గురుచండాల యోగం
ఉపోద్ఘాతం:
గురువు మరియు రాహు గ్రహ కలయికనే గురుచండాల యోగం అని అంటారు. గురువు సహజంగా పూర్ణ శుభుడు లక్ష దోషాలను హరించి కోటి శుభఫలితాలు ఇస్తాడు. రాహువును సర్పం యొక్క తలాగా పరిగణిస్తారు. అంటే రాహువు యొక్క విష ప్రభావం గురు మీద ఉండటం వలన జాతకుడు జీవితంలో ప్రతిదీ కష్టపడాల్సి వస్తుంది అనేది అంచనా.
జరగాల్సిన విషయం జీవితంలో సరైన సమయానికి జరగకపోవడం, ధర్మం ప్రకారం కావలసినవి రాకుండా ఇబ్బంది పడటం వంటివి.
అయితే ఇవి ఏ స్థానాలలో ఇలా జరిగితే పూర్తిస్థాయి దుష్ఫలితాలు వస్తాయి అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
గురుచండాల యోగం:
గురు రాహువుల కలయికని గురు దోషమని అంటారు. యోగం అనేది ఎప్పుడు కేంద్రాలలోని గ్రహాలు ఉంటేనే అవుతోంది. ఏ లగ్నానికి అయినా గురు రాహువులు. (1, 4, 7, 10) కేంద్ర స్థానాల్లో ఉంటే అది గురు చండాల యోగం అవుతుంది.
ఏ లగ్నానికి అయినా గురు రాహువులు లాభ స్థానం (11)
లో ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మిగిలింది వాటి నక్షత్రనదుడి బట్టి ఆధారపడి ఉంటుంది.
మేషలగ్నం ఉదాహరణగా:
ఏదైనా ఒక లగ్నం తీసుకుంటే మనకు సునాయాసంగా అర్థమవుతుంది.
కేంద్ర స్థానాలు 1, 4, 7, 10 మేష లగ్నానికి మేషం, కర్కాటకం, తుల, మకరం అవుతాయి.
ఏ లగ్నానికి అయినా గురు రాహువుల కలయిక 11వ స్థానంలో జరిగితే ఎటువంటి దోషం ఉండదు. ఇక్కడ మేషం నుండి 11 కుంభ రాశి అవుతుంది. మేష లగ్నం చర లగ్నం కావడం వల్ల 11వ స్థానం బధకస్థానం అయింది. కావున ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు శరీరానికి కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.
రాహువు వక్ర మార్గంలో వెళ్లే గ్రహం కనుక గురువుతో చేరడం వల్ల దానికి కూడా వక్రమార్గం ఫలితాలు రావడం నా పరిశోధనలో గమనించాను. గురు రాహువులు ఒకే నక్షత్రం లో ఒకే డిగ్రీలో కలిసినప్పుడు నవాంశలో కూడా వాళ్లు కలిసి ఉంటారు, అలాంటప్పుడు సరైన స్థానంలో లేకపోతే మరింత ఇబ్బందిని ఇస్తుంది. ఏ గ్రహమైన వక్రిస్తే ఏ భావంలో ఉంటుందో ఆ భావ ఫలితాలు సరిగా రావు.
సప్తమ స్థానంలో ఉంటే సామాజిక సంబంధాలు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు, సప్తమం కావడం వల్ల మన వల్ల ఎదుటివాళ్ళు ఇబ్బంది పడ్డారు కావచ్చు, ఎదుటివాళ్ళు మనతో ధర్మంగా లేరని ఇబ్బంది పడవచ్చు.
చతుర్థంలో గురువు రాహువులు కలిస్తే అది కూడా ఒకే నక్షత్రం లో, నక్షత్ర నాథుడు సరిగా లేకపోతే, సుఖ స్థానం కనుక సౌఖ్యం ఇవ్వకపోవడం, తల్లి ఆరోగ్యంలో ఇబ్బందులు ఉండటం కావచ్చు, తల్లికి దూరంగా ఉండవలసిన సందర్భాలు ఏర్పడడం, చతుర్థం మనసును కూడా కలుగుతుంది కాబట్టి కపట స్వభావం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది.
