ep16 | How to Read Astrology Books (Classics)

జ్యోతిష్య గ్రంథాలు

ఉపోద్ఘాతం:

జ్యోతిష్యంలో సిద్ధాంత భాగం, ఫలిత భాగం, ముహూర్త భాగం అని మూడు భాగాలు ఉన్నాయని మనకి తెలుసు.

సిద్ధాంత భాగంలో జాతకం చక్రం తయారుచేయడానికి కావలసిన గణితం ఉంటుంది. గణితం విషయంలో ఎప్పుడు ఎవరితోనూ విభేదాలు ఉండవు. గణితం ఎప్పుడైనా ఎక్కడ అయినా ఒకటే.

ముహూర్తం ఈ విషయంలో చిన్నచిన్న విభేదాలు ఉన్నప్పటికీ ఇంచుమించుగా అందరూ ఒకే మాదిరిగా శాస్త్రంలో పొందుపరిచిన నియమాలను అనుసరిస్తారు.

ఫలిత భాగం వచ్చేసరికి దాన్ని పూర్తిగా మనం లాజికల్ గా అర్థం చేసుకోకపోతే పొంతనలేని ఫలితాన్ని చెప్తాము.

కాబట్టి జ్యోతిష్య గ్రంధాలను ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు నేర్పిస్తాను. లాజికల్గా అర్థం చేసుకోవడం అంటే బట్టి కొట్టి చెప్పడం కాదు. ఏ సందర్భం వచ్చినా మనకున్న జ్ఞాన పరిధిలో ఆ సందర్భాన్ని ఎలా చేదిస్తున్నామని చాలా ముఖ్యం.

సాంప్రదాయ జ్యోతిష్యం గ్రంథాలన్నీ (బృహత్ పరాశర హోరా శాస్త్రం, సారావళి, ఫలదీపిక) శ్లోకాలను కంఠస్తం చేయాల్సిన అవసరం లేదు. తాత్పర్యం ఒక్కసారి చదివితే అవన్నీ మనకు అవసరం వచ్చినప్పుడు ఆవే గుర్తొస్తాయి.

ప్రాథమిక పాఠాలు ఇంత సునాయసంగా మీకు అర్థం కావడానికి నేను చేసే ఈ గట్టి ప్రయత్నం ఎందుకంటే ఖచ్చితమైన ఫలితాన్ని అందరూ ఒకే విధంగా చెప్పడం కోసమే.

ప్రాథమిక విషయాలు:

జాతక ఫలితాలు చెప్పడాన్ని నేను కార్ డ్రైవింగ్ తో పోల్చుకుంటూ ఉంటాను. మనం స్తీరింగ్ చెబుతున్నా మా బ్రేక్ వస్తున్న మా క్లచ్ నొక్కుతున్న మా అన్నీ చూసుకునే లోపు యాక్సిడెంట్ అయిపోతుంది. కాబట్టి కాలిక్యులేషన్ దానంతట అదే background లో జరిగిపోవాలి.

ప్రతి గ్రహము నక్షత్రము రాశి , కొన్ని గ్రహాలు కలిస్తే వచ్చే ఫలితాలు, దశ, భుక్తి ఫలితాలు. ఎన్ని గుర్తు ఉంటాయో అని గుర్తు పెట్టుకుంటే చాలు. మనం జాతక విశ్లేషణ చేస్తున్న కొద్దీ చెప్పిందే చెప్తున్నావ్ అని అనిపిస్తే మనంతట మనమే కొత్త విషయాలు నేర్చుకుంటాం. ఓకే కాంబినేషన్ కు కొత్త విషయం నేర్చుకుంటాం. కంగారు పడాల్సిన అవసరం లేదు.

సాంప్రదాయ జ్యోతిష్యం లో ఉన్న అన్ని నిబంధనలు చాలా సులభంగా చూడ్డానికి కనిపించినా ఒకే విషయానికి ఒకే శ్లోకానికి చాలా అర్థాలు, నానార్ధాలు, అది ఒక రహస్యంల అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రహస్యాలను చేదించాలి.

ఒక చిన్న ఉదాహరణ తో దీని అర్థం చేసుకున్నాను. ఒక వ్యక్తిని ఇలా రండి ఇ అని సంబోధిస్తే. ఆ వ్యక్తి నేరుగా గా మన దగ్గరికి రావొచ్చు. అలా కాకుండా చుట్టూ తిరిగి రావచ్చు. కుడివైపు నుంచి రావచ్చు ఎడమవైపు నుంచి రావచ్చు. ఒక నిమిషం ఆగి మంచినీళ్లు తాగి కూడా రావచ్చు. ఇలానే ఒకే అర్థం కలిగిన శ్లోకానికి అనేక రకాల అర్థాలు కూడా మనము సూక్ష్మంగా పరిశీలించి ఆపాదించి అర్థం చేసుకోవాలి.

మనకి కలిగే కనీసం తెలియాల్సిన విషయాలు. 12 రాశులు, 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, గ్రహాల దృష్టి, గ్రహాల కలయిక, 12 భావాలు, ఏ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది ఎక్కడ ఉంది, లగ్నము యోగ కారకలు ఇలాంటి కనీస విషయాన్ని గమనిస్తూ వుండాలి. కనీసం వంద జాతకాల మీద పరిశీలన చేస్తూ ఉంటే ఇక అలవాటైపోతుంది.

సారావళి:

సారావళి అనే గ్రంధాన్ని కళ్యాణ వర్మ అను చక్రవర్తి రచించారు. దీన్ని రాజమండ్రి వడ్డాది వీర్రాజు సిద్ధాంతి గారు అనువదించారు. దీనిలో సప్త గ్రహాలు తోనే ఫలితాలు ఉంటాయి.

సారావళి గ్రంథంలో ద్వి గ్రహ, త్రి గ్రహ, చతుర్, పంచ గ్రహా ఫలితాలు. దశ అంతర్దశ ఫలితాలు. చాలా సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఇది నాకు చాలా ఇష్టమైన గ్రంథం కూడా ఎందుకంటే ఒకటి రెండు వాక్యాలలో విషయాన్ని తేల్చి చెప్పేస్తారు. ఎక్కువ సేపు చదివినా నిద్ర వస్తుంది కాబట్టి.

గ్రహాలు – యోని బేధములు :

అంటే గ్రహాలను స్త్రీ, పురుష, నపుంసక లింగాలు గా విభజించారు.

రవి, కుజు, గురులు పురుష గ్రహాలు

చంద్ర, శుక్ర, రాహువులు స్త్రీ గ్రహాలు

శని, బుధులు నపుంసక గ్రహలు

గ్రహాలను రాశుల ని చాలా రకాలుగా విభజించారు ఎందుకంటే మన అవసరానికి తగ్గట్టుగా వాడుకోవడానికి.

ఉదాహరణకు ఒక దొంగతనం జరిగిందంటే. జ్యోతిష్యం ప్రకారం ముందుగా దొంగతనం జరిగిన వస్తువు అవును తిరిగి వచ్చే అవకాశం ఉందా. దొంగతనం చేసింది ఇంట్లో వారా బయట వారా. చేసిన దొంగ స్త్రీ లేక పురుషుడా
ఏ దిక్కున దొంగ ఉన్నాడు. ఇలా రకరకాలుగా ఫలితాన్ని చెప్పేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పాఠాలు ఉపయోగపడతాయి.

కొన్ని ఇతర విషయాలు:

ఈ గ్రంథంలో చాలా విషయాలు చర్చించారు. కొన్ని ప్రసవం ఎక్కడ జరుగుతుంది. ఆ కాలంలో ఇంట్లోనే ప్రసవం జరిగేది. అలాంటప్పుడు భవంతుల్లో జరుగుతుందా, గొడ్ల సావిడిలో జరుగుతుందా, దేవాలయంలో జరుగుతుందా, ప్రయాణంలో జరుగుతుందా ఇలాంటి చెప్పారు.

అరిష్ట యోగములు అని కొన్ని యోగాలు చర్చించారు. ఎటువంటి గ్రహస్థితి కలిగితే ఇబ్బందులు వస్తాయి, శిశువుకి ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇలాంటి చెప్పారు. రాజ వంశంలో పుట్టిన బీదవాడు ఎలా అవుతాడు. మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబంలో పుట్టిన రోజు మహారాజు ఎలా అవుతాడు, పుట్టుమచ్చలు, స్త్రీ జాతకం ఇలాంటివి కూడా చర్చించారు.

