Docs

14) Dasha Analysis

ఉపోద్గాతం :

ఉదయాన్నే వంట చేస్తే మధ్యాహ్నం ఆకలేసినప్పుడే అన్నం తింటాం, మధ్యాహ్నం ఆకలి గురించి తెలిసే ఉదయమే అన్ని సిద్ధం చేసుకుంటాం. 

అలాగే ఒక గ్రహబలాన్ని అర్థం చేసుకుని, జీవితంలో ఏ ఏ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఏ విషయంలో పురోగతి బావుంటుంది అనేది అర్థమైన తర్వాత అది ఎప్పుడు జరుగుతుంది అనేదానికి కాలం ఒక్కటే సమాధానం చెప్పగలుగుతుంది. ఈ వ్యాసం ద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని ఎలా అర్థం చేసుకుని జ్యోతిష్య ఫలితం చెప్పచ్చు అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. 

ప్రస్తుతం కానిది ఎప్పుడు ఆ ప్రస్తుతం, అయినప్పటికీ ఒక జ్యోతిష్యుడుగా ముందు వెనక తెలియకుండా ఒక విషయాన్ని మీరు చెప్పాలి అని అంటే అన్ని కాలాల యందు అవగాహన ఉండాల్సిందే.

కాలం :

సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారం భూమి మీద పడ్డ ప్రతి జీవి గ్రహ పీడితుడు, కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు అని చెప్తుంటారు. ఏ విషయం ఎప్పుడు జరగాలనేది కాలం నిర్ణయిస్తుంది. కొన్ని విషయాలు జీవితంలో కచ్చితంగా ఇవే జరుగుతాయి అనేది మాత్రమే దృఢమైన కర్మ మిగిలిందంతా మనిషి తనకు ఉన్న పరిధిలో ఎప్పుడూ ప్రయత్నాన్ని చేయవచ్చు. 

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ స్థితి ఆధారంగా చెప్పే పద్ధతులు బోలెడన్ని ఉన్నాయి, అన్నింటిలోనూ పరాశర జ్యోతిషాన్ని మించి ఏవి ఉండదు. కాలం గురించి పరాశర మహర్షి దశా విధానాన్ని వివరించారు, కాలం గురించి చెప్పడానికి దశ అనేది ఒక పద్ధతి, దాదాపు 42 రకాల దశా పద్ధతులు ఉన్నాయి.ఒక్కొక్క గ్రహ స్థితి ఆధారంగా ఒక్కో దశ పద్ధతిని అవలంబించాలని చెప్పారు.

మీరంతా భయపడకండి మనం మాత్రం ఒకే ఒక్క వింశోత్తరి దశ  పద్దతితోనే అద్భుతమైన ఫలితాలు చెప్పవచ్చు, ఎందుకంటే మనం నక్షత్ర జ్యోతిష్యాన్ని అవలంబిస్తున్నాం కాబట్టి. అంతేకాకుండా పాశ్చాత్య జ్యోతిష్యంలోని పురోగమన జ్యోతిష్య పద్ధతి ప్రకారం మన జ్యోతిష్య ఫలితాలను మరో మారు పరిశీలించవచ్చు.

గ్రహాలు, భావాలు అన్నింటికన్నా కాలం అనేది ఎంత గొప్పదో ఒక్క ముక్కలో చెప్తాను, మీరు 100 కిలోమీటర్ల సామర్థ్యంతో వెళ్లగలిగే పడవలో ప్రయాణం చేస్తున్నారనుకుంటే అన్ని సందర్భాల్లో నీటి వేగం అనుకూలంగా ఉండాలని లేదు, కొన్ని సందర్భాలలో వ్యతిరేక దిశలో 400 కిలోమీటర్ల వేగంలో నీరు వచ్చిందంటే మనం ఎంత వెళ్ళినా వెనక్కి వెళతాం. 

దీనివలనే అల్పులు లాగా కనిపించేవారు గొప్ప స్థితిలోనూ, గొప్పవారైనను చెప్పుకోలేనంత స్థితిలోనూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. దీన్నిబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది నీరంటేనే కాలం, కాలాన్ని చెప్పేదే దశ.

వింశోత్తరి దశ :

పరాశర మహర్షి రచించిన ఈ విశ్వోత్తర దశ 120 సంవత్సరాల కాలాన్ని 9 గ్రహాలకు హెచ్చుతగ్గులుగా పంచారు. ఒక గ్రహానికి ఎంత భాగమైతే దశలో ఇచ్చారు, భుక్తిలో కూడా దాని ఆధారంగానే పంచబడుతుంది. 

తొమ్మిది గ్రహాల యొక్క దశలను మహాదశలని అంటారు, ప్రతి దశని మళ్లీ తొమ్మిది భాగాలుగా పంచి వాటిని భక్తులని పిలుస్తారు.  దేనినైనా మళ్లీ కావాల్సినట్టుగా విభజించవచ్చు, దశ విభజిస్తే భుక్తి అవుతుంది, భుక్తిని విభజిస్తే అంతర దశ అవుతుంది, అంతరిని విభజిస్తే సూక్ష్మదశ అవుతుంది, సూక్ష్మాన్ని విభజిస్తే ప్రాణ దశ  అవుతుంది ఇలా మీ అవసరాన్ని బట్టి ఎంతవరకైనా విభజన చేయవచ్చు. 

సంఖ్య గ్రహందశ కాలం – 120శాతం 
1కేతు 7 సంవత్సరాలు05.83 %
2శుక్ర 20 సంవత్సరాలు16.66 %
3రవి6 సంవత్సరాలు05.00 %
4చంద్ర 10 సంవత్సరాలు08.33 %
5కుజ7 సంవత్సరాలు05.83 %
6రాహు18 సంవత్సరాలు15.00 %
7గురు16 సంవత్సరాలు13.33 %
8శని 19 సంవత్సరాలు15.83 %
9బుధ 17 సంవత్సరాలు14.16 %

ఫలితనిర్ణయ పద్ధతులు :

గ్రహ నక్షత్ర పరిశీలన :

మనం అనుసరించే మార్గం కళ్ళు తెరిచిన కళ్ళు మూచిన ఒకే ఒక్కటి, అదేంటంటే గ్రహము యొక్క నక్షత్రాధిపతి ఎక్కడ ఉన్నాడు ఎవరితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు దాని ఆధారంగా ఫలిత నిర్ణయం చేస్తాం, అలాగే దశానాధుని తీసుకుంటే దశానాథుడు యొక్క నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు అని పరిశీలించి నిర్ణయించడమే. 

దశానాధుడు యొక్క నక్షత్రాధిపతి కేంద్ర , కోనస్థానాలలో ఉండడం శుభత్వాన్నిస్తుంది, లగ్న యోగకార క నక్షత్రాలలో ఉంటూ యోగ కారకుల సంబంధాన్ని పొందిన మరింత శుభ ఫలితాన్ని జాతకుడు పొందే అవకాశం ఉంటుంది. ఇతర రకమైన గ్రహబలాల గురించి ఇంతకు పూర్వమే చర్చించుకున్నాం కాబట్టి దానిని అనుసరిస్తే సరిపోతుంది. 

ఇప్పుడు కొన్ని చిన్న చిన్న చిట్కాలతో మనం ముఖ్యమైన దశాబుక్తులని ఎలా పట్టుకొని మనం ఫలితం చెప్పవచ్చు అనేదానికి ఒక్కొక్కటిగా వివరిస్తాను, సమగ్రంగా ఒక జాతకం మీద అన్నింటినీ పెట్టి పరిశీలించే ప్రయత్నం చేద్దాం.

నా పద్ధతి :

1) దశ – రెండు భాగాలు – మూల త్రికోణ రాశి

దశాకాలం మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించాల్సి వస్తుంది. దశా గ్రహం యొక్క నక్షత్రాధిపతి ఒక్కోసారి రెండు రాశులకు అధిపతి అవుతుంటాడు. 

దశానాథుడు యొక్క నక్షత్ర నాథుడు రెండు రాశులకు అధిపతి అయినప్పుడు మొదట తన మూల త్రికోణ రాసి ఫలితాన్ని ఇచ్చి మిగిలిన రాశి ఫలితాన్ని తర్వాత కలగజేస్తాడు, కొన్ని ప్రత్యేక సందర్భాలలో వక్రత్వ దోషాన్ని పొందిన మూల త్రికోణరాశి ఫలితాన్ని ద్వితీయార్థంలో కలగజేస్తాడు. 

ఉదాహరణకు మకర లగ్నమునకు రవిదశ జరుగుతున్నది, రవి బుధుడు యొక్క నక్షత్రంలో ఉన్నాడు, బుధుడు మకర లగ్నానికి ఆరు మరియు తొమ్మిదవ స్థానాధిపతి కావున సహజంగా మూల త్రికోణ రాసి అయిన కన్య ఫలితాన్ని కలగజేసి తరువాత మిధున ఫలితాన్ని ఇస్తాడు. అంటే మొదట్లో శుభ ఫలితాన్ని తరువాత కష్టాన్ని ఎదుర్కొనే సందర్భాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది, ఒకవేళ గనుక బుధుడు 9 లోనే ఉంటే అలాంటి ఆరవ స్థానం ఫలితాలు ప్రతికూలంగా ఇవ్వకుండా తటస్థంగా అలా సాగిపోతూ ఉంటాడు.

2) వింశోత్తరి దశ – Activation

 మనకి తొమ్మిది మహర్దశలు ఉన్నాయి, ప్రతి దశలోనూ మళ్లీ తొమ్మిది బుక్కులు ఉన్నాయి, వీటన్నింటినీ ముఖ్యములుగా తీసుకుంటే దాదాపు 81 అవుతున్నాయి. 

ప్రతి దశాబుక్తి ఎప్పుడు ఫలితాన్ని ఇస్తుంది అనేది నిర్ణయించడంలో ఎవరైనా సతమవుతమవుతుంటారు. దీనికోసం నేను పరిశీలించిన దాన్ని మీతో పంచుకుంటాను. అది పని చేస్తున్నట్టు అనిపిస్తే మీరు కూడా వాడుకోవచ్చు. 

1 ) ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటాయి కాబట్టి అందులో  లగ్నం యొక్క డిగ్రీలు + దశానాధుడు యొక్క డిగ్రీలు.  

కలిపితే 60 కి గాను ఎంత వచ్చిందో పరిశీలించాలి, ఉదాహరణకు రెండు కలపగా 30 గనక వచ్చిందనుకోండి, ఆ దశ సగం పూర్తి అయ్యాక ఫలితాన్ని ఇస్తుంది.

ఇదే విధంగా ఒక దశలోని ఒక బుక్తి ఎప్పుడు ఫలితం ఇస్తుంది అని నిర్ణయించడానికి ఇదే విధంగా 

2 ) లగ్నం డిగ్రీలు + దశానాథుడు డిగ్రీలు + భుక్తినాధుడు డిగ్రీలు కలిపితే 90 కి గాను ఎంత వచ్చిందో పరిశీలించాలి. ఉదాహరణకు ఒక 50 వచ్చిందనుకోండి.  50/90*100 = 55.55 %  ఆ దశాబుక్తి 12 నెలలు ఉన్నది అనుకోండి, ఐదున్నర నెలల తర్వాత ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది, అది మంచా చెడా అనేది మీకు వచ్చిన గణితంతో అర్థం చేసుకోండి. ఈ పరిశీలన కేవలం ఎక్కడ ఎప్పుడు జరగడానికి అవకాశం ఉంది అని తెలుసుకోవడానికే.

3 ) జన్మజాతకంలో గురు గ్రహం లగ్నం నుండి ఒకటి, ఐదు, తొమ్మిది, పది స్థానాల్లో ఉన్నట్టయితే ముందు మనం అనుకున్నట్టుగా దాదాపు ఆ శాతాన్ని బట్టి ఆ యొక్క విషయం జరిగే అవకాశం ఉంటుంది, ఒకవేళ లేనట్టయితే ఆ పరిధి దాటి జరిగే అవకాశం ఉంటుంది. 

ఉదాహరణకు 50% వచ్చింది ఒక 65% 70% లోను జరగవచ్చు, అంతేగాని 95% వచ్చాక కూడా ఇంకా జరుగుతుందని ఊహించుకోకండి. 

4) దశను రెండు భాగాలుగా చేయవచ్చని మనం మాట్లాడుకున్నట్టే, ఒక దశను గాని భుక్తిని గాని సగం చేసి పైన చెప్పిన విధంగా గణిత ప్రయోగం చేసి పరిశీలించడమే. 

ఉదాహరణకు గురుదశలో శనిభక్తి జరుగుతుంది మీరు 30 శాతం అయ్యాక ఫలితం ఇస్తది అని అన్నారు, ఇది మొదటి లెక్క ప్రకారం, రెండవ లెక్క ప్రకారం ఆ శనిభుక్తిని రెండు భాగాలుగా చేసి మొదటి భాగంలో 30 శాతాన్ని రెండో భాగంలో 30% అయ్యాక పరిశీలించాల్సింది ఉంటుంది.

5) పైన మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు రెండు భాగాలు చేశాము మొదటి భాగంలో బాగుంటుందా రెండో భాగంలో బాగుంటుందా అనే సందేహం వస్తుంది కదా అప్పుడు మూల త్రికోణ రాసిన పరిశీలించి ఫలితాన్ని అంచరవేయాల్సిందే ఉంటుంది.

3) దశానాథుని నక్షత్ర పాదం

శ్రీ NV రాఘవాచారి గారు నాడీ గ్రంథాల ఆధారంగా దశానాధుడు ఏ నక్షత్ర పాదంలో ఉంటాడో ఆ దశ యొక్క ఫలితం అక్కడ కలుగుతుందని తెలియజేశారు. ఇదేవిధంగా భుక్తి నాధుడి నక్షత్రాన్ని కూడా పరిశీలించి ప్రయత్నించవచ్చు.

ఉదాహరణకు మీకు శుక్రదశ జరుగుతుంది శుక్రుడు ఉత్తర రెండవ పాదంలో ఉన్నాడు అంటే శుక్రదస 20 సంవత్సరాలు కనుక 10 సంవత్సరాలు అయ్యాక దాని ప్రభావం మీకు బలంగా కనిపిస్తుంది.

4) కుజ, రాహు, గురు – దశలు

కుజ రాహు గురు దశలు ఒకదాని వెనుకాల ఒకటి వరుసగా వస్తుంటాయి, ఎప్పుడైతే ఒక జాతకుడు చంద్ర నక్షత్రంలో పుడతాడో ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంది. 

1) ఈ విధంగా దశలు జరుగుతున్నప్పుడు ఆ జాతక చక్రంలో కుజ, రాహువులకి సంబంధం ఉంటే వాళ్లు దాదాపు ఒకే రకంగా పనిచేస్తుంటారు, సంబంధం అనేది నక్షత్ర సంబంధంగాని దృష్టి సంబంధంగానే కొన్ని సందర్భాలలో రాహువు కుజరాసుల్లో ఉండడం గానీ జరగొచ్చు.

2) కుజుడు మరియు రాహువు సగము సగము యోగించిన గురువు పూర్తిగా యోగించును. ఒక్కోసారి కుజుడు మొదటి భాగం యోగించి రాహువు రెండవ భాగం యోగించును, లేకపోతే కుజుడు రెండవ భాగము రాహు మొదటి భాగము యోగించును. 

3) కుజ రాహువులు ఇద్దరు కూడా పూర్ణంగా యోగించిన గురుదశ యోగించకపోవచ్చును, చూడడానికి అంతా బానే ఉంటుంది కానీ ఆ దశ పనిచేయదు. 

4) మరో సందర్భంలో ఈ మూడు దశలు అన్ని సగం సగమే యోగించును. 

5) గురు రాహువులు యోగించి కుజుడు యోగించకుండా ఉండడము చాలా అరుదు. 

ఈ విషయాన్ని మీరు కూడా పరిశీలించి మీ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు.

5) దశలు – ఉచ్చ నీచ రాశులు

గ్రహాలు సహజంగా ఉచ్చ పొందడం నీచ పొందడం మనందరికీ తెలిసిందే అయితే శ్రీ NV రాఘవాచారి గారు నాడీ గ్రంథాల ఆధారంగా ఈ విషయాన్ని మనకు తెలియజేశారు. 

రవి మరియు శనులు పరస్పరం శత్రు గ్రహాలు, రవి మేషంలో ఉచ్చ పొందితే అదే రాశిలో శని నీచ పొందడం జరుగుతుంది. కాబట్టి రవి దశ మరియు శని భుక్తి లేదా శని దశ మరియు రవి భుక్తి లో ముఖ్యమైన సంఘటనలు జరిగే దానికి అవకాశం ఉంటుంది. ఇదే సూత్రాన్ని ఈ కింద విధంగా ఇతర గ్రహాల దశాబుక్తులను పరిశీలించవచ్చు. 

సంఖ్య గ్రహంగ్రహంవివరణ
1రవి శని ఒకే రాశిలో ఉచ్చ – నీచ 
2కుజ గురు ఒకే రాశిలో ఉచ్చ – నీచ 
3బుధ శుక్ర ఒకే రాశిలో ఉచ్చ – నీచ 
4కుజ రవి తన రాశిలో ఉచ్చ
5కుజ శని తన రాశిలో నీచ 
6శుక్ర చంద్ర తన రాశిలో ఉచ్చ
7శుక్ర శని తన రాశిలో ఉచ్చ
8శుక్ర రవి తన రాశిలో నీచ 
9బుధ శుక్ర తన రాశిలో నీచ 
10చంద్ర గురు తన రాశిలో ఉచ్చ
11చంద్ర కుజ తన రాశిలో నీచ 
12గురు శుక్ర తన రాశిలో ఉచ్చ
13గురు బుధ తన రాశిలో నీచ 
14శని కుజ తన రాశిలో ఉచ్చ
15శని గురు తన రాశిలో నీచ 

దాదాపుగా ఇలాంటి దశాబుక్తులు వచ్చినప్పుడు ముఖ్యమైన సంఘటనలు అంటే మంచైనా చెడైనా జీవితాన్ని మార్చేసేవే జరిగే అవకాశం ఉంటుంది, అయితే అక్కడ ఆ గ్రహాలకు ఎలాంటి సంబంధాలు కలిగే అనేది కచ్చితంగా పరిశీలించాలి సంబంధాలు లేని సందర్భాల్లో ఒక్కోసారి తటస్థంగా కూడా ఉండవచ్చు.

6) దశ ఛిద్రం

సాంప్రదాయ జ్యోతిష్యంలో దశా చిద్రాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు, దశ ఛిద్రం అంటే ఒక దశలో వచ్చే చివరి భుక్తి అనమాట. ఇది అశుభ ఫలితాన్నిస్తుందని ఒక నానుడి, కానీ నా పరిశీలనను తెలియజేస్తాను. 

ఒక దశ పూర్తిగా ఏ భుక్తి లోనూ ఎటువంటి సమస్య లేనట్టయితే దశాఛిద్రంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. 100 రూపాయలు మీరు సంపాదించుకున్నారు 20 రూపాయలు ఇలాంటి సందర్భంలో ఏదో ఒక రూపేనా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. 

ప్రపంచంలో మనమే కాకుండా చాలామంది జీవిస్తారు ఎప్పుడూ మంచి సమయం గడపని వారికి కొన్ని ప్రత్యేక సందర్భాలలో సంతోషంగా ఉండే అవకాశం వస్తుంది, ఇలాంటి చిత్రదశ జరుగుతున్నప్పుడు నీకు ఖర్చయి ఎదుటివాడికి లాభం కలుగుతుంది. నేను అలాంటి వాడికి నా డబ్బును ఇవ్వకుండానే ఖర్చు అయిందని నన్ను ప్రశ్నించకండి. 

దశాచిత్రం కొన్ని సందర్భాలలో దశ మొత్తం యోగించనప్పుడు అది విపరీతంగా యోగించి జీవితాన్ని అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్లే లాగా చేస్తుంది. 

ఉదాహరణకు మీకు గురుదశ యోగించలేదు, గురువులో రాహువు పూర్తిగా యోగించి జీవితాన్ని పురోగతిలోకి తీసుకొచ్చాడు, ఇప్పుడు శని దశ జరుగుతుంది శని పాపగ్రహం కనుక తన స్వభుక్తిలో ఆ శుభ ఫలితాన్ని ఇస్తుందని భయపడాల్సిన అవసరం లేదు, ఈ విషయాన్ని దాటి శని దశ అంతా కూడా పూర్తిగా యోగించే అవకాశం ఉంటుంది మిగిలిన విషయాలు సహకరిస్తే. 

మరో ఉదాహరణ శని గురువులు ఇద్దరు కూడా అనుకూల ఫలితం ఇచ్చేటట్టు ఉన్న సందర్భంలో, గురువులో రాహువు, శనిలో శని పనిచేయకపోవచ్చు. 

7) పాప గ్రహం తన స్వభుక్తి

పాప గ్రహం తన స్వభుక్తిలో యోగించదు, ఒకవేళ యోగిస్తే ఆ దశ సరిగ్గా పనిచేయదు, కొన్ని సందర్భాలలో పాపగ్రహం తన స్వబుక్తిలో మొదటి భాగము రెండవ భాగము యోగిస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే దశ సగ భాగమే యోగించే అవకాశం ఉందని అర్థం.

ఉదాహరణకు శుక్ర దశ జరుగుతుంది శుక్రుల్లో శుక్రుడు జరుగుతున్నాడు దానిని రెండు భాగాలు చేస్తే మొదటి భాగం యోగించ లేదనుకోండి, దశలో మొదటి పది సంవత్సరాలు బాగుండే అవకాశం ఉంది.

అదేవిధంగా స్వబుక్తిలో రెండవ భాగం యోగించ లేదనుకోండి, పది సంవత్సరాల తర్వాతే బాగుంటుంది.

ఇతర దశలకు దశాకాలాన్ని రెండు భాగాలుగా చేసుకుని లెక్కించండి.

బుధుడు ఒక్కడే ఉన్నప్పుడు శుభుడు అవుతాడు కానీ స్వ  నక్షత్రంలో ఉన్నప్పుడు రాశ్యధిపతి ఫలితాన్ని ఇస్తాడు రాశ్యధిపతి పాపి అయితే పాపి లాగా కూడా పనిచేస్తాడు. అంటే తన స్వబుక్తిలో యోగించడు.

స్వనక్షత్ర, నక్షత్ర పరివర్తనం జరిగినప్పుడు కూడా రాశ్యధిపతి ఫలితం వస్తుంది కాబట్టి దీన్ని గమనించాల్సింది ఉంటుంది.

8) స్వనక్షత్రం లేక పరివర్తనం

ఏ గ్రహమైన తన స్వనక్షత్రంలో ఉన్న, నక్షత్ర పరివర్తన చెందిన రాష్ట్రాధిపతి ఫలితాన్ని ఇస్తుంది. 

ఉదాహరణకు మిధునంలో రవి ఆరుద్రలో, రాహువు మకరంలో ఉత్తరా నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు రవి నక్షత్ర పరివర్తనం పొందడం వలన రవిని పరిశీలించాలంటే శని మరియు శని నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడు అనేది చూసి రవి ఫలితం చెప్పాల్సి ఉంటుంది. 

రాహునకు బుధుడి ఆధారంగా ఫలిత నిర్ణయం చేస్తాం. 

9) భావము & యోగం

మహానటి సావిత్రి గారి గురించి అందరికీ తెలిసిందే ఒక కన్ను నుంచి బాధ మరో కంటి నుంచి ఆనందం అభినయాన్ని ఎవరూ మర్చిపోరు. కానీ మనం నిజజీవితంలో ఇలా జరిగితే ఏం చెప్పాలో ఎవరికీ అర్థం కాదు. 

ఇదేవిధంగా ఒక్కోసారి లగ్నమునకు పాపులైన వారు వక్రత్వ దోషాన్ని పొందినప్పుడు డబ్బులు పేరు కీర్తి వంటి విషయాల్లో శుభ ఫలితాలు ఇచ్చిన కుటుంబ ఆరోగ్యాలు మానసిక సంతోషాన్ని పాడు చేసే విధంగా ఏదో ఒకటి మరోవైపు జరుగుతూ ఉంటుంది. 

ఒకే దశాభుక్తిలో మంచి చెడు జరిగే ఈ విచిత్ర సందర్భాన్ని చాలా జాగ్రత్తగా గమనించి ఫలిత నిర్ణయం చేయవలసి ఉంటుంది.

10) వక్రత్వ దోషం పొందిన దశ

ఇంతకుముందే మరో వ్యాసంలో మనము వక్రత్వం గురించి చాలా మాట్లాడుకున్నాం, ఒక దశనాదుడికి వక్రతదోషం పొందిన ఆ వ్యక్తికి నిర్ణయం తీసుకునే అధికారం లేదు అనేది నా ప్రగాఢ నమ్మకం. 

మరింత అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను, దశానాధుడు లగ్నమునకు పాపి అయినప్పుడు వక్రత్వ దోషం పొందినప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తుంది అయితే ఇక్కడ మనం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే సరిపోతుంది. 

చిన్న ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి ఉద్యోగంలో పురోగతి లేదని మారదామని అనుకుంటాడు ఆ వ్యక్తికి వక్రత్వ దోషం పొందిన దశ జరుగుతుంది. ఇక్కడ ఆ వ్యక్తి నిర్ణయం తీసుకోకుండా ఉండమని నేను చెప్తాను, ఒకవేళ అతను నిర్ణయం తీసుకోకుండా ఉంటే అనూహ్యంగా ఎవరో ఇతను ఊహించని స్థితికి తీసుకువెళ్లే లాగా పురోగతిని కలగజేసే అవకాశం ఉంటుంది, ఇలా ఒకవేళ మానేస్తే ఆ అవకాశాన్ని పొందలేడు కదా.  

మరో సందర్భంలో అతను ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దామని అనుకోవచ్చు ఒకవేళ చేస్తే కచ్చితంగా అతని నిర్ణయం తప్పే అవుతుంది. ఆ వ్యక్తి ఏదైతే చేస్తాడో దానినే కొనసాగిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి, కొన్ని సందర్భాలలో సరైన వివాహ నిర్ణయం తీసుకోలేకపోవడం నేను చాలా సందర్భాల్లో గమనించాను. 

20 సంవత్సరాలు శుక్ర దశ జరిగితే నన్ను అన్నం తినమంటారా వద్దంటారా అని అడిగే వాళ్ళు ఉన్నారు, నేను అర్థం ఏంటంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగేయమని, దాని యొక్క లోటుపాట్లు తెలుసుకొని ముందుకు పోవాలని అర్థం చేసుకోవాలి.

11) అక్షయ పాత్ర – ఖాళీ గిన్నె

పిల్లాడి ఆకలి అమ్మకు తప్ప ఎవరికీ తెలియదు, అమ్మ అక్షయపాత్ర లాగా ఆకలేసినప్పుడల్లా ఏదో ఒకటి పిల్లలకు పెడుతూనే ఉంటుంది. అమ్మ తన కోసం ఏమి దాసుకుంది అనేది చిన్నతనంలో మనం ఎన్నడూ చేయని ఆలోచన. 

ఒక్కో సందర్భంలో గ్రహము సరిగా లేనప్పటికీ దాని నక్షత్రాధిపతి ఏదో ఒక శుభ సంబంధం వలన మనం యోగించదు అనుకున్న దశ ఆ ఒక్క గ్రహం ఆధారంగా అఖండంగా యోగిస్తూ ఉంటుంది, ఇలాంటి సందర్భంలో ఆ గ్రహం మన జీవితంలో అక్షయపాత్రలాగా అన్ని నింపుతుంది, చివరికి ఏ గ్రహం వల్ల అయితే యోగిస్తుందో ఆ గ్రహం యొక్క భుక్తి వచ్చినప్పుడు యోగించదు, దీనిని నేను చాలా జాతకాల్లో పరిశీలించి చెప్తున్నాను. 

12) జీవితాన్ని మార్చేసే దశ భుక్తులు

జాతక చక్రంలో లగ్నం అత్యంత ముఖ్యమైనది.

  • లగ్నాధిపతి యొక్క నక్షత్రాధిపతి
  • లగ్న నక్షత్రాధిపతి యొక్క నక్షత్రాధిపతి 
  • లగ్నంలో బలమైన గ్రహం దాని నక్షత్రాధిపతి

ఇలాంటి దశలు వచ్చినప్పుడు దానిలో ముఖ్యమైన దశాబుక్తులు వచ్చినప్పుడు జీవితాన్ని మార్చేసే దానికి అవకాశం ఉంటుంది, లగ్నం మనం ఎందుకు పుట్టాము చెప్తుంది కాబట్టి ఇలాంటి దశలు జీవితంలో దిశ నిర్ణయం చేసి మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. 

జాతకంలోని యోగము, దశాక్రమము, గ్రహబలము అనేక విషయాలను అంచనా వేసుకుని ఈ దశాబుక్తి జాతకుడు జీవితాన్ని మార్చేస్తుందని అంచనా వేయవచ్చు. అవకాశం దొరికితే ఉదాహరణలు కూడా అందిస్తాను.

13) త్రిగుణ రూప కాలం

ఒక్కోసారి సమయం అద్భుతం జీవితంలో జరుగుతున్నట్టు సంతోషాన్నిస్తుంది.

మరో సందర్భంలో ఎటువంటి మార్పు లేకుండా సాగుతున్న సాగిపోతూ ఉంటుంది. 

జీవితం ఏ వైపు నుంచి బయటపడాలో అర్థం కాకుండా అన్ని చిక్కుముడులే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. 

మూడు రకాల సమయాల గురించి మనం మాట్లాడుకున్నాం.

  • మంచి సమయం
  • మధ్యమ సమయం
  • చెడు సమయం
సంఖ్య ముఖ్య సమయంఅంతర సమయం శతం 
1మంచి సమయంమంచి సమయం100
2మంచి సమయంమధ్యమ సమయం85
3మంచి సమయంచెడు సమయం70
4మధ్యమ సమయంమంచి సమయం60
5మధ్యమ సమయంమధ్యమ సమయం50
6మధ్యమ సమయంచెడు సమయం35
7చెడు సమయంమంచి సమయం25
8చెడు సమయంమధ్యమ సమయం15
9చెడు సమయంచెడు సమయం0

మంచిలో మంచి జరుగుతున్నప్పుడు జీవితమంతా అద్భుతంగానే కనిపిస్తుంది, నిజానికి అద్భుతంగా కూడా ఉంటుంది. 

ఒక తటస్థ సమయంలో చెడు సమయం లేక మంచి సమయం జరుగుతుందనుకోండి, జీవితంలో చెప్పలేనంత సాహసం చేయాలని అనిపించింది అనుకో చేసే ప్రయత్నం బాగున్న ఫలితం అనుకూలంగా ఉండకపోవచ్చు. 

ఉదాహరణకి తటస్థ సమయం జరుగుతున్న దశ వచ్చిందనుకున్నా ఆ జాతకుడు నేను ఒక సినిమా తీయాలి అనుకుంటున్నాను, ఎవరు చేయలేనంత సాహసం చేసే డబ్బు సంపాదించాలి అనుకుంటున్నాను ఇలా ఏదైనా ఆలోచన చేయవచ్చు మొదట్లో ఒక రెండు అడుగులు ముందుకు వెళ్లినట్టు చూపించిన తర్వాత గమ్యాన్ని చేరుకోకపోవచ్చు. 

చెడు సమయంలో మంచి ఉంది కదా అని అంటే ఒక్కోసారి నీకు జ్వరం వచ్చింది మీ ఇంట్లో ఫ్యాన్ తిరుగుతున్నప్పటికీ నువ్వు గాలి ఆస్వాదిస్తున్నప్పటికీ అది గుర్తించలేకపోవచ్చు.

కాబట్టి ఈ పైన పట్టిక ఆధారంగా ఆ జాతకుడు ఎలాంటి కాలంలో జీవితం గడుపుతున్నాడు అనేది గుర్తించి సలహా ఇస్తే బాగుంటుంది. 

11) ట్రెండ్ vs విధ్వంసం

నేను సహజంగా జాతక చక్రాన్ని రెండు రకాల వర్గాలుగా వర్గీకరించి పరిశీలిస్తుంటాను, రాహు సంబంధిత జాతకం లేదా కేతు సంబంధిత జాతకం. 

ఒక జాతక చక్రంలో రాహువు 1, 2, 3, 6, 10, 11 స్థానాలలో ఉన్నట్టయితే దానిని రాహు సంబంధిత జాతకంగా పరిగణిస్తాను, రాహు కేతువుల పరివర్తనం చెందితే వ్యతిరేకంగా తీసుకోవాల్సిందే. పైన చెప్పిన స్థానాల్లో కేతువు గనక ఉన్నట్లయితే అది కేతు సంబంధించిన జాతకం అవుతుంది.

ప్రపంచం ఎప్పుడు అభివృద్ధిలో ఉంటుందో దాదాపు ఆ సమయంలో రాహు సంబంధిత జాతకాలు శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఉప్పెనలు, యుద్ధాలు, రోగాలు, వాయు దోషములు జరుగుతుంటాయో అలాంటి సందర్భములలో కేతువు బలంగా ఆ సమయాన్ని ఆధీనంలో తీసుకుంటాడు, కేతు సంబంధిత జాతకాలు ఇలాంటి సమయంలో ఒకటికి పది రెట్లు బలమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. 

ఉదాహరణకు కోవిడ్ వంటి సమయం తలెత్తినప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య రంగం, ఫార్మా రంగం వంటి వాటిల్లో పురోగతిని మనం గమనించవచ్చు. 

కొంతమంది జీవితంలో ప్రత్యేక సందర్భం ఏర్పడుతూ ఉంటుంది. జన్మజాతకంలో దశాబుక్తులు బాగున్నప్పుడు గోచారం అనుకూలంగా ఉండదు, గోచారం అనుకూలంగా ఉన్నప్పుడు జన్మజాతకలో దశాబుక్తులు అనుకూలంగా ఉండవు. ఇలాంటి చూసినప్పుడే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. 

ఈ విధంగా కూడా ఒక పరిశీలన చేయమని చెప్తున్నాను, జాతకంలోని మిగిలిన అంశాలను పరిశీలిస్తూ దానికి ఇది కలుపుకుంటే మీరు మరింత గొప్పగా చెప్తారు అనేది ఆలోచన.

12) కాలం & అలలు (వేప చెట్టు)

( Time Waves ) వింటే నవ్వొస్తుంది చెప్తా అయినా, న్యూటన్ కి నెత్తిమీద ఆపిల్ పడినప్పుడే గ్రావిటీ గురించి గుర్తొచ్చింది. 

నేను ఒక రోజు సరదాగా ఒక పార్కులో తిరుగుతున్నప్పుడు ఒక వేప చెట్టును చూశాను, వేప చెట్టు యొక్క ఆకు నుంచి ఒక వేరుని చేరుకోవడానికి లేదంటే మొదలును చేరుకోవడానికి చాలా రకాల మార్గాలు ఉంటాయి ఎన్ని ఉంటాయని చెప్పాలంటే చెట్టుకు ఎన్ని ఆకులు ఉంటాయో అన్ని మార్గాలన్నమాట. 

ఇంకొంచెం వివరంగా చెప్తాను, ఒక ఆకు నుంచి దానికి సంబంధించిన కొమ్మకి, ఆ కొమ్మ నుంచి దాని ముఖ్యమైన పెద్ద కొమ్మకి, అలా చివరికి కాండానికి, మొదలకి మనం చేరుకోవచ్చు. చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని రకాలుగా మనం వెళ్లొచ్చు, ఒక ఊరును చేరుకోవడానికి ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి, నగరాల నుంచి అనేక మార్గాల ద్వారా అన్ని దిక్కుల నుంచి చేరుకోవచ్చు. 

ఇదంతా ఇలా చూస్తూ ఉంటే మన వల్ల కాదు మనం ఎప్పుడూ ఆ మొదలన్ని కనుక్కుంటాను అని సందేహం వస్తూ ఉంటుంది. ఆరోజు ఆ వేప చెట్టును చూసినప్పుడు మనం మొదలు నుంచి ముఖ్యమైన కొమ్మలను లెక్కపెట్టి, తరువాత కొమ్మకున్న మరో కొమ్మల్ని గుర్తించి నచ్చిన మార్గానికి సులువుగా వెళ్లొచ్చు, తిరిగి వెళ్ళిన మార్గంలోనే మొదలు కూడా రావచ్చు ఇది నాకు అర్థం అయిన జ్ఞానం. ముందే చెప్పానుగా ఈ మాత్రానికి జ్ఞానం కావాలా అని నవ్వొస్తుంది, ఇప్పుడు విషయం చెప్తాను.

ఐదు నిమిషాల్లో ఏం జరుగుతుందో చెప్పండి చూద్దాం అని జ్యోతిష్యల్ని మనం సరదాగా పరిహసిస్తుంటాం. కాలం అనేది చెట్టుకు ఎన్ని కొమ్మలు ఉన్నాయో అన్ని శాఖలుగా ఉంటూ ఉంటుంది. 

ఒక 100 సంవత్సరాల కాలాన్ని తీసుకుంటే, దానిని పది భాగాలుగా చేసి పది సంవత్సరాలకు ఒక భాగంగా చెప్పవచ్చు, పది సంవత్సరాల నుండి సంవత్సరం గా విభజించవచ్చు, సంవత్సరాన్ని 12 నెలలుగా, నెలని రోజులుగా, రోజుని గంటలుగా, గంటని సెకండ్లుగా ఇలా మనం అవసరాన్ని బట్టి విభజన చేసి మాట్లాడవచ్చు. 

10 సంవత్సరాలు ఇలా జరుగుతుంది అని చెప్పడానికే నాలుగు అంటే నాలుగు ముఖ్యమైన లెక్కలు తెలిస్తే చాలు చెప్పేయవచ్చు, అదే ఒకవేళ ఐదు నిమిషాల్లో ఏమి జరుగుతుందని చెప్పడానికి కచ్చితంగా 1000 రకాల లెక్కలు వేయాల్సి ఉంటుంది అందుకే అది అంత సులువైనది కాదు. 

మరి దాన్ని ఎలా సులువుగా సాధించాలనేది నా ఆలోచన, అయితే కాలాన్ని ముందుగా ఒక పెద్ద భాగానిగా విభజించి దానిలోని కచ్చితత్వాన్ని సాధిస్తే, తరువాత ఆ కాలాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి కచ్చితంగా సాధిస్తే మనం వీలైనంతవరకు బాగా చెప్పడానికి అవకాశం ఉంది.

కేవలం మూడే గ్రహాలతో ( యురేనస్, శని, గురుడు ) ఈ అద్భుతాన్ని 9 కాలక్రమాల గురించి వివరిస్తాను.  యురేనస్ అనే గ్రహాన్ని పాశ్చాత్య జ్యోతిష్యులు పరిగణలోకి తీసుకుంటారు దీన్ని ఇంద్రుడు లేక వరుణుడు అని చెప్తుంటారు. నెప్యూన్ ఫ్లూటో లాంటి ప్లానెట్స్ ఉన్నప్పటికీ యురేనస్ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడాన్ని నేను పరిశీలించాను.

ఈ పద్ధతిని పాశ్చాత్య జ్యోతిష్యం ఆధారంగా నేను రాయడం జరిగింది. పాశ్చాత్య జ్యోతిష్యంలో ఐదు ముఖ్యమైన దృష్టిలు ఉన్నాయి వాటిని తెలుగులో 

  1. గ్రహ కలయిక – అశుభ దృష్టి  ( 1-1 )
  2. కోనదృష్టి – శుభదృష్టి (1-5 / 1-9)
  3. అర్థకోన దృష్టి – శుభ దృష్టి (1-3 / 1-11)
  4. కేంద్ర దృష్టి – అశుభ దృష్టి ( 1-4 / 1-10)
  5. పరస్పర వీక్షణ – అశుభ దృష్టి ( 1-7 )

ముందుగా రెండు పెద్దపెద్ద గ్రహాలైన యురేనస్ మరియు శని మధ్య ఏ విధమైన దృష్టి ఏర్పడింది అనేది పరిశీలించాలి. తరువాత ఈ జరుగుతున్న సందర్భానికి గురు గ్రహం ఏ విధంగా అనుకూల ప్రతికూలతను తెలియజేస్తుందని అర్థం అయితే మనకి ఆ కాలం ఎటువంటిది అనే దానిమీద అవగాహన వస్తుంది.

సంఖ్య సంవత్సరం ఫలితం 
11977చెడు 
21981మంచి 
31988చెడు 
41996మంచి 
52000చెడు 
62003మంచి 
72008చెడు 
82015మంచి 
92020చెడు 
102023మంచి 
112033చెడు 
122039మంచి 
132043చెడు 

రెండు ఉదాహరణలతో మీకు విషయం అర్థం అయిపోతుంది, 2008 ప్రపంచంలో ఏం జరిగిందనేది మీ అందరికీ తెలుసు, శని మరియు యురేనస్లు పరస్పరం సమసప్తక స్థితిని పొంది ఉన్నారు. ఇది అశుభ ఫలితాన్ని ఇచ్చింది. 

2020 21 సంవత్సరంలో కోవిడ్ అనే అంటూ వ్యాధి చాలామందిని ఇబ్బంది పెట్టింది, మేషము మరియు మకర రాశిల్లో శని మరియు యురేనస్ల వల్ల జరిగిందని చెప్పవచ్చు.

నా పరిశీలనను బట్టి సంవత్సరాలను మంచి చెడుగా నిర్ణయించాను, చెడు తర్వాత మంచికి, మంచి తర్వాత చెడుకి కాలం బొమ్మ బొరుసు లాగా మారుతూనే ఉంటుంది. 

మీరు ఫలితం చెప్పేముందు ఆ యొక్క ముఖ్యమైన కాలం యొక్క అలల్ని గమనిస్తే మంచి చెప్పాలా చెడు చెప్పాలా అనేది మీకు తెలిసిన జ్యోతిష్య గణితంతో కలుపుకుని చూస్తే ఇంకా బాగా చెప్పగలుగుతారు. నేను చెప్పిన సంవత్సరాలలో ఈ మూడు గ్రహాలు ఏ విధంగా పరస్పర కేంద్ర దృష్టిని గాని, పరస్పర కోనదృష్టిని గాని ఏ విధంగా ఏర్పరిచాయని పరిశీలిస్తే నేను రాసినట్టు ఎన్ని వేల సంవత్సరాల కైనా మీరు రాయగలుగుతారు.

ఈ విధమైన పరిశీలన నచ్చితే వాడుకోండి, నచ్చకపోతే మీకు నచ్చినట్టే చెప్పుకోండి.

13) నక్షత్రం సంబంధం & దృష్టి

రెండు గ్రహాలు ఒకరిని ఒకరు పరస్పరం చూసుకున్నప్పుడు దానిలో ఏదో ఒక గ్రహము ఇతర గ్రహం యొక్క నక్షత్రంలో ఉందనుకోండి వారి మధ్య బలమైన సంబంధం ఉన్నట్టు. ఎందుకంటే ప్రతి గ్రహము తన సప్తమ దృష్టిని కలిగి ఉంటుంది కాబట్టి దాని ముందున్న గ్రహాన్ని చూడడం సహజం కానీ ఇక్కడ ఇతర గ్రహం యొక్క నక్షత్రంలో ఉంటూ ఇతర గ్రహం చేత చూడబడటం అనేది విశేషం. 

ఇలా ఇతర గ్రహ నక్షత్రంలో ఉంటూ ఇతర గ్రహం చేత చూడబడినప్పుడు అలాంటి దశాబుక్తి వచ్చినప్పుడు జీవితాన్ని మార్చే ముఖ్యమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది, మంచి చెడు అనేది అక్కడున్న గ్రహ స్థితిని బట్టి ఉంటుంది.

ఈ విషయాన్ని శ్రీ ఎన్ వి రాఘవాచారి గారు నాడీ గ్రంథాల ద్వారా మనకు అందించారు. నేను కూడా చాలా జాతక చక్రాల మీద పరిశీలించి చూశాను అద్భుతంగా పనిచేస్తుంది.

14) నక్షత్రం సంబంధం & దృష్టి , మైత్రి

రెండు గ్రహాలు పరస్పరం ఒకరిని ఒకరు చూసుకుంటూ అందులోను ఎవరో ఒకరు ఇతర గ్రహం యొక్క నక్షత్రంలో ఉండడం అంతేకాకుండా వాళ్లు మిత్రులైన మరింత విశేష ఫలితాన్ని ఇస్తుందని తెలియజేశారు. 

ఉదాహరణకు సింహ లగ్నానికి చంద్రుడు వృషభంలో కృత్తికా నక్షత్రంలో ఉండి రవి వృశ్చికంలో ఏదో ఒక నక్షత్రంలో ఉంది చంద్రుడు చేత చూడబడుతూ ఉండడం జరిగింది ఇది కచ్చితంగా విశేషం అవుతుంది.

15) నక్షత్రం సంబంధం & కలయిక

గ్రహాలన్నీ తిరుగుతున్నప్పుడు ఏదో ఒక రాశులు అవి కలవడం సహజం కానీ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఒక గ్రహం యొక్క నక్షత్రంలో ఉంటే అది విశేషం. 

ఇలా ఎవరి జాతకంలో అయితే జరుగుతుందో దానికి సంబంధించిన దశాబుక్తి వచ్చినప్పుడు కచ్చితంగా ముఖ్యమైన సంఘటనలు జీవితంలో జరిగే అవకాశం ఉంటుంది. 

ఉదాహరణకు ధనస్సులో శుక్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు తిరుగుతూ తిరుగుతూ ఒక రోజు పూర్వాషాడ నక్షత్రం లోకి వచ్చాడు అదే రోజు ఆ వ్యక్తి పుట్టాడు, ఇప్పుడు ఆ జాతకంలో శుక్రుడు చంద్రుడు కలిసి ఉన్నారు, చంద్రుడు శుక్రుడు యొక్క నక్షత్రంలో ఉంటూ శుక్రుడు తో పాటు కలిసి ఉన్నాడు ఇది ఇక్కడ విశేషమైంది. చంద్రుడిలో శుక్రుడు గాని శుక్రుడులో చంద్రుడు గాని దశాబుక్తుల వచ్చినప్పుడు ముఖ్యమైన సంఘటన జరగొచ్చు. 

16) పరివర్తనలు

పరివర్తన అనగా రెండు గ్రహాలు చేతిలో చెయ్యేసి కూర్చోవడమే, వాటి మధ్య అంత గట్టి సంబంధం ఉంటుంది.

పరివర్తనలు గ్రహాలకి ఉండే సహజ సుభత్వము పాపత్వము ఆధారంగా మూడు రకాలుగా విభజించబడి ఉన్నాయి. 

శుభగ్రహాల మధ్య పరివర్తనం

బుధ గ్రహాన్ని మహావిష్ణువుగాను శుక్ర గ్రహాన్ని శ్రీ మహాలక్ష్మి గాను పరిగణిస్తారు అయితే ఈ రెండు శుభగ్రహాలు నక్షత్ర పరివర్తన చెందిన లక్ష్మీ యోగంగా చెప్తారు, ఇది చాలా మంచిది. అయితే శని పాలిత లగ్నాలకు ఇది విశేషంగా యోగించే అవకాశం ఉంటుంది.

రెండు గ్రహాలు నక్షత్ర పరివర్తన చెందాయి కాబట్టి రాశ్యధిపతులు బావున్నట్టయితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. 

ఈ నక్షత్ర పరివర్తన గురు చంద్రుల మధ్య గాని రవిచంద్రుల మధ్య గాని ఇలా ఏ విధంగా అయినా కూడా జరగవచ్చు. 

ఒక శుభగ్రహము మరో పాప గ్రహము  మధ్య పరివర్తనం

కొన్ని సందర్భాలలో శని గురువులు ఉచ్చ పొంది నక్షత్ర పరివర్తన జరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి అప్పుడు ఆ లగ్నానికి ఏదో ఒక గ్రహమే యోగించి ఇతర గ్రహం యోగించకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది.

గురువు పూర్ణ శుభగ్రహం అయితే శని సహజ పాపగ్రహం అవుతుంది. అందుకనే ఒక గ్రహం యోగిస్తూ ఇతర గ్రహం యోగించకపోవడం జరుగుతూ ఉంటుంది. 

కానీ పరివర్తన చెందిన గ్రహాల యొక్క రాశ్యధిపతులు వాటి యొక్క నక్షత్రాధిపతులు ఎలా ఉన్నారని పరిశీలించే చివరి నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. 

రెండు పాప గ్రహాల మధ్య పరివర్తనం

రెండు పాప గ్రహాలు పరివర్తనం చెందడం అనేది సహజమైన విషయం కాదు ఎందుకంటే ఇద్దరు దుష్టులు కలిసినప్పుడు దుష్టత్వాన్ని ఇస్తారు, కానీ రాష్ట్రాధిపతులు బాగున్నప్పుడు, ఈ గ్రహాలు శుభస్థానాలలో పరివర్తనం జరిగితే జీవితంలో కచ్చితంగా ఏదో ఒకటి సాధించే ప్రయత్నం చేస్తారు.

ఉదాహరణకు నువ్వు బాగా చదువుకోవు చదవలేవు అని వ్యతిరేక దశలో ఒక వ్యక్తిని మనం మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని నేను చదవగలను నాకు ఆ సామర్థ్యం ఉంది అని చెప్పి అతను బాగా చదివే అవకాశం కూడా ఉంటుంది.పాపగ్రహాల మధ్య పరివర్తన నెగిటివ్ ఇన్స్పిరేషన్తో సాధించేటట్టు చేస్తుంది. 

మిధున లగ్నానికి శనికిజులు మకరంలో శని కుజ నక్షత్రంలోనూ, కుజుడు వృశ్చికంలో శని నక్షత్రంలోనూ ఉన్నారు ఇప్పుడు ఆలోచించండి ఎలా ఉంటుందో. 

ఈ లగ్నానికి ఆరు ఎనిమిది స్థానాలులో పరివర్తనం జరగడం వల్ల విపరీత యోగాన్ని ఏర్పరుస్తుంది, యోగ కారకుడైన శుక్రుడుతో ఈ ఇద్దరిలో ఏదో ఒక గ్రహానికి సంబంధం ఏర్పడిన మంచిగా యోగించే అవకాశం కూడా ఉంటుంది.

17) నక్షత్రాధిపతి, గుణాలు

ఇంతకుముందు వ్యాసంలో కూడా పలుమార్లు చర్చించి ఉన్నాం. ఒక దశ జరుగుతున్నప్పుడు ఆ గ్రహం యొక్క నక్షత్రాధిపతిని పరిశీలించి అతనితో ఎవరెవరు ఉన్నారు ఎలా ఉన్నారు అని ఫలిత నిర్ణయం చేస్తూ ఉన్నాం. 

శ్రీ ఎన్ వి రాఘవాచారి గారు నాడీ గ్రంథాల ఆధారంగా ఆ గ్రామమునకు నక్షత్రమున ద్వారా నవాంశ ద్వారా మరో విధముగా మొత్తం మూడు రకాలుగా ఎలాంటి గుణం కలిగింది అని నిర్ణయించి ఫలితం చెప్పాలని తెలియజేశారు. 

నా అభిప్రాయం ప్రకారం ఆ గ్రహం యొక్క నక్షత్రాధిపతి స్థానానికి చాలా ఎక్కువ మార్కులు ఇస్తాను, కొన్ని కొన్ని సందర్భాలలో కొంత ఫలితం గుణం వల్ల కలుగుతుంది. 

నక్షత్రాధిపతి స్థానం సరిగా లేకుండా గుణం కూడా బాగోనట్టయితే ఖచ్చితంగా చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. 

గుణములు మూడు రకాలుగా ఉన్నాయి సాత్విక, రాజసిగ, తామసిక గుణములు.  గురు బుదులు సాత్విక గ్రహాలు, రవి చంద్ర శుక్రులు రాజసిగ గ్రహాలు, శని కుజ రాహువు కేతువు అందరూ తామసిక గ్రహాలే.

18) జీవా-శరీర, గుణాలు, కారకత్వాలు

ఒక గ్రహబలాన్ని మనం ముందుగానే పరిశీలించి ఉంచుకున్నాం, ఒక దశ వచ్చినప్పుడు దశానాథుడు యొక్క జీవా మరియు శరీర గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, వాళ్ల మధ్య మిత్రత్వం ఎలా ఉంది, వాళ్ల గుణాలు బాగున్నాయా, వాళ్ల కారకత్వాలు మన జీవితంలో అనుకున్న విషయాలకి అనుకూలంగా ఉన్నాయా ఇలా ఒక్కొక్కటి పరిశీలించుకుంటూ దశకు మరియు భుక్తికి ఆపాదించాల్సిందే ఉంటుంది.

ఇవన్నీ ఎందుకు పరిశీలించడం అని మనకి బోర్ కొట్టింది అనుకోండి అందరితో పాటు మనము అలానే ఫలితాలు చెప్పాల్సి వస్తుంది లేదు నేను గొప్పగా చెప్పాలంటే ఎక్కువగా పరిశీలించాల్సి వస్తుంది.

19) పంచ సిద్ధాంత సంబంధం & బిన్న పాదాలు

ఒక దశను మరియు దశాబుక్తిని నిర్ణయించేటప్పుడు ఆ దశనాధుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, నక్షత్ర నాథుడిని ఎవరు చూస్తున్నారు ఎవరు కలిశారు అని చాలా సార్లు మాట్లాడుకున్నాం కానీ ఒక క్రమబద్ధంగా ఎలా చూడాలనేది ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఇలా క్రమబద్ధంగా రాసుకుంటే దశ మరియు భుక్తి ఎలాంటి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందనేది చూడగానే అర్థమయిపోతుంది.

శ్రీ ఎన్వి రాఘవాచారి గారు నక్షత్ర జ్యోతిష్యంలో పరిశోధన చేసి సులభంగా ఐదు రకాల సంబంధాలు పరిశీలించవచ్చు అని చెప్పారు.

అన్నింటికంటే ముందుగా మనకో సందేహం వస్తుంది ఇవన్నీ రాసుకుని ఏం చేయాలని, మీరు వివాహం కోసం చూస్తున్నారని అనుకుందాం, వివాహానికి సప్తమ స్థానం ముఖ్యం, మీరు చూస్తున్న దసనాథుడు యొక్క నక్షత్ర నాథుడు ఆరవ స్థానంలో ఉంటాడు వివాహం అవ్వదు అనుకుంటారు కానీ అవుతుంది, ఇది ఎలా అని మీకు అనిపిస్తది, ఇప్పుడు చదవండి మీకున్న సందేహాలు ఎగిరిపోతాయి.

1. రాశి సంబందం

ఒక గ్రహం తన స్వనక్షత్రంలో ఉన్నప్పుడు, నక్షత్ర పరివర్తనం జరిగినప్పుడు రాశ్యధిపతి పరిశీలిస్తాం.

గ్రహం యొక్క నక్షత్ర నాథుడు ఒక రాశిలో ఉన్నప్పుడు లగ్నానికి యోగ కారకులైన వారితో కలిసిన శుభ ఫలితాలు ఇస్తాడు. 

గ్రహం యొక్క నక్షత్ర నాధుడు ఉచ్చరాశిలో ఉన్నాడా నీచరాశిలో ఉన్నాడా అలా కూడా రాశి సంబంధాన్ని చూస్తున్నాం.

2. నక్షత్ర సంబందం

ఒక గ్రహం ఎవరి నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రాధిపతితో సంబంధాన్ని కలిగి ఉంటాడు, ఆ నక్షత్రాధిపతి ఎక్కడ ఉన్నాడు అనేదాని ఆధారంగానే నక్షత్ర జ్యోతిష్య ఫలితమంతా నిర్ణయించబడుతుంది.

3) గ్రహాల కలయిక

ఒక గ్రహం యొక్క నక్షత్ర నాథుడు ఏ ఇతర గ్రహములతో కలిశాడు అనే దాని కోసం మనం గ్రహ కలయికని వాడుతాం. రెండు గ్రహాలు కలిసి ఒకే రాశిలో ఉండడాన్ని గ్రహ కలయిక అంటారు.

4) గ్రహ దృష్టి

సాంప్రదాయ జ్యోతిష్యంలో ప్రతి గ్రహము తన సప్తమ స్థానంలో ఉన్న గ్రహాన్ని కచ్చితంగా చూస్తుంది, కుజ గురు శనులకు అదనంగా రెండు విశేష దృష్టిలు ఉన్నాయి. గ్రహము మరో గ్రహాన్ని చూసినప్పుడు వారిద్దరి మధ్య ఏదో ఒక సంబంధం ఏర్పడుతుంది.

గ్రహ దృష్టి ద్వారా వచ్చే సంబంధం పరిగణించాలి.

5) బిన్న పాద నక్షత్రం

రాసి చక్రంలో రెండు రాశుల్లో ఒకే నక్షత్రం మూడు గ్రహాలకి ఉన్నాయి, రవి, కుజ మరియు గురువులకు. ఉదాహరణకు రవి నక్షత్రం కృత్తిక మేషరాశిలోను వృషభంలోనే ఉంటుంది.

మీరు చూస్తున్న భుక్తినాథుడు యొక్క నక్షత్రం ఏదో ఒక విన్నపాద నక్షత్రం అయింది, నక్షత్ర నాథుడు ఆరవ స్థానంలో ఉన్నాడు కానీ భిన్న పాదం వల్ల సప్తమ భావ ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. 

పైన చెప్పిన విధంగా ఐదు రకాలుగా సంబంధాలను మనం పరిశీలించి ఫలితాలను జాగ్రత్తగా నిర్ణయించాల్సింది ఉంటుంది.  ఇదంతా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చేద్దామనుకుంటున్నాను. 


 
చంద్ర – పునర్వసు 


గురు – పునర్వసు

లగ్నం


శుక్ర – పూర్వాషాఢ 


శని – విశాఖ 

ఉదాహరణ : మకర లగ్నానికి శని దశమ స్థానంలో ఉన్నాడు శని దశలో చంద్ర భక్తి జరుగుతుంది, విశ్లేషించి ఈ జాతకుడికి వివాహం జరిగే అవకాశం ఉందా లేదా మనం చెప్పాలి. 

గ్రహంరాశినక్షత్రకలయికదృష్టిబిన్న పాద
శని 77, 3, 12711, 1, 26, 7
చంద్ర 67126, 7

చంద్రుడు యొక్క నక్షత్ర నాథుడు గురువు ఏడవ స్థానంలో, ఆరవ స్థానంలో ఉన్న సప్తమాధిపతితో భిన్న పదం ద్వారా కలిసి కళత్ర కారకుడు అయిన శుక్రుడు చేత చూడబడడం విశేషం అవుతుంది, కాబట్టి కచ్చితంగా వివాహం జరిగే అవకాశం ఉంది.

20) శనివత్ రాహు & కుజ వాత్ కేతు

శనివర్త రాహు కుజవత్ కేతు అని అన్నారు అంటే శని ఎంత బలవంతుడో రాహువు కూడా అంతే బలమైన ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు, అంతేకాకుండా శని ఇచ్చే ఫలితం రాహువు రాహు ఇచ్చే ఫలితం శని కూడా ఇవ్వగలరు. 

ఎన్వి రాఘవాచారి గారు నాడీ గ్రంథాల ఆధారంగా రాహు దశ జరిగినప్పుడు శనిని కూడా పరిశీలించాలి అలానే శని దేశ జరిగినప్పుడు రాహువుని కూడా పరిశీలించాలి అని తెలియజేశారు. 

కుజ దశ జరిగినప్పుడు కేతుని, కేతు దశ జరిగినప్పుడు కుజుడ్ని కచ్చితంగా పరిశీలించాలని చెప్పారు. 

నేనింకా పరిశీలన ధోరణిలోనే ఉన్నాను, పూర్తిగా నా కళ్ళకు కనిపించినప్పుడు మీకు మళ్ళీ తెలియజేస్తాను అప్పటివరకు మీరు కూడా పరిశీలిస్తూ ఉండండి.