దశమంలో గురు రాహువులు ఉండటం వల్ల కొంత వరకు పర్వాలేదు. అంటే కొన్ని సందర్భాల్లో ధర్మం తెలిసి దాన్ని వక్రమార్గంలో వాడే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఎవరికి వారే ఎలా ఉండాలి అనేది నిర్ణయించుకుని సత్కర్మలు చేసుకోవాలి.
లగ్నంలో గురు రాహువులు కలిసి ఉండడం వల్ల కొంతవరకు దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. భాగ్యం అంటే అదృష్టం. భాగ్యాధిపతి లగ్నంలో ఉండడం వల్ల ప్రతి పని ధర్మంతో వ్యవహరిస్తారు, కాకపోతే రాహు కలవడం వల్ల తను చేసే మోసపూరిత విషయాల్లో కూడా ధర్మంతో ఎంతవరకు చేయొచ్చు ఎంతవరకు చేయకూడదనే చిన్న విచక్షణ ఇస్తాడు. జీవితంలో జరిగే విషయాలు సకాలంలో జరగకుండా ఇబ్బందులు రావచ్చు. ఇలాంటి సందర్భంలో ధర్మం వదలకుండా ముందుకు పోవడమే ఉత్తమం.
ద్వితీయ స్థానంలో గురు రాహువులు కలస్తే గురువు ధన కారకుడు కావటం వల్ల, రాహువు ఏది ఉంటే దాన్ని రెట్టింపు చేసే వాడు కావడం వల్ల కొన్ని సందర్భాల్లో క్షయన్ని చేసినా చాలా ఎక్కువ ధనం ఇస్తాడు. కాకపోతే కుటుంబ సంబంధమైన భావాలలో గాని, తండ్రి యొక్క అభివృద్ధిలో గాని ఇబ్బందులు ఉండవచ్చు.
తృతీయ స్థానంలో గురు రాహువులు కలిసిస్తే ఇది బాత్రు సంబంధమైన స్థానం రావడం వల్ల తర్వాత పుట్టినవాళ్ళతో ఉండే అనుబంధం లో ఇబ్బందులు ఉండవచ్చు. ఇది వాక్కు సంబంధమైన స్థానం అవ్వడం వలన అందులోనూ గురువు ఉండడంవల్ల రాహు కూడా ఉండడం వల్ల వారి మాటలు మధురాతి మధురంగా, ఎదుటివారిని చాలా ఆకట్టుకునేలా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అంతే కఠినంగా కూడా వాళ్లు మాట్లాడగలరు.
పంచమ స్థానంలో గురు రాహువులు కలయిక విద్య, సంతాన విషయాల్లో ఆటంకాలను కలగజేసే అవకాశం ఉంది.
షష్ఠ స్థానంలో ఆరోగ్య పరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు త్వరగా కోలుకో లేకపోవడం, ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవడం, కొన్ని సందర్భాల్లో అప్పుల్లో ఇరుక్కోవడం, కోర్టు కేసులో వివాదాల్లో చిక్కుకోవడం వంటివి జరగవచ్చు. అలాగే పాప గ్రహమైన రాహువు ఆరవ స్థానంలో బలవంతుడు అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్కువ దుష్ఫలితాలను కలిగించకపోవచ్చు కూడా.
అష్టమ స్థానంలో గురువు రాహువులు కలిస్తే పితృ సంబంధమైన విషయాలలో అనుకూలత ఉండకపోవచ్చు, ఆరోగ్యం ఇబ్బందిగా ఉన్నప్పుడు సరైన మందు దొరకక ఇబ్బంది పడవచ్చు. కొన్ని సందర్భాలలో ఆకస్మికంగా ధనం ప్రార్థించవచ్చు.
భాగ్య స్థానంలో గురు రాహువులు తండ్రికి ఉండే ఒడుదొడుకులు చెప్తారు. అయితే మేష లగ్నానికి భాగ్యాధిపతి భాగ్యంలో ఉండటంవల్ల మూల త్రికోణ రాశిలో ఉండడం వల్ల ఈ దోషం కొంత తగ్గినా, రాహువు 9 లో ఉంటే బాలారిష్టంగా చెప్తారు, ఇది జాతకుడికి ఇబ్బంది పెట్టకపోయినా జాతకుడు తండ్రి కో సంతానానికి ఇబ్బంది పెట్టవచ్చు.