శ్లోక తాత్పర్యం అర్థం చేసుకోవడం:

ద్వి గ్రహ యోగములలో ఒక దాన్ని చూద్దాం.

రవి చంద్రులు కలిసి ఉన్న జాతకుడు స్త్రీ వసుడై నీతి నియమములు లేనివాడై కపట స్వభావి అగును. ధనవంతుడు, కార్యములు సాధించగల వాడు.

విశ్లేషణ: రవి చంద్రుల కలయిక అంటే అది అమావాస్య. ఈరోజు పుట్టిన వ్యక్తికి ఇలాంటి దుర్గుణాలు కలిగి ఉంటాయని చెబుతున్నారు.

క్షీణ చంద్రుడు రవి తో కలవడం వల్ల మానసిక ఉద్వేగం కలగడం, మానసిక ధైర్యం తక్కువగా ఉండడం, ఏ నిర్ణయాన్ని తొందరగా తీసుకోలేకపోవడం.

ఆత్మకారకుడైన రవి స్త్రీ కారకుడైన చంద్రుడితో కలవడం వల్ల స్త్రీ వసుడైయ్యే అవకాశం ఉంది. ఇది ఖచ్చితమైన అది కూడా కాదు.

ఎందుకంటే ఏ లగ్నము, ఈ గ్రహాలు ఏ నక్షత్రాలు ఉన్నాయి ఇలాంటి సమాచారం ఇక్కడ లేనందువల్ల. ఈ విధంగా ఏయే లగ్నాలకు ఉంటే ఎలా ఉంటుంది అనేది మన ఊహించాలి.

కపట స్వభావం అని అనడం జరిగింది. అంటే మోసపూరితమైన స్వభావం అని అర్థం. అంటే 6, 8 ఆధిపత్యం వస్తే ఇలాంటివి జరగవచ్చు.

ఉదాహరణకి సింహ లగ్నం, లగ్నంలో రవి చంద్రుల కలయిక లగ్నాధిపతి లగ్నంలో ఉండటం. వ్యయాధిపతి అయిన చంద్రుడు లగ్నానికి శుభుడు అవ్వడం వల్ల ఎటువంటి దోషం ఉండదు.

ఇక్కడ ఉన్న విషయం ఇదే లగ్నం అని ఖచ్చితంగా చెప్పలేదు. ఈ రవిచంద్రులు మేషం నుండి మీనం వరకు ఆ యొక్క లగ్నానికి ఎక్కడ ఉన్నారు అని కూడా చెప్పలేదు. అంటే ఎన్ని రకాల అవకాశాలు ఏర్పడతాయి ఇవన్నీ మనం ఊహించి అంచనా వేయాల్సి ఉంటుంది.

నీతినియమాలు లేని వాడు అని కూడా అనడం జరిగింది. నీతి అనేది ధర్మానికి సంబంధించిన. అంటే 9వ స్థానానికి సంబంధించింది.

సింహ లగ్నానికి సప్తమ రాశి అయిన కుంభరాశిలో రవిచంద్రులు ఉంటే రవి చంద్రులకు అది శత్రు క్షేత్రం కనుక కొంత ఇబ్బందిగా ఉండేదని అవకాశం ఉంటుంది.

అదే సింహ లగ్నానికి 9వ స్థానంలో మేషంలో రవి చంద్రుల కలయిక జరిగింది అనుకుందాం. తొమ్మిదవ స్థానం బాధక స్థానం, పిత్రు కారకుడైన రవి 9 లో ఉండకూడదు. అందులోనూ చంద్రుడికి అది అనుకూల రాశి కాదు. మేషంలో అశ్విని, భరణి, కృత్తిక ఇలా మూడు నక్షత్రాలు ఉంటాయి. సింహ లగ్నానికి శుక్రుడు పాపి అలాంటి నక్షత్రంలో రవిచంద్రులు కలిస్తే, ఇతర గ్రహ స్థితిని బట్టి, తొమ్మిదో స్థానం ధర్మ స్థానం కావడం వల్ల ఒకవేళ నీతి నియమాలు ఉండక పోయేదానికి కూడా అవకాశం ఉంటుంది.

