భావాలు
ఉపోద్ఘాతం:
ఇప్పుడు దాకా లగ్నాన్ని ఎలా సునాయాసంగా గుర్తించాలి అనే విషయాన్ని నేర్చుకున్నాను. లగ్నం నుంచి పన్నెండవ రాశి వరకు 12 భావాలు ఉంటాయి.
మనం జాతక చక్రం ఎందుకు పరిశీలిస్తున్నాము. జీవితంలో జరిగే సంఘటనలు తెలుసుకోవడానికి ఈ భావాలన్నీ జీవితంలో ఏ సంఘటన ఎలా చూడాలి అనేదానికి ఉపయోగపడతాయి.
భావం అంటే జీవితంలో ఉంటే అన్ని రకాల భావనలు. అది ఇది వివాహం కావచ్చు ఉద్యోగంగా వచ్చు సంతానం ఇలా మరేదైనా కావచ్చు.
జీవితంలో ఉండే ముఖ్యమైన విషయాలను 12 భావాలు విడదీయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న 12 రాశులకు సరిపడే విధంