషం, సింహం, ధనస్సు
చెవిటి : వృషభం, కన్య, మకరం
మూగ : మిధునం, తుల, కుంభం
కుంటి : కర్కాటకం, వృశ్చికం, మీనం
పైన పేర్కొన్న విధంగా రాశులను విభజించారు. కుంటి రాశుల్లో గ్రహదోషం ఏర్పడిన శరీరంలో ఏదో ఒక భాగంలో సమస్య ఉండవచ్చు, ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు ఇంకా మాటలు రావట్లేదు అని అంటే మీరు ఎలా పరిశీలించాలనేది చెప్తాను.
ద్వితీయం వాక్కు స్థానం అవుతుంది, బుధుడు, గురుడు వంటి గ్రహాలు ఎలా ఉన్నాయో చూడాలి, ద్వితీయాధిపతి, ద్వితీయాధిపతి యొక్క నక్షత్రాధిపతి, లగ్నాధిపతి, లగ్న నక్షత్రాధిపతి, చంద్రుడు యొక్క నక్షత్రాధిపతి ఇలా అన్నీ కూడా మూగ రాశుల్లో ఉండి, అవి రాహు కేతువుల వల్ల ఏదో ఒక దోషాన్ని పొందితే, దశాధిపతి కూడా దోషంలో గనక ఉన్నట్టయితే అప్పుడు అది సమస్య అయ్యే అవకాశం ఉంది.
భావాన్ని, లగ్నాధిపతిని, భావంలో ఉన్న గ్రహాలను, భావ కారకున్ని, దశానాధుని, కారకరాశులను ఇలా అన్నీ పరిశీలించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది.
పగటి, రాత్రి రాశులు :
ఒక వ్యక్తి పగలు పుట్టాడా, రాత్రికి పుట్టాడా అనే ఆధారంగా, పగలు పుట్టిన వాడికి పగలు బలంగా ఉండే గ్రహాలు, పగలు బలంగా ఉండే గ్రహాలకి అనుకూలమైన రాశుల్లో యోగాలు ఏర్పడితే ఇంకా బలంగా యోగించే అవకాశం ఉంది.
సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయం ముందు పగటి సమయంగా గుర్తించాలి, సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు ఉన్న సమయమే రాత్రి.
పగటి పూట బలమైన రాశులు :
మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, ధనస్సు, మకరం
రాత్రి యందు బలమైన రాశులు :
సింహం, కన్య, తుల, వృశ్చికం, కుంభం, మీనం
కొన్ని సందర్భాలలో పగలు ముహూర్తం పెట్టినట్లయితే పగలు బలం కలిగిన రాశులలో అనుకూల గ్రహ స్థితిని ఏర్పడితే అదే ఎంచుకునే అవకాశం ఉంది.
ఉదాహరణకు శని, కుజులు రాత్రి యందు బలమైన గ్రహాలు, అలాగే వాళ్లు రాత్రి యందు బలమైన రాశుల్లో ఉంటే, ఆ జాతకం బలంగా ఉండవచ్చు కదా.
మకర లగ్నం తీసుకోండి, లగ్నం రాత్రి లగ్నం, శని సప్తమంలో పుష్యమిలో ఉన్నాడు, అది కూడా రాత్రి రాశి, కుజుడు ఆరవ స్థానంలో మృగశిరలో ఉన్నాడు అది కూడా రాత్రి రాశి, ఆరింట పాపగ్రహం అనుకూలంగా ఉండును, శని సప్తమంలో దిగ్బలం పొందును. ఇప్పుడు ఈ జాతకం బలంగా ఉందని నిర్ణయిస్తుంటారు.
రాశులు – కాలపురుషాంగాలు :
ఒక వ్యక్తి చేతులకు సంబంధించిన ఆటలు ఏదైనా ఆడాలనుకుంటున్నాడు, అతనికి క్రీడలు అనుకూలంగా ఉన్నాయా, ఏ అవయవంతో అయితే ఆడుతున్నాడు ఆ అవయవం ఎంత బలంగా ఉంది ఇలాంటివి చెప్పాలంటే మనకు తెలియాలిగా, రాశుల విభజన శరీర అవయవాల గురించి క్రింది విధంగా చేశారు.
