Docs

04) Contributions of Sages to Astrology

Contribution of Sages

ఉపోద్ఘాతం

జ్యోతిష్యం నేర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ, మెరుగైన ఫలితం చెప్పడానికి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం మంచిది, ఈ వ్యాసం చదువక పోయిన మీరు జ్యోతిష్యం చెప్పగలుగుతారు, దైవకృప, గురు అనుగ్రహం, కృతజ్ఞత భావం ఇలాంటి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను.

జ్యోతిష్యం

Necessity is mother of invention, మనిషికి ఏర్పడిన అనేక అవసరాలు, పెరిగిన జ్ఞానం, అందిన వేదం, పరిశీలన, పరిశోధన, తపోశక్తితో, కాలము మరియు ప్రకృతి ప్రస్తుతం ఉన్న పరిధి వలన మనకందే జ్యోతిష్యజ్ఞానం భవిష్యత్తును అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. జ్యోతిష్యం అనేది వేద విద్య, ప్రకృతి చాలా రహస్యమైనది మరియు నిగూడమైనది, ఏది ఎప్పుడు ఎవరికి ఎంత వరకు తెలియాలో అంతవరకే తెలియజేస్తుంది. 

ఇది ఒక పదునైన కత్తిలాంటిది, ఇది మంచికి చెడుకి వాడే అవకాశం ఉంటుంది, అందుకే మహర్షులు, జ్ఞానవంతులకి మాత్రమే అర్థమయ్యేలాగా, ఒక పదానికి అనేక రకాలు అర్ధాలు వచ్చేలా మరియు సరైన వ్యక్తికి మాత్రమే సరైన అర్థం తెలిసేలాగా సంకల్పం చేత రాశారు.

కాబట్టి మనం ప్రకృతిని గౌరవిస్తూ, ధర్మాన్ని సున్నితంగా అర్థం చేసుకుంటూ, ప్రయత్నిస్తే ఆ రహస్యాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది.

జ్యోతిష్యుడు అవ్వడానికి ఉండే గ్రహస్థితి

రాసి చక్రంలో చివరి రాశి మీనం, ఇది దైవభక్తిని, మోక్ష మార్గాన్ని సూచిస్తుంది, రాశి చక్రంలో 4, 8, 12 రాసులు, జలరాసులు.

బుధుడు, గణితానికి, చదవడానికి, చదివింది అర్థం కావడానికి కారణం.

గురుగ్రహం చదివిన దాని నుంచి వచ్చిన జ్ఞానాన్ని సూచిస్తుంది.

శని గ్రహం వచ్చిన జ్ఞానం, ప్రాక్టికల్ గా ఎలా వాడాలి అనేది తెలియజేస్తుంది. శని కర్మ కారకుడు. శని diplomacy కి కూడా కారకుడు, ఎవరికి ఏది ఎంతవరకు చెప్పాలో చెప్పే ప్రయత్నం చేయగలుగుతాడు, జ్యోతిష్యం చెప్పడానికి శని చాలా ముఖ్యమైన గ్రహం.

కేతు గ్రహం మోక్ష కారక గ్రహం.

గురు బుద్ధులు సంబంధం బ్రాహ్మణ యోగాన్ని తెలియజేస్తుంది.  కులం అనేది గుణాన్ని బట్టి ఏర్పడుతుంది కానీ పుట్టుకతో కాదు, శని బుధుల సంబంధం కర్మ కు సంబంధించిన గణిత జ్ఞానం తెలిసే అవకాశం ఉంటుంది. 

గురువు, శని, కేతువు ఇవన్నీ స్పిరుచువల్ ప్రోగ్రెస్సింగ్ గ్రహాలు. 

6, 8, 12 స్థానాలని త్రికములు అని అంటారు, 3 స్థానం, అష్టమత్, అష్టమం అవుతుంది. ఈ స్థానాలు ప్రమాదాలని సూచిస్తాయి.

జ్యోతిష్యుడికి ఈ గ్రహాలతో, ఈ భావాలతో సంబంధం ఉంటూ, ఆ యొక్క గ్రహాలు అనుకూలమైన స్థానంలో ఉంటాయి, దానివల్ల కర్మను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

జ్యోతిష్యుడు ఒక గురువు కనుక, వాక్కు స్థానం (2, 3), జ్ఞానానికి సంబంధించి 5, 9 మంత్రస్థానాలు, ఉన్నతంగా ఉండే అవకాశం ఉంటుంది.

ఇవన్నీ ఇప్పుడే అర్థం కాకపోయినా, రాబోయే జాతక విశ్లేషణ సంబంధించిన వ్యాసాల ద్వారా మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, అవి చదివాక మళ్ళీ వచ్చి తిరిగి చూడండి.

ప్రకృతి

మనం ఏదైతే వాతావరణంలో ఉన్నామో దానిలో ఉన్న ప్రతి అంశాన్ని ప్రకృతే, ప్రకృతి అంటేనే దైవం, దైవం అంటేనే ప్రకృతి.

పంచభూతాలు లేనిదే మనిషి జీవించలేడు, కర్మ ఫలితం తెలియందే, కాలం మీద పట్టు సాధించడం కష్టం.

కాలం అనేది లేకపోతే, మనందరం తోలుబొమ్మలతో సమానం. ప్రకృతి మనకి శరీరాన్ని ఇస్తే, కాలమనే దారంతోనే మన జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్నాం. ప్రయాణం సుఖమయం కావడానికి ధర్మం అనే హెల్మెట్ కచ్చితంగా వాడాల్సిందే.

కాలం

సృష్టి చాలా పెద్దది, హిందూ పురాణాల ప్రకారం కాలాన్ని మన్వంతరాలు గాను, యుగాలుగాను కొలుస్తారు, దానితో పోలిస్తే మన జీవితం శూన్యం కన్నా కొంచెం ఎక్కువే అని ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. 100% విధి లిఖితమైన కర్మతో ఎవరూ పుట్టరు. కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ( కర్మతో ) జీవితం చిక్కుకుపోతుంది, మిగిలిందంతా మన చేతుల్లోనే ఉంది. ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఎవరికి జ్యోతిష్యం చెప్తున్నామనే కన్నా, నువ్వు ఎందుకు పుట్టావు, ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మనకే సమాధానం దొరుకుతుంది. కనబడని కాలాన్ని వృధా చేస్తే జీవితం వ్యర్థమవుతుంది.

గ్రహాల ప్రభావం

వేడి గిన్నె పక్కన ఉంటేనే సెగ తగులుతుంది, సూర్యుడి ఎండ, చంద్రుడి చల్లదనం ఇవన్నీ చూస్తూనే పెరిగాము. కాబట్టి గ్రహాల యొక్క ప్రభావం జీవరాశి మీద ఉంటుంది. 

గ్రహాలని మనం ఖగోళ పరంగానే చూస్తూ ఉంటాం.

కానీ వీటిని జ్యోతిష్యపరంగా మంత్ర స్వరూపంగా తీసుకుంటారు, వారిని దేవతలుగా తీసుకొని, ఏ కర్మకు ఎలాంటి ఫలితం తిరిగి వస్తుందనేది పరిగణలోకి తీసుకుంటారు. గ్రహాలు ప్రకృతిలో భాగమే, ప్రతి జీవి కర్మజీవి, పుట్టుకతోనే గ్రహ పీడితుడు అంటారు.  

నిజానికి మనం చేసే మంచి చెడు పనుల యొక్క కర్మ ఫలితాన్ని, మనకి గుర్తున్నా లేకపోయినా, ప్రకృతి జాగ్రత్తగా గ్రహరూపంలో గుర్తుంచుకొని, తిరిగి మనం పుట్టినప్పుడు ఏర్పడిన గ్రహస్థితి ద్వారా ఈ జీవితంలో ఏం జరగాలని నిర్ణయించబడుతుంది.

దైవజ్ఞ లక్షణాలు, మంత్ర జపం

ఒక ఏడు లక్షణాలు కలిగి ఉంటే జీవితం సుఖంగా ఉంటుందని, మనకి తెలియజేశారు, అవేంటో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జ్యోతిష్యుడు గా ఈ లక్షణాలు కలిగి ఉండడం వల్ల, మన వల్ల సమాజానికి హితము మాత్రమే జరుగుతుంది.

అద్వేషి: ఎదుటి వాళ్ళని ద్వేషించకపోవడం వల్ల, మనం ఎటువంటి అసూయ లేకపోవడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటాము. ద్వేషం లేకపోవడం వల్ల వచ్చినవాడు శత్రువు అయినప్పటికీ, మన జ్ఞానాన్ని ఎదుటివాడికి సరైన విధంగా పంచే ప్రయత్నం చేస్తాము. 

