Docs

Elinati Shani (Sade Sati) | ep22

ఏలినాటి శని

ఉపోద్ఘాతం:

ఏలినాటి శని హిందీలో సాడే సాతి అని కూడా అంటారు. అంటే ఏడున్నర సంవత్సరాల శని అని అర్థం. ఎవరి జాతకం లో నైనా ఉన్న జన్మ చంద్రుడుని గోచారంలో ని శనితో పోల్చి చూస్తారు. ఏలినాటి శని కి సంబంధించిన భయాలు దానిని మనం ఎలా సరిగా అర్థం చేసుకోవాలి. ఒక జాతక చక్రం విశ్లేషణలో ఏలినాటి శని ప్రభావం ఎంత అనేది పూర్తిగా తెలుసుకుందాం.

పురాణం:

ఒకానొక సందర్భంలో పరమశివుడికి శని భగవానుడికి మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది. ఈశ్వర నేను నిన్ను పట్టుకొనే సమయం వచ్చేసింది అని శని చెప్పడం జరుగుతుంది. అప్పుడు పరమశివుడు ఏడు సముద్రాలు దాటి మర్రి చెట్టు చాటున మరి త్వరలో దాక్కోవడం జరుగుతుంది. అలా పరమశివుడు ఆ రోజంతా అక్కడే ఉండడం జరిగింది.

సూర్యాస్తమయానికి ఒక్క నిమిషం ముందు నేను అక్కడికి చేరుకుని శివుడి తో ఇలా అంటాడు. పరమేశ్వర నేను నిన్ను ఎప్పుడో పట్టుకున్నాను అని చెప్పడం జరుగుతుంది. అది ఎలా అని పరమేశ్వరుడు అడగగా కైలాసం లో ఉండవలసిన నువ్వు ఏడు సముద్రాలు దాటి మర్రిచెట్టు మర్రిచెట్టు త్వరలో ఉండడానికి కారణం నేను కాను అంటావా అని అడుగుతాడు. తర్వాత ఒకరికి ఒకరు చూసి నవ్వుతూ తిరిగి కి వారివారి స్థానానికి వెళ్లిపోతారు. ఈ కథ చాలా పుస్తకాలు ఉంటుంది. దీని అర్థం శనీశ్వరుడు పరమేశ్వరుడి అంతటి వాడిని కూడా వదిలి పెట్టలేదు అని అర్థం.

ఏలినాటి శని:

జన్మ జాతకంలోని చంద్రుడిని గోచారంలో శని తో పోల్చినప్పుడు గోచార శని జన్మ జాతక చంద్రుడి యొక్క స్థానం నుంచి 12 వ స్థానంలోనూ ఒకటవ స్థానంలోనూ రెండవ స్థానంలోనూ సంచరించిన అప్పుడు ఏలినాటి శని గా పరిగణిస్తారు.

శని గ్రహం సహజంగా ఒక రాశిని దాటడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది కాబట్టి 12, 1, 2 మొత్తం మూడు రాశులు అయ్యాయి కాబట్టి శని సంచారం మూడు రాశుల దాటడానికి ఏడున్నర సంవత్సరాలు పడుతుంది అందుకే దీనిని ఏలినాటి శని అని అంటారు.

ఉదాహరణకు మీది సింహరాశి అనుకున్నాం గోచారంలో శని కర్కాటకంలో సింహం లో కన్యలో సంచరించే సమయాన్ని ఏలినాటి శని గా పరిగణిస్తారు. అంటే చంద్రుడు ఉన్న రాశి కన్నా ముందు ఉన్న రాశి, చంద్రుడు ఉన్న రాశి, చంద్రుడి తర్వాత రాశి అన్నమాట.

ఏలినాటి శని: భయాలు – అనుమానాలు:

ఏలినాటి శని గురించి అనేక రకాల భయాలు ప్రజలలో ఉన్నాయి దీనికి గల కారణం మిడిమిడి జ్ఞానమే.

ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మరణం వస్తుందని, వివాహ సమస్యలు వస్తాయని, వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఉంటాయి, జీవితం తారుమారు అవుతుందని ఇలా చాలా విషయాలు ఉన్నాయి. నిజానికి ఇది ఏది కూడా వాస్తవమైన విషయం కాదు.

ఏలినాటి శని ప్రభావం:

ఎవరి జీవితంలో జరిగే ఏ విషయానికైనా వారే పూర్తి కారణం అవుతారు. అంతేగాని ఏ గ్రహం వలన వాళ్లు అలా చేయరు. విషయాన్ని అన్ని లెక్కించడానికి మాత్రమే గ్రహాలు ఉపయోగపడతాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ విషయాన్ని పరిశీలించడానికి నవ గ్రహాలు ఉన్నాయి. ఒక్క విషయాన్ని పరిశీలించడానికి ఒక్కొక్క గ్రహాన్ని పరిగణలోకి తీసుకుంటారు.

శని కర్మ కారకుడిగా పరిగణిస్తారు. శని కర్మ ఫలితాన్ని మాత్రమే కలుగజేస్తాడు. కర్మ అనగా ఒక పని.