మేషం : శిరస్సు, నుదురు, మెదడు
వృషభం : ముఖము, కంఠము, నేత్రాలు
మిధునం : భుజములు
కర్కాటకం : చాతి, హృదయం, శ్వాస కోసం
సింహం : ఉదర కుహ్యం
కన్య : నాభి
తుల : పొత్తికడుపు
వృశ్చికం : మర్మావయవాలు
ధనస్సు : తొడలు
మకరం : మోకాళ్ళు
కుంభం : మడిమ, పిక్కలు, చీల మండలం
మీనం : పాదాలు
పుట్టిన ప్రతి మనిషికి కర్మ అనుభవించడానికి ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది, ఏ రాశిలో అయితే గ్రహాలు దోషాన్ని పొందుతాయో అవయవంలో ఇబ్బందులు ఉంటాయి.
ఉదాహరణకు ద్వితీయము నేత్ర స్థానం, నేత్ర కారపుడైన రవి లేక శుక్రుడు, ఈ రాశిలో ఉండి దాని నక్షత్రాధిపతులు రాహు కేతు సంబంధాన్ని కానీ, వక్ర దోషాన్ని కానీ, ఎక్కువ పాపగ్రహ సంబంధాన్ని గాని ఏర్పడిన కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ విధంగా మీ దగ్గర ఉన్న జాతకాలలో పరిశీలించే ప్రయత్నం చేయండి.
రాశుల కారకత్వాలు :
గాయకుల ఇంట్లోకి వెళితే, గానానికి సంబంధించిన సంగీత వాయిద్యాలు, పుస్తకాలు, మనుషులను కలవడం చూడడం ఎంత సహజమో, ఒక రాశి, దాని అధిపతి ఆధారంగా అది ఎలా ఉంటుందో మనం ఊహించే ప్రయత్నం చేయాలి, ప్రతి విషయాన్ని చదివి గుర్తు పెట్టుకోవడం ఎవరి వల్ల కాదు. కొన్ని ముఖ్యమైన విషయాలు రాశి గురించి తెలియజేస్తాను, ఇవే పూర్తిగా అని కాదు గాని మీరు ఇంకా ఊహించడానికి ప్రయత్నం చేయండి.
ఒక రాశి యొక్క కారకత్వం ఆ రహ్యాధిపతి వల్లే కాకుండా, ఆ రాశిలో ఉండే నక్షత్రాల వల్ల కూడా కలుగుతుంది, అందులోనూ ఏదో ఒక గ్రహము అనేక గ్రహాలు ఆ రాశిలో ఉన్నప్పుడు తమ తత్వాన్ని తమ కలయికని బట్టి మారుతూ ఫలితాన్ని ఇస్తుంటాయి. దీన్ని మనము స్వతహాగా గమనించినప్పుడు మాత్రమే నేర్చుకోగలుగుతాం. ఇలాంటివి సాధారణంగా, సహజమైన విషయాలు తెలుసుకొని మిగిలినవి అనుభవ పూర్వకంగా అర్థం చేసుకోవడంమే.
వివాహం కోసం చూసే అప్పుడు రాశి కారకత్వాలు ఏమీ తెలియని వాళ్ళు చదువుతుంటారు, కేవలం చంద్రుడు ఉన్న రాశి ఆధారంగా ఒక వ్యక్తి యొక్క పూర్తి వ్యక్తిత్వం నిర్ణయించబడదు. పూర్తి గ్రహ స్థితి, యోగాలు, దశలు, పరిస్థితులు ఇలా అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మనం అన్నింటిని విడివిడిగా అర్థం చేసుకుని, అంతా కలిపి ఉన్న ఒక విషయంలో నుంచి విడివిడిగా చూసి, కలిపి చెప్పాల్సి ఉంటుంది.
మేషం: డైనమిక్, ఔత్సాహిక, తల, అడవులు, పెద్ద నుదురు, తొందరపాటు, హఠాత్తు, విరామం లేని, మందపాటి కనుబొమ్మలు, నాయకత్వం, పొడి, లీన్, పొడవు
వృషభం: అందమైన, ముఖం, స్థిరమైన, నిదానమైన, నమ్మకమైన, విలాసవంతమైన మందిరాలు, తినే స్థలం, చక్కటి దంతాలు, పెద్ద కళ్ళు, విలాసవంతమైన, నమ్మకమైన, మందపాటి జుట్టు, బలిష్టమైన.
మిథునం: ఛాతీ, తోట, కమ్యూనికేషన్, జర్నలిజం, పాఠశాలలు, కళాశాలలు, అధ్యయన గదులు,
తంతులు, టెలిఫోన్‌లు, వార్తాపత్రికలు, పొడవాటి, చక్కగా నిర్మించబడిన, ప్రముఖ బుగ్గలు, మందపాటి జుట్టు, విశాలమైన ఛాతీ, ఆసక్తి, నేర్చుకున్న, ఉల్లాసమైన.
కర్కాటకం : గుండె, రొమ్ము, నీటి పొలాలు, నదులు, కాలువలు, వంటగది, ఆహారం, ఆకర్షణీయమైన, చిన్న నిర్మాణం, భావోద్వేగ, లోతైన అనుబంధం, తల్లి వంటి, సున్నితమైన.
సింహం: కడుపు, జీర్ణక్రియ, నాభి, పర్వతాలు, అడవులు, గుహలు, ఎడారులు, రాజభవనాలు, ఉద్యానవనాలు, కోటలు, ఉక్కు కర్మాగారాలు, సన్నగా, పొడిగా, వేడిగా, రాచరికంగా, ఆత్మగౌరవంగా, అవమానకరంగా, ఆధిపత్యంగా.
కన్య: తుంటి, అనుబంధం, పచ్చని తోటలు, పొలాలు, గ్రంథాలయాలు, పుస్తక దుకాణాలు, పొలాలు, తెలివైన, పదునైన, వక్త, నాడీ, శారీరకంగా బలహీనమైన, విచక్షణ, యుక్తి.
తులారాశి; గజ్జలు, వ్యాపారవేత్త, మార్కెట్‌లు, వాణిజ్య కేంద్రాలు, బ్యాంకులు, హోటళ్లు, వినోద ఉద్యానవనాలు, వినోదం, మరుగుదొడ్లు, కాస్మెటిక్, సమతుల్యత, తెలివైన, మంచి మాట్లాడేవాడు.
వృశ్చికం : ప్రైవేట్ భాగాలు, రంధ్రాలు, లోతైన గుహలు, గనులు, గ్యారేజీలు, చిన్న బిల్డ్, సంధ్యాకాలం ఛాయ, ప్రకాశవంతమైన కళ్ళు, రహస్య, క్షుద్ర, బెస్ట్ ఫ్రెండ్ లేదా చెత్త శత్రువు, సున్నితమైన.
ధనుస్సు రాశి; తొడలు, రాచరికం, న్యాయవాదులు, ప్రభుత్వ కార్యాలయాలు, విమానం, పడిపోవడం, కండరాలు, లోతైన కళ్ళు, నిజాయితీ, జూదగాడు
మకరం: మోకాలు, నీటి ప్రదేశాలు, జంతువులు, పొదలు, పొడవాటి మెడ, ప్రముఖ దంతాలు, చమత్కారమైన, పరిపూర్ణుడు, రోగి, నిర్వాహకుడు, జాగ్రత్తగా, రహస్యంగా ఉండేవాడు.
కుంభం: చీలమండలు, దాతృత్వం, తత్వశాస్త్రం, పొడవైన, అస్థి, చిన్న కళ్ళు, పర్వత వసంత, ప్రదేశాలు నీటితో, అనారోగ్యంతో ఏర్పడిన దంతాలు, కష్టపడి పనిచేయడం, నిజాయితీ
మీనం: పాదాలు, మహాసముద్రాలు, సముద్రాలు, జైళ్లు, ఆసుపత్రులు, పొట్టి, బొద్దుగా, పెద్ద కళ్ళు, పెద్దవి కనుబొమ్మలు, సోమరితనం, భావోద్వేగం, పిరికి, నిజాయితీ, మాట్లాడే మరియు సహజమైన.
జాతక విశ్లేషణ ప్రయోగంలో రాశులు :
ఈ వ్యాసం మొదట్లోనే ఒక పాట పడుకున్నాం. గోదారి గట్టుంది, గట్టుమీద చెట్టుంది……. అలాగే ఒక దాని మీద మరొక విషయాన్ని ఉంచి ఎలా అందంగా విశ్లేషించాలనేది మనకి పూర్తి లాజికల్ గా తెలిస్తే, ఫలిత జ్యోతిష్యం అంత కష్టమైన పనేమీ కాదు.
ప్రాథమికంగా మనకున్న విషయాలను ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతూ, ఒక ఉదాహరణతో చెప్పే ప్రయత్నం చేస్తాను.