మంచి ఉదాహరణ చెప్పాలంటే, మహాభారతంలో దుర్యోధనుడు, పాండవులకు శత్రువు అయినప్పటికీ, పాండవులలో చిన్నవారైన నకుల సహదేవులు జ్యోతిష్యులు, వాళ్లు ద్వేషం లేని వాళ్ళు అవ్వడం వల్ల, దుర్యోధనుడు యుద్ధం గెలవడానికి అభిజిత్ ముహూర్తం పెట్టడం జరిగింది, తర్వాత శ్రీకృష్ణుడు దుర్యోధనున్ని బ్రాంతికి గురి చేసి, ఆ ముహూర్తంలో యుద్ధం జరగకుండా చేశారు.

నిత్యసంతోషి: మనం సంతోషంగా ఉంటేనే ఎదుటివాడి కష్టాన్ని ప్రశాంతంగా విని, సరైన సలహా ఇవ్వగలుగుతాం. ఇంకో విషయం ఏంటంటే ఏది ఉన్నా లేకపోయినా సంతోషం అలవాటయితే, ఎవరు ఏదిచ్చినా ఇవ్వకపోయినా ఒకే రకమైన సంతోషంతో మంచి జ్యోతిష్య ఫలితాలు ఇవ్వగలిగే అవకాశం ఉంది.

గణితజ్ఞ: జ్యోతిష్యుడు గ్రహగతులను, దశలను, వర్గచక్రాలను, చాలా విషయాలను లెక్కించుకొని చెప్పాల్సి ఉంటుంది, ప్రస్తుత కాలంలో అందరూ సాఫ్ట్వేర్లు వాడుతున్నారు, అయినా కూడా మనకి ఒక నోటి లెక్క ఉంటే, ఆ ఊహ శక్తితో చాలా అద్భుతంగా జ్యోతిష్య ఫలితం చేసే అవకాశం ఉంటుంది.

వాగ్మి: మనకి జాతక ఫలితం తెలియడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా, భయపెట్టకుండా చెప్పడం మరొ కళ, కాబట్టి మంచి మాటకరి అయితే మంచిది. 

కుశాల బుద్ధి మాన్: ఒక విషయాని, సున్నితంగా, తెలివితేటలతో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడే వారి సందర్భానికి తగినట్టుగా మనము లెక్కించి చెప్పగలుగుతాం, మనము ధ్యానము, గురువుల అనుభవము వంటి వాటితో స్వతహాగా లేకపోయినా, మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు.

సిద్ధ మంత్రం: ఒక సిద్దుడు లాగా మంత్ర సాధన జ్యోతిష్యుడికి అవసరం, అది ఏకాగ్రత, కుశాల బుద్ధిని ఇస్తుంది, ఇవి జ్యోతిష్య ఫలితాలలో మెరుగైన ధోరణి చూడొచ్చు.

ఊహ: ఈ మంత్రసాధన వల్ల జ్యోతిష్యులకు సరైన విషయాన్ని ఊహించే శక్తి కలిగి, beyond క్యాలిక్యులేషన్స్, prediction చేయగలుగుతారు. సరైన ఇంటుషన్ పవర్ రావడం ఒక అదృష్టం కూడా. 

చెప్పించుకునేవారు సత్కర్మలు చేసుకొని, పూర్వపుణ్యం పొంది ఉంటే, జ్యోతిష్యుడు చీమైనా వాళ్ళు గొప్ప జ్యోతిష్య ఫలితాన్ని చెప్పించుకునే అవకాశం ఉంది.

బృహస్పతి & పార్వతి దేవి – రహస్య విద్య

జ్యోతిష్యం ఫలించదని పార్వతి అమ్మవారి శాపం ఉంది.

కాలం అనేది అన్ని లోకాల్లో ఒకే విధంగా ఉండదు, దేవ గురువైన బృహస్పతి 100 సంవత్సరాలు తపస్సు చేసి జ్యోతిష్య జ్ఞానాన్ని పొందడం జరిగింది.

అయితే తన తపస్సు అనంతరం దేవా గురు అయిన బృహస్పతి ఆదిశక్తి పరాశక్తి అయిన పార్వతి దేవి అనుగ్రహం పొందడానికి కైలాసం వెళ్లడం జరిగింది.

అక్కడ ఉండే ద్వారపాలకులు వేచి ఉండమని చెప్పడం జరిగింది, అలా చాలాసేపు ఉండడం తర్వాత అమ్మవారి దర్శనం లభించింది.

పార్వతి దేవి సంతోష భరితులై బృహస్పతి తో సంభాషించడం జరిగింది, అయితే బృహస్పతి తను సంపాదించిన జ్యోతిష్య జ్ఞానాన్ని, ఆశీర్వదించమని కోరడం జరిగింది.

మీ జ్యోతిష్యం గొప్పదైనట్లయితే నువ్వు కైలాసం వచ్చిన దగ్గరనుంచి, నేను నిన్ను కలిసే వరకు ఏం జరిగిందో చెప్పగలవా అని ప్రశ్నించడం జరిగింది.

బృహస్పతి ఇలా మొదలు పెట్టడం జరిగింది, అమ్మ మీరు అభ్యంగన స్నానం ఆచరిస్తూండునుగా, అదే సమయంలో మహా శివుడు మీ దగ్గరకు రావడం జరిగింది, మీరు మీ చేతులతో  శివుడి కళ్ళు మూయడం జరిగింది. ఇప్పుడు ఆ దేవుడు మూడో కన్నుతో చూడడానికి ప్రయత్నిస్తే, మీరు ఆ కన్ను పై ముద్దు పెట్టడం జరిగింది అని తెలియజేశారు.

ఈ జ్యోతిష్య ఫలితాన్ని విన్న ఆదిశక్తి ఆగ్రహంతో నీ జ్యోతి శాస్త్రం ఎందుకు పనికి రాకుండా పోతుందని శపించడం జరిగింది. ఇప్పుడు బృహస్పతి అనేక విధాలుగా ప్రాధేయపడగా ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించకుండా జ్యోతిష్య ఫలితాన్ని చెప్తారో అప్పుడు మాత్రమే ఇది ఫలిస్తుంది అని సడలించడం  జరిగింది. 

స్త్రీల గురించి, ఏమి చెప్పాలో ఏమీ అడగాలో ఏమి అడగకూడదో, ఏ విషయాన్ని ఎంతవరకు చెప్పాలో కనీస ఇంగిత జ్ఞానం మనకి ఉండాలని ఈ కథ మనకు తెలియజేస్తుంది.

మహారాజు & రాజ్యంలోని ముసలి వాళ్లు

ఇది నేను ఎక్కడో విన్న కధే, ఒక రాజ్యంలో ఒక మహారాజు ఏదో ఒక సంఘటన కారణంగా రాజ్యంలోని ముసలి వాళ్ళందర్నీ చంపేయమని ఆదేశించాడు. వారి సైన్యం అంతా రాజు చెప్పినట్టు ముసలి వాళ్లు లేకుండా చేశారు.

కొన్ని రోజుల తర్వాత వరద మరియు కరువుల కారణంగా రాజ్యంలో తినడానికి తిండి కూడా లేకుండా ఏర్పడింది.

రాజు మరియు ఇతర సైన్యం ఈ సమస్య నుంచి బయటపడడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు, ఆ రాజ్యం మొత్తం మీద ఒకే ఒక్క ముసలివాడు మిగిలి ఉన్నాడు, కొంతమంది వెళ్లి సమస్యను వెల్లడించారు.

ముసలివాడు ఒక సలహా ఇచ్చాడు, అదేంటంటే రాజ్యంలో పంట వేయడానికి విత్తనాలు కూడా లేవు కదా ఇప్పుడు, మీరేం చేయాలి అంటే, ఎప్పుడూ ధాన్యం తీసుకు వెళ్లే మార్గంలో ఇరువైపులా మట్టిని తవ్వి, ఆ మట్టిని సాగు చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగింది. ఆ ముసలి తాత చెప్పినట్టుగానే ఆ మట్టిలో నుంచి మొలకలు వచ్చి మళ్లీ ధాన్యం పండించగలిగారు.

ఆ ముసలి వ్యక్తికి ఉన్న అనుభవం కారణంగానే రాజ్యం పెద్ద సమస్య నుంచి బయటపడింది. ఈ కథ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం పుట్టడంతో దైవాంశ సంభూతులము కాదు, కేవలం మానవ మాత్రులం, కేవలం 80 సంవత్సరాలు కలిగిన ఆ ముసలివాడు ఇచ్చిన జ్ఞానంతో రాజ్యమే బాగుపడినప్పుడు, కొన్ని వేల సంవత్సరాల తపోశక్తితో సంపాదించిన జ్యోతిష్య జ్ఞానం, అనుభవం మనకెంతో ఉపయోగపడాలి. 

అందుకే మనం ప్రతిరోజు మహర్షులను పూజించి, వారి అనుగ్రహం పొందాలి.