21) భావానికి వ్యయ భావం

నాకు తెలిసిన ఒక మిత్రుడు ఒకసారి నాకు ఫోన్ చేసి తన భార్య గర్భవతని చెప్పాడు నేను చాలా సంతోషించాను, కానీ ఇదే సమయంలో ఒక స్థలం తీసుకున్నానని ఆ స్థలంలో పడిందని తెలియజేశాడు. నేను భయపడ్డాను తర్వాత అనుకున్నంత పనంతా అయింది. ఆవిడకి మిస్ క్యారేజ్ అయింది ఒక సంవత్సరం తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

ఇక్కడ మనము ఒక దశను తీసుకున్నట్టయితే ఆ దశానాధుడు నాలుగు గనక సూచించాడు అనుకుందాం. ఆ జాతకుడు ఎప్పుడు సంతానం కలుగుతుంది అని అడుగుతాడు. 

ఇక్కడ పంచమ స్థానానికి వ్యయస్థానంలో చతుర్ధ స్థానం ఉంటుంది కాబట్టి ఇది అంత సునాయాసంగా ఫలితాన్ని ఇవ్వరు, ఈ విషయం గురించి శ్రీ కెఎస్ కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి పద్ధతి అనే పుస్తకాల్లో తెలియజేశారు. 

ఒక వ్యక్తి విదేశాలు వెళ్లి పెద్ద చదువులు చదువుకోవాలని అడిగాడు ఆ వ్యక్తికి 9వ స్థానం బాగుంటే విద్య దక్కుతుంది అలా కాకుండా తొమ్మిదికి వేయ భాగమైన 8 గనక ఆ దశకి బలంగా సంబంధం కలిగితే చదువులో ఆటంకాలు తప్పవు.

పరివర్తన గురించి ఆలోచించి మీరు ఉంటే ఇదే నా సమాధానం, నాలుగు ఐదు స్థానాలు పరివర్తనం చెందిన మంచిది ఎందుకంటే కేంద్ర కోణాలు కాబట్టి. అదే అష్టమ భావంతో తొమ్మిదో భావాధిపతి పరివర్తనం చెందితే అది శుభ ఫలితాలను సూచించదు. 

సింహలగ్నానికి సప్తమాధిపతి అయిన శని ఆరవ స్థానాధిపతి కూడా అవుతాడు అయితే ఒకే గ్రహమునకు రెండు ఆధిపత్ములు ఉన్నప్పుడు సప్తమ భావానికి ద్వేభావము ఆరవ స్థానము ఉంది ఆ జాతకుడికి పెళ్లి ఉండదు అని మీరు చెప్పకూడదు.

సాంప్రదాయ జ్యోతిష్యంలో పాపార్గడం వంటి విషయం కూడా ఇదే, ఏదైనా ఒక నక్షత్రానికి ముందు ఉన్న నక్షత్రము వెనక ఉన్న నక్షత్రాన్ని కూడా పరిశీలిస్తూ ఉంటారు ఎందుకంటే ముందుగానే వెనక గాని ఒక సమస్యకి పరిష్కారం గాని సమస్య గాని ఉండేదానికి అవకాశం ఉంది. 

22) ప్రసార అష్టకవర్గ – గోచారం

విశ్వంలో గ్రహాలు ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటాయి మనం పుట్టినప్పుడు ఒక ఫోటో తీస్తే అదే జన్మజాతకం అయింది, ఒక ఫోటోలోని గ్రహాలు ఎన్నడు కదలవు, కానీ గ్రహాలు మనకోసం ఎన్నడూ ఆగవు కదా అవి కదిలేవి కాబట్టి. 

మన జన్మజాతకంలో కదలని గ్రహాలను విశ్వంలో ఎప్పుడూ కదిలే గ్రహాలతో మధ్య సంబంధాన్ని పరిశీలించడాన్నే గోచారము అని పిలుస్తారు. 

శుభ గ్రహాలు లగ్నము నుండి గాని చంద్రుడి నుంచి గాని కేంద్ర, కోన స్థానాల్లో సంచరించడాన్ని శుభ సూచకంగా చెప్తారు. 

పాప గ్రహాలు ఉపచయస్థానాల్లోనూ కేంద్రాలలోనూ సంచరిస్తే శుభ ఫలితాన్ని ఇస్తాయి అంటారు. 

లగ్నమునకు యోగ కారకులైన గ్రహములకు గోచార గ్రహాలు కోన స్థానంలో సంచరిస్తే శుభ ఫలితాన్ని ఇస్తాయి, లగ్నమునకు పాపి అయిన గ్రహములు కేంద్ర స్థానాల్లో సంచరిస్తే శుభ ఫలితాన్ని ఇస్తాయి. 

టీవీ, పేపర్ వంటి మాధ్యమాల్లో చాలామంది దిన ఫలితాలు గోచార ఫలితాలు తెలియజేస్తారు, కానీ ఎన్నడూ వాళ్లు మన పూర్తి గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని, మన దశ బాగుందా లేదా అని నిర్ణయం చేసి ఫలితాన్ని ఇవ్వడానికి సాధ్యపడదు అందుకే నూటికి 99 శాతం అవి మనకి పని చేయనట్టే అనిపిస్తుంది. 

శ్రీ సి ఎస్ పటేల్ గారు అష్టకవర్గం మీద ఒక మంచి పుస్తకం రాశారు, ప్రస్తారాష్టకవర్గ అని ఒక పద్ధతి ఉన్నది. ఒక రాశిని ఎనిమిది భాగాలుగా చేసి ప్రతి గ్రహము జన్మ జాతకం నుంచి తీసుకుని గోచారం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ రాశిలో ఏ భాగంలో ఉన్నాయి ఎన్ని బిందువులు వచ్చాయి అని అంచనా వేసి పరిశీలించే పద్ధతి ఇది చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం నా ప్రయత్నం పూర్వక పరిశీలనలో గమనించాను. 

ఒక జాతకంలో ఇది జరుగుతుంది అని మీరు నిర్ణయించిన తర్వాత ఎప్పుడు జరుగుతుంది అని మీరు నిర్ణయించడానికి ప్రస్తా రాష్ట్ర వర్గకు సంబంధించిన గోచార ఫలితాన్ని వాడినట్లయితే మీరు ఇంకా బాగా చెప్పవచ్చు. 

దీనికోసం నేను ఒక చిన్న పార్టీ ఎక్సెల్ లేదా ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా డేటాఫ్ బర్త్ ఎంటర్ చేస్తే వచ్చేలాగా చేసే ప్రయత్నం చేస్తాను. అప్పటివరకు మీరు ఆగలేను అనుకుంటే మీరు అష్టకవర్గ పుస్తకాన్ని కొనుక్కొని చదువుకోవచ్చు.

నేను పాశ్చాత్య గోచారాన్ని, నక్షత్ర గోచారాన్ని వాడి కూడా ఫలితం చెప్తూ ఉంటాను, మరి ఎప్పుడన్నా అవకాశం వస్తే దాని గురించి చాలా విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 

ముగింపు :

ఇన్ని విషయాలు చెప్తే గుర్తు పెట్టుకోవడం కష్టమే అని మీకు ఇప్పటికే అనిపించి ఉంటుంది, నాక్కూడా కొంచెం జ్ఞాపకశక్తి తక్కువే అందుకోసమే పైన ఇదే వ్యాసంలో నా పద్ధతి అనే ఒక హెడ్డింగ్ తో ఒక flow చాట్ చేశాను దాని ప్రకారం గా చూసుకొని దశ ఫలితాన్ని ఇట్టే చెప్పొచ్చు. 

ప్రతి దశనాథుడు యొక్క నక్షత్ర నాథుడు శుభస్థానాల్లో ఉన్నాడా యోగ కారకుడితో కలిశాడా లేడా అని పరిశీలించి ఫలిత నిర్ణయం చేయవచ్చు.

ఒక జాతకం మీద ఉదాహరణ చెప్పుంటే బాగుండేది అని మీకు అనిపించి ఉండొచ్చు, తదుపరి వ్యాసం కోసం ఉచ్చుకతో ఎదురు చూడండి కచ్చితంగా గణితం ఆధారంగా చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేద్దాం.

ఇప్పటిదాకా సరదాగా వ్యాసాలు అన్నీ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని చదివేశారు కదా ఇకనుంచి మీకు కష్టాలు మొదలైనట్టే. ఎందుకంటే చెప్పిందంతా ఒక జాతకం మీద పరిశీలన చేస్తూ ఉంటే బోలెడన్ని డౌట్లు వస్తాయి. చించండి బాగా ఆలోచించండి.