లగ్నం
లగ్నం, రాశి
లగ్నం, రాశి, భావం
లగ్నం, రాశి, భావం, గ్రహం
లగ్నం, రాశి, భావం, గ్రహం, నక్షత్రం
లగ్నం, రాశి, భావం, గ్రహం, నక్షత్రం, నక్షత్రాధిపతి స్థానం
ఇదే కాకుండా, యోగ కారుకుల సంబంధం, గ్రహ దృష్టి, గ్రహాల కలయిక ఇలా అనేక విషయాలను పరిశీలిస్తూ అద్భుతంగా అర్థం చేసుకోవచ్చు.
ఉదాహరణ
లగ్నం
కర్కాటక లగ్నం, లగ్నాధిపతి చంద్రుడు, ఇది జలరాశి, అలానే చరరాశి, చంద్రుడు రాజగ్రహము, చంద్రుడు స్త్రీ గ్రహము సున్నితమైన గ్రహము. ఇలా లగ్నాధిపతి గురించి కొన్ని విషయాలను లగ్నం గురించి అంచనా వేసుకోవడం. అలాగే లగ్నము ఏ నక్షత్రంలో పడిందో ఆ నక్షత్రాధిపతి గురించి కొంత అంచనా వేయడం. ఉదాహరణకు పునర్వసు నక్షత్రంలో పడినట్లయితే భాగ్యాధిపతి అయిన గురువు యొక్క నక్షత్రంలో పడడం విశేషం అవుతుంది. ఆయన ఈ లగ్నానికి ఆరవ స్థానాధిపతి కూడా అవ్వడం వలన, పోరాటం తర్వాత అదృష్టం కలుగును.
లగ్నం, రాశి
ప్రస్తుతానికి లగ్నాధిపతిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం, లగ్నాధిపతి అయిన చంద్రుడు పదవయింట మేషరాశిలో స్థితి పొంది ఉన్నాడు. మేషము చంద్రుడి మనస్తత్వానికి పూర్తి అనుకూలమైనది కాదు, ఎందుకంటే కుజుడు ఇలా అవ్వడం వల్ల కుజుడు యుద్ధ ప్రవృత్తిని కలిగి ఉండడం వల్ల, చంద్రుడు మానసిక భయాన్ని పొందే అవకాశం ఉంటుంది, చంద్రుడు మానసిక సంతోషాన్ని కోరితే మేషము ఉరుకుల పరుగులు నగరం లాంటిది, దాని వేగాన్ని తట్టుకోలేకపోతుంటాడు. కానీ చంద్ర కుజులు మిత్రులు అయినందువలన, కొంతవరకు అది మిత్ర రాసి అవుతున్నది.
లగ్నం, రాశి, భావం
ఇప్పటికే మనకి రాశి గురించి ఒక అవగాహన వచ్చింది. రాసి కన్నా స్నానం చాలా గొప్పది, ఎందుకంటే ఒక వ్యక్తి సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న పనిచేయడానికి ఇష్టపడకపోవచ్చు, ఒక గ్రహము యొక్క స్థానము లేక బావము అనేది అది పనిచేయడానికి సుముఖంగా ఉందా లేదా అనే విషయం తెలియజేస్తుంది, లగ్నం నుంచి పదవ స్థానమైన మేషం లో ఉండడం వల్ల, లడ్నాధిపతి స్వయంగా రాజ్యస్థానమైన దర్శనంలో ఉండడం వలన కీర్తి, పేరు ప్రతిష్టలు కలుగుతాయి, అంటే జాతకుడు తన జీవితంలో అందరికీ ఉపయోగపడే తద్వారా తనకి కూడా ఉపయోగపడే అద్భుత కార్యాలు చేయగలుగుతాడు, గొప్ప ఉద్యోగము అధికారము కలిగి ఉంటాడు.
లగ్నం, రాశి, భావం, గ్రహం
లగ్నము చంద్రుడివి అయినది, రాసి మేషము, కుజుడు యొక్క రాశి, భావము దశమ స్థానమైనది, గ్రహము చంద్రుడు ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ కలిపితే, చంద్రుడి యొక్క లగ్నానికి చంద్రుడు స్వయంగా దశమ స్థానంలో ఉండడం విశేషం, చంద్రుడా అవ్వడం వలన, ఒక ఉద్యోగంలో ఉండాలనుకోకుండా మానసిక సంతోషాని కోసం రకరకాల ఉద్యోగాలకి మారాలని అవకాశం కూడా ఉంటుంది, అది కుజుడి యొక్క ఇల్లు అవడం వలన ఎప్పుడు కూడా సున్నితంగా జరగాల్సిన ఒక పనిని కూడా కంగారుతో, ఒత్తిడిని పెట్టుకుని పని చేసే ప్రయత్నం చేస్తాడు.