జ్యోతిష్యంలోని భాగాలు

జ్యోతిషాన్ని పరిస్థితులను బట్టి అనేక రకాలుగా విభజిస్తుంటారు, ప్రస్తుతానికి ఉన్న విభజన చెప్తాను.

ఫలిత జ్యోతిష్యం : గ్రహాల ఆధారంగా జీవితాన్ని అంచనా వేయడం.

సిద్ధాంతభాగం : గ్రహగమనాన్ని లెక్కించడం.

ముహూర్త భాగం : ఎలాంటి సమయంలో ఏమి చేస్తే బాగుంటుంది, అది ఏవిధంగా సంకల్ప బలాన్ని పెంచుతుంది.

ప్రశ్నా జ్యోతిష్యం : ఏదైనా ఒక విషయం గురించి మాత్రమే పూర్తిగా తెలియజేసేది.

సంహిత : ఒక పరిహారాన్ని గాని, క్రతువుని గాని, పూజలు గాని ఎలా ఆచరించాలని తెలియజేశారు.

ఈ విధంగా విభజించడం జరిగింది. 

18 మంది జ్యోతిష్య మహర్షులు

సూర్యః పితామహో వ్యాసో వసిష్టోత్రి పరాశరః 

కశ్యపో నారదో గర్గో మరీచి ర్మనురంగిరాః 

రోమశః పౌలిశశ్చైవ చ్యవనో యవనో భృగుః 

శౌనకోప్టాదశాశ్చైతే  జ్యోతిశ్శాస్త్ర ప్రవర్తకా:

మనందరికీ పరాశర మహర్షిని మించి ఎవరు ఎక్కువగా తెలియదు, కానీ ఈ పైన శ్లోకం ఆధారంగా ఈ 18 మంది జ్యోతిష్య మహర్షులను పూజించి వారి అనుగ్రహం పొందుదాం.

వీరిలో కొందరు, సిద్ధాంత భాగం పైన, మరికొందరు ఫలిత  భాగం పైన, ఇంకొందరు సంహితల పైన, ఇంకా ప్రశ్న జాతకం పైన ఇలా అనేక రకాలుగా మనకు జ్యోతిష్య జ్ఞానాన్ని అందించారు.

నేను నేర్చుకునే అప్పుడు కలిగిన అనుభవం

నాలో ఉన్నా తర్కము, ప్రశ్నించే తత్వం కారణంగా జ్యోతిషంలో ఉన్న వాస్తవాన్ని తెలుసుకోవాలని మా నాన్నగారు జ్యోతిష్యుడు అవ్వడంతో, ఆయనను పరిపరి విధాల ప్రశ్నలతో విసిగిస్తూ ఉండేవాడిని.

మా నాన్నగారు ఎప్పుడు నక్షత్ర జ్యోతిష్యం అనుసరిస్తూ ఉండేవారు, కేవలం గ్రహస్పటం ఆధారంగా అద్భుతమైన జ్యోతిష్య ఫలితాలను చెప్తూ ఉండేవారు.

ఆయనకి అరటిపండు వలచి నోట్లో పెట్టినట్టు చెప్పడం అనేది ఇష్టం ఉండదు, నేను బాగా కష్టపడిన తర్వాత దాని విలువ తెలిసిన తర్వాత మాత్రమే ఆ విషయాన్ని నాకు అర్థం చేయించేవారు. ఆయనే నాకు ప్రధమ గురువు.

అయితే 2014లో ఆరోగ్య సమస్యల వల్ల ఆయన పరమపదించారు, నేను ఒక్కసారిగా బావిలో కప్ప బయట పడినట్టుగా మారింది నా జీవితం, మరింత కచ్చిత ఫలితాన్ని చెప్పాలి అని అంటే ఇంకా ఇతర జ్యోతిష్య మార్గాలను నేర్చుకుంటే మంచిదని ప్రయత్నించాను.

మా నాన్నగారు పరమపదించాక పగలంతా ఏదో ఒక జాతక చక్రాన్ని పరిశీలిస్తూ ఆలోచిస్తూ ఉండేవాడిని, దాదాపు ఆరు నెలల వరకు ప్రతిరోజు రాత్రి మా నాన్నగారి కలలోకి వచ్చి నా సందేహాలు అన్ని నివృత్తి చేసేవారు.

దాదాపు శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో అలాగనే, చిరంజీవి గారికి గాంధీజీ కనబడనట్టు, నాకు మా నాన్నగారు అర్ధరాత్రి క్లాసులు తీసుకున్నారు.