ఈ విధంగా అన్ని రకాల సందర్భాలను ముందుగా రాసుకుని ఇతర గ్రంథాలను పరిశీలించడం గాని, కొన్ని జాతకాలు పరిశీలించడం ద్వారా గాని మనం పట్టు సాధించవచ్చు.

జాతక గ్రంథంలో రాసిన విషయాలు ఉన్నది ఉన్నట్టుగా మనం ఎప్పుడూ చెప్పలేం. ఎందుకంటే మన పరిశోధన దానిమీద చేసి అది ఎంతవరకు నిజం మనకు నమ్మకం వస్తే తప్ప చెప్పలేం దాన్ని ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి.

శ్లోక తాత్పర్యం – మరో ఉదాహరణ:

త్రిగ్రహ యోగం : రవి, గురు, శుక్రులు కలిసినచో నేత్ర రోగి, ప్రజ్ఞావంతుడు, సూరుడు, ధన హీనుడు, రాజ మంత్రి, పరుల కార్యములు చేయువాడు.

రవి ప్రకాశవంతమైన గ్రహం, ఏ గ్రహం అయితే రవి తో కలుస్తుందో రవి యొక్క కిరణాల వల్ల అస్తంగత్వం అవుతుంది. శుక్రుడు నేత్ర కారకుడు కనుక కంటి చూపు కి ఇబ్బంది రావచ్చు.

రవి గురువుల కలయికను గురుమౌడ్యమిగా పరిగణిస్తారు. గురువు ధన కారకుడు కాబట్టి అస్తంగత్వం అయిన సరైన స్థానంలో లేనప్పుడు జాతకంలో ధన సంబంధమైన సమస్యలు వచ్చే దానికి అవకాశం ఉంది.

సహజ జాతకచక్రంలో శుక్రుడు 2,7 స్థానాలకి ప్రతి కావున రాజ గ్రహమైన రవి తో కలవడం వల్ల ప్రభుత్వ సంబంధం ఉండడంతో ఇతరుల పనులు చేయించడానికి అవకాశం ఉండొచ్చు.

గురు శుక్రుల కలయిక వలన విజ్ఞానము విద్య రావడం వల్ల అతడు ప్రజ్ఞావంతులు కూడా అయ్యే దానికి అవకాశం ఉంది.

ఇంతకు ముందు తీసుకున్న ఉదాహరణలో లగ్నం గురించి ఎక్కువ ప్రస్తావించాను. ఇప్పుడు లగ్నం సంబంధం లేకుండా సహజ గ్రహస్థితి తో కూడా ఈ విధంగా విశ్లేషణ చేయవచ్చు.

త్రిగ్రహ యోగం : రవి, గురు, శనిలు కలిసి ఉన్నచో పూజ్యుడు, స్వజన విరోధి, అనుకూల మైన ధార పుత్రులు కలిగినవాడు, రాజా అభిమానం కలిగినవాడు, భయం లేని వాడు.

శని వృత్తి, కర్మ కారకుడు, రవి రాజాగ్రహం, గురుడు దేవగురువు, వైజ్ఞానిక అధికారి, శని రవి గురువులతో కలవడం వల్ల తెలివితేటలు, మంచితనం, అధికారం ఉండడంవల్ల పూజ్యులు అవుతాడు. సమర్ధుడు అవడంవల్ల ప్రజాభిమానం పొందుతాడు. దీని ఉద్దేశం ఉద్యోగంలో ఉన్నతాధికారుల అభిమానం పొందవచ్చు.

రవి, శనులు తండ్రి కొడుకు నైనా శత్రువులు కావడం వల్ల జాతకుడు ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా తెలియజేయడం వల్ల స్వజన విరోధి అవ్వడానికి అవకాశం ఉంది.