లగ్నం, రాశి, భావం, గ్రహం, నక్షత్రం
ఇప్పుడు చంద్రుడు రవి యొక్క నక్షత్రమైన కృత్తికలో ఉన్నాడనుకున్నాడు అనుకున్నాం. రవి నక్షత్రం మిత్ర నక్షత్రం అవడం మంచిదయింది, కృత్తిక ఒకటో పాదం పుష్కరణ నవంశ కూడా అవ్వడం మరో విశేషం, దనాధిపతి నక్షత్రం అవ్వడం వలన జీవితంలో తన ఉద్యోగం ద్వారా మంచి దనము సంపాదించుకునే అవకాశం ఉంటుంది.
లగ్నం, రాశి, భావం, గ్రహం, నక్షత్రం, నక్షత్రాధిపతి స్థానం
మనం నక్షత్ర జ్యోతిష్యం నేర్చుకుంటున్నాం కాబట్టి, ఒక గ్రహం ఏ స్థానంలో ఉన్నది అనే దానికన్నా, దాని నక్షత్రాధిపతి ఎక్కడ ఉన్నాడు అనేది విశేషం అవుతుంది, ఈ సందర్భంలో చంద్రుడు రవి నక్షత్రంలో ఉంటే, రవి దశమ స్థితి అయిన మేషంలో ఏ నక్షత్రంలో ఉన్న చంద్రుడు ఉచ్చ పొందిన రవి నక్షత్రంలో ఉండడం వలన, చంద్రుడికి పరిపూర్ణంగా దశమ స్థానం యొక్క విశేష ఫలితాలు అందుతాయి.
ఒకవేళ ఇదే సందర్భంలో రవి గనక వర్గము చెందిన మరింత విశేష ఫలితాలు అందవచ్చు. ఇదే ఉదాహరణలో చంద్రుడు వృషభంలో రవి యొక్క నక్షత్రంలో ఉంటే, చంద్రుడు ఉచ్చలో ఉండి, ఉచ్చ పొందిన రవి నక్షత్రంలో ఉండడం ఇంకా విశేషం అవుతుంది.
ముగింపు :
లగ్నం నుండి ప్రతి రాశినే లెక్కించి, భావంగా పరిగణిస్తాం. గ్రహాలు లగ్నం ఆధారంగా ఏ రాశిలో ఉన్నాయి. ఆ రాశిలో ఉచ్చ లేక నీచ పడ్డాయా, ఆ రాశి అధిపతి ఎక్కడ ఉన్నాడు, నక్షత్రాధిపతి ఎక్కడ ఉన్నాడు ఇలా అన్ని పరిశీలించి. భావ విశ్లేషణ చేయవలసి ఉంటుంది.
కాబట్టి గ్రహాలు ఎంత అనుకూల, ప్రతికూల పరిస్థితులను కలిగి ఉన్నాయి తెలుసుకొని దాని ద్వారా గ్రహబలాన్ని అంచనా వేసి బావ బలాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. అందుకే రాశులు, ఏ గ్రహానికి ఏ రాశి అనుకూలమైనది, ఏ నక్షత్రం అనుకూలమైనది, లగ్నం నుంచి ఎన్నవ స్థానం అనుకూలమైనది అనేది ప్రాథమికంగా తెలుసుకోవాల్సి ఉంటుంది.
సినీ నటుడు రజనీకాంత్ గారి పాపులర్ డైలాగ్ ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలో దక్కేది ఎన్నటికైనా దక్కుతుంది, దక్కనిది ఎన్నటికీ దక్కదు. అనే విషయాన్ని జ్యోతిష్యపరంగా పరిశీలించాలంటే గ్రహా బలాన్ని అంచనా వేసి, భావాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది, భావమంటే, ఒక వ్యక్తి సంతాన, వివాహ, ఉద్యోగము వంటి సౌఖ్యాలను ఏ విధంగా ఎంతవరకు పొందగలడో నిర్ణయించడమే.