తర్వాత చాలాకాలం ఒక పేరు గుర్తు రావడానికి బాగా ఆలోచించాను, చివరిగా ఆయన పేరు గుర్తొచ్చి ఆయనను ఖమ్మంకు వెళ్లి పట్టుకొని మాట్లాడటం జరిగింది, ఆయన కృష్ణమూర్తి పద్ధతి నేర్చుకోమని సలహా చెప్పారు.

అప్పుడు, మరో మిత్రుడు, దాదాపు 70 సంవత్సరాల వయసు ఉంటుంది, ఆయన దాచుకున్న పుస్తకాలని నాకు ఇచ్చేశారు. తర్వాత నేను కేపీ కూడా నేర్చుకున్నాను, అదే క్రమంలో వెస్ట్రన్ ఆస్ట్రాలజీ నేర్చుకునే అవకాశం కూడా వచ్చింది. 

జన్మ కాల సంస్కారం కోసం నేను చాలా ఇబ్బంది పడ్డాను, ఇంటర్నెట్ ఆధారంగా, దాదాపు 90 సంవత్సరాల వయసు ఉన్న మిస్సైడ్ సైంటిస్ట్ శ్రీ PVR రాయుడు గారిని కలిసి వారి అనుగ్రహంతో అది కూడా నేర్చుకున్నాను.

ఇలా నాకు అడుగడుగునా దైవం మనసు ఏదో ఓక రకంగా సహకరిస్తూనే ఉంది, దేవుడు నాయందు కృపతో అన్ని అవయవాలను అవకాశాలను సవ్యంగా ఇచ్చినప్పుడు, నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని, ఈ ఆస్తిని అంటే ప్రయత్నం చేస్తున్నాను, అయితే 100% ఆలోచనలు ఉంటే దానిలో ఒక శాతం మాత్రమే ఇవ్వగలుగుతున్నాను అదే పెద్ద బాధ.

నిమిత్తం

ప్రకృతి ఎంత గొప్పదంటే మనం ఏదైతే జాతక ఫలితం చెప్తూ ఉంటామో, మనకి ఏదో ఒక శకున రూపంలో దాని ఫలితం మన కళ్ళముందే కనబడుతుంది.

ఉదాహరణకు జాతకుడు విదేశాల్లో ఉన్నాడు, ఇప్పుడు అక్కడే ఉంటాడా తిరిగి వస్తాడా అనేది ప్రశ్న, అదే సమయంలో మీ అమ్మ మాట్లాడడానికి మీ దగ్గరికి వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి మదర్ లాండ్ కు వచ్చే అవకాశం ఆ జాతకంలో మీకు కనిపిస్తుంది.

వాక్సుద్ధి

ఏ వృత్తిలో లేని అదృష్టం జ్యోతిష్యంలో ఉంది, ఎప్పుడు ఎవరితోనో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, దీని కారణంగా సరైన జ్యోతిష్య ఫలితాలను మనకు తెలిసిన జ్ఞానంలో చెప్తూ ఉండడంవల్ల ఏదో ఒక నాటికి మీరన్నది జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇదే ప్రకృతి మనకిచ్చిన వాక్సుద్ధి. 

ఎప్పుడైనా చెడుగా ఫలితం వచ్చినప్పుడు, రాబోయే ప్రమాదాలకు జాగ్రత్త తీసుకోమని చెప్పాలి గాని, ఇదే ప్రమాదం కచ్చితంగా ఈ విషయంలో మాత్రమే జరుగుతుందని మనం ఎన్నడూ కూడా చెప్పకూడదు.

ఎందువల్ల అంటే మీ మాటకు 0.001% బలమున్న అది వారికి చెడు మన మాట వల్ల కలగకూడదని నా ఉద్దేశం.

కానీ చాలామంది ఏ విషయంలో ముఖ్యంగా చెడు జరుగుతుందో తెలుసుకోవాలని అంటారు, ఈ విషయం దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి.

ముగింపు

వేద విద్య అయిన ఈ జ్యోతిష్యం, కేవలం సంకల్పం, ప్రయత్నంతో వచ్చేస్తుందని మనం పూర్తిస్థాయిలో చెప్పలేం, ఆ సమయానికి సరైన విషయం జ్యోతిష్యుడుగా జ్యోతిష్య ఫలితం చెప్పడానికి మనకి గురువుల అనుగ్రహం, దైవ బలం, ధ్యానం వంటివి తోడ్పడే అవకాశం ఉంది.