గురుడు సహజ తొమ్మిదవ స్థానాధిపతి, పూర్వజన్మ రూపేనా భార్య దక్కుతుంది. గురుడు పుత్రకారుడు కూడా, సహజ పంచమాధిపతి అయిన రవి తో కలవడం వల్ల, కర్మ కారకుడైన శనితో చేరడం వలన అనుకూలమైన భార్య, సంతానము కలగవచ్చు.

శని సహజంగా నిరంకుశుడు అందులోనూ అధికార గ్రహమైన రవితో చేరడం, రవి పౌరుష గ్రహం, ధర్మం కలిగిన గురువు వీరితో కలిసి ఉండడం వల్ల, మనం చేసేది సరైనది అయినప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. రవి శనుల కలయిక తెగే వరకు అలాగే మనస్తత్వం కలిగి ఉంటారు.

శుక్ర చారము: శుక్రుడు సింహరాశి లో ఉన్న స్త్రీమూల ధనలాభము పొందు వాడు, ధనవంతుడు, సామాన్య బలము కలిగిన వాడు, పరోపకార బుద్ధి కలవాడు, దేవ బ్రాహ్మణుల యందు భక్తి కలవాడు, విచిత్రమైన సౌఖ్యములు పొందు వాడు.

ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నంత మాత్రాన, ఒక నక్షత్రం లో ఉన్నంత మాత్రాన ఫలితం నేరుగా ఇవ్వలేదు. దాని స్థానం లగ్నం నుంచి చాలా ముఖ్యం. అదేవిధంగా ఆగ్రహం యొక్క నక్షత్రనాధుడు బలంగా ఉండాలి. దానికి సంబంధించిన దశ కూడా రావాలి అప్పుడే ఫలితాలు ఇస్తాయి.

పైన ఇచ్చిన సందర్భంలో తులాలగ్నానికి ఉదాహరణగా తీసుకుంటే శుక్రుడు పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఉన్నాడు అనుకుంటే అప్పుడు శుక్రుడు లగ్నం నుంచి లాభం లో ఉంటాడు.

కళత్ర కారకుడైన శుక్రుడు లాభంలో ఉండడం వల్ల స్త్రీ మూల ధనం అవడానికి అవకాశం ఉంది, లగ్నాధిపతి లాభంగా ఉంటే కొన్ని సందర్భాల్లో అప్రయత్నంగానే ధనవంతుడు అయ్యే దానికి అవకాశం ఉంది, లగ్నాధిపతి బాధక స్థానంలో ఉండడం వల్ల సామాన్య బలం కలిగి ఉండవచ్చు. శుక్రుడు సుఖాలకు, సంతోషాలకు, అలంకరణకు కారకుడు అవ్వడం వలన అందులోనూ సింహ రాశి లో ఉండడం వలన విచిత్ర సౌఖ్యాలను పొందవచ్చు. శుక్రుడు రాక్షస గురువు, దైవ గురువైన, రాక్షస గురువైన గురువు అవ్వడం వలన దైవభక్తి, దానం వంటి గుణాలు ఉండవచ్చు.

ముగింపు:

నాకు అర్థమైన రీతిలో కొన్ని ఉదాహరణలతో ఉదాహరించాను. మీరు మీ ప్రయత్నపూర్వకంగా మరింత గొప్పగా అర్థం చేసుకొని ప్రయత్నించవచ్చు.

ముఖ్యంగా సహజ కారకత్వాలు గ్రహానికి, రాశికి, నక్షత్రానికి సంబంధించినవి పరిశీలించడంతో పాటు. ఆ గ్రహాలు ఏ భావాలు ఉన్నాయి, పరివర్తనలు, వక్రత్వం వంటి విషయాలకు పరిశీలిస్తూ మనం ఇంకా మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు.

In this video i have explained about how to read telugu astrology books (classics) books like Saravali, Bruhathpara Horashatra, Jathaka Chandrika etc.

#AstrologerHyderabad #TeluguAstrologer #LearnAstrology #BestAstrologerInHyderabad #FamousAstrologerInHyderabad #TeluguAstrologer #LearnAstrology #AstrologerInHyderabad

astrologer in hyderabad , best astrologer in hyderabad , famous astrologer in hyderabad , telugu astrologer , learn astrology , telugu astrologer , best telugu astrologer, indian astrologer , best astrologer , learn astrology , learn astrology in telugu