కర్మ గురించి మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుందం. శని గ్రహ సంచారం జన్మ చంద్రుడి మీదికి మళ్లీ రావాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. దీన్నిబట్టి మనం కర్మ ఫలితం జరగడానికి 30 సంవత్సరాలు పట్టొచ్చు అని అర్థం చేసుకోవచ్చు.

ఉదాహరణకు నేను నా ఉద్యోగంలో 25 సంవత్సరాలు చాలా కష్టపడి పని చేశాను. మనస్ఫూర్తిగా నా కర్తవ్యాన్ని నేను ఎంత వరకు చెయ్యగలనో అంతవరకు చేశాను కానీ నేను సాధారణంగా జీతభత్యాలు, పెన్షన్ లభించాయి తగినంత కర్మఫలం రాలేదు. ఇదే సమయంలో ఏలినాటి శని సంభవించింది అనుకోకుండా ఒక స్థలం కొనుక్కున్నాను అది 20 రెట్లు పెరిగింది. ఇది నేను జీవితాంతం కష్టపడిన దానికి ఆకస్మికంగా వచ్చింది దానికి పొంతన లేనంత హెచ్చుగా ఉంది. మనం చేసిన కష్టానికి ఏ రూపంలో అయినా ఫలితం రావచ్చు.

ఉదాహరణకు మరో సందర్భంలో ఓ వ్యక్తి సత్కర్మలు కాకుండా లంచగొండి గానో, తనను తన పనిని సరిగా చేయకుండా ఇలా ఉండి ఉండవచ్చు ఆ వ్యక్తికి కర్మ ఫల కారణంగా ఏదో ఒక ఆరోగ్య సమస్యలు రావడం ఇలా ఏదైనా కావచ్చు.

ఇక్కడ నేను చెప్పాలి అనుకున్న ముఖ్య విషయం శని కర్మ కారకుడు కావున కర్మ కు తగిన ఫలితాన్ని ఇస్తాడు.

ఇక్కడ ఇంకొక సందేహం రావచ్చు ఒక పిల్లవాడు ఏలినాటి శని తో పుట్టవచ్చు లేక ఐదు సంవత్సరాలకి ఏలినాటి శని ప్రారంభం కావచ్చు ఆ వ్యక్తికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అనుమానం వస్తుంది. కర్మ అనేది ఈ ఒక్క జీవితానికి మాత్రమే సంబంధించింది కాదు అని మనం అర్థం చేసుకోవాలి.

ఏలినాటి శని పరిశీలన:

ఏడున్నర సంవత్సరాల గోచార శని సంచారం పరిశీలిస్తే. ఈ మొత్తం కాలం జీవితం అందరికీ ఒకే విధంగా ఉండదు. ఏలినాటి శని శుభ ఫలితాన్ని ఇచ్చినా ఆ శుభ ఫలితాన్ని ఇచ్చినా అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు. దీనికి గల ముఖ్య కారణం ఏలినాటి శని మాత్రమే స్వయంగా మొత్తం ఫలితాన్ని ఇవ్వలేదు.

శని చంద్రుల కలయిక కృష్ణమూర్తి పద్ధతి లో పునఃర్పు దోషంగా పరిగణిస్తారు. దీని అర్థం శని చంద్రుల కలయిక వల్ల మనుషులు చాలా తొందర పార్టీలో అనేక రకమైన తప్పులు చేస్తూ ఉంటారు. తిరిగి మళ్లీ ప్రయత్నంతో దాన్ని సరిదిద్ద వలసిన ఉంటుంది.

శని కర్మ కారకుడు, చంద్రుడు మనఃకారకుడు, చంద్రుడు మనసుకు నచ్చింది చేయాలని మనస్తత్వం. శని ఏది చెయ్యాలో అదే చెయ్యాలని మనస్తత్వం. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల మానసికంగా చాలా ఒత్తిడి కలుగుతుంది. ఈ ఒత్తిడిలో జీవితంలో ఏం నిర్ణయం తీసుకుంటారో అనేది చెప్పలేని విషయం. ఒక నిర్ణయానికి ఖచ్చితంగా దానికి తగిన ఫలితం ఉంటుంది.

ఏలినాటి శని సమయంలో

గోచారంలో శని చంద్రుల కలయిక కావచ్చు.
జన్మ చంద్రుడి మీద గోచార శని చంద్రుల కలయిక.
నవాంశలో జన్మ చంద్రుడిమీద గోచార శని సంచారం.
కొన్ని సందర్భాల్లో లో జన్మ చంద్రుడికి గోచార శని చతుర్ధ, అష్టమ స్థానంలో జన్మ జాతకం లోనూ నవాంశ లోనూ సంచారాన్ని పరిశీలించాలి.
దశ, బుక్తి నిర్ణయం చేసి ఫలిత నిర్ణయం చేయాలి.

ముగింపు:

చాలామంది కుజదోషం, ఏలినాటి శని వంటి విషయాలలో పూర్తి అవగాహన లేకుండా ఫలితం నిర్ణయం చేసి ఎదుటివారిని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. కాబట్టి ఇ అది పూర్తిగా ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుని నిర్ణయం చేయాలి. ఏలినాటి శనియే కాకుండా మిగిలిన గోచారం కూడా చాలా ఉంటుంది.

By Watching this video you can know about Elinati Shani also know as Sade Sati Dosh. detailedly explained how it works and effects in Telugu.