వ్యాయస్థానంలో గురు రాహువులు సత్ వ్యయం ఇవ్వరు. అనవసరమైన వాటికి కష్టపడి సంపాదించిన డబ్బులు ఉపయోగపడకుండా అవుతుంటాయి.
గమనిక:
నేను చెప్తున్న ఇవన్నీ కూడా ఊహించి ఉదహరిస్తున్నాను. అయితే మిగిలిన గ్రహాలు దశ గోచారం ఇలాంటి చాలా విషయాల తో ఎప్పుడు ఎప్పుడూ ఏం జరుగుతుంది. ప్రతి సమయంలోనూ ఈ కలయిక వల్ల వచ్చే సమస్య ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది.
సూచన:
నా అనుభవంలో జన్మ జాతకం లో ఉన్న గ్రహస్థితి గోచారంలో తిరిగి వచ్చినప్పుడు మనకు ఏ దశ జరిగినా దాని ఫలితాలు కొంత కనిపిస్తూ ఉంటాయి. అలాగే గోచారంలో గురు, రాహువులు తిరిగి కలిస్తే అది ఇది మంచి అయితే మంచి చెడు అయితే చెడు ఫలితాలు ఉంటాయి.
వృషభ లగ్నం:
ఉదాహరణకు వృషభ లగ్నం తీసుకుంటే గురు రాహువుల కలయిక ఆరవ స్థానంలో జరిగితే ఆరవ స్థానంలో రాహువు బలవంతుడు అష్టమాధిపతి ఆయన గురువు ఆరవ ఇంట్లో ఉంటూ రాహు తో కలవడం వల్ల వక్రత్వం ఆపాదించబడిన ఎటువంటి దోషం లేక విపరీతమైన పేరు జ్ఞానాన్ని కూడా ఇవ్వవచ్చు.
గురు రాహువుల కలయికలో శుక్రుడు గాని కుజుడు గాని కలిస్తే ఫలితాలు కొన్ని సందర్భాల్లో విపరీతమైన ఇబ్బందిని లేదంటే అమితమైన సుఖాలను అందజేస్తున్నాయి. అవి ఏ స్థానంలో ఉన్నాయి అన్నది కూడా చాలా ముఖ్యం.
గురు దోషానికి కారణం:
అసలు గురు దోషం ఎందుకు వస్తుంది అంటే గురువులను గౌరవించకపోవడం జీవితంలో మార్గం చూపించిన వ్యక్తికి శుభం చేయకుండా కీడు చేయడం, సరైన విలువ ఇవ్వకపోవడం వల ఇలాంటిది ఇది ఏర్పడుతుంది. కాబట్టి దానికి సంబంధించిన సత్కర్మని అభివృద్ధి చేసుకోవాలి.
గురు రాహువులు కలిసినప్పుడు, సహజంగా ఉండే రెండు గ్రహాల మధ్య ఉండే కేంద్ర స్థితి ఇ వల్ల వచ్చే దుష్ఫలితాలు మరింత ఎక్కువగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు గురువుకి మరో కేంద్రంలో శని ఉన్నాడు అనుకుందాం. దానివల్ల ఆ జాతకుడికి ఓర్పు లేక అనేక ఇబ్బందులు పడవచ్చు. అది సప్తమస్థానంలో ఏర్పడితే వైవాహిక జీవితంలో, దశమ స్థానంలో ఏర్పడితే ఉద్యోగ విషయాల్లో సమస్యలు ఏర్పడవచ్చు. గ్రహాన్ని బట్టి, స్థానాన్ని బట్టి ఫలితాలుంటాయి.
ముగింపు:
ఇక్కడ పరిహారాలు అన్నది విషయం కాదు. అసలు ఏం జరుగుతుంది అనేది చాలా ముఖ్యం. గురు రాహువులు కలిసినంత మాత్రాన ఏదో అయిపోతుంది అని కంగారు పడాల్సిన అవసరం లేదు. లగ్నాధిపతి, లగ్నము, లగ్న పాపార్గళ్ళం, 1-5-9 అధిపతులు, దశాలు ఇలా చాలా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
I have explained about how guru chandal yogam works, and how the guru will effect negatively to the native if guru is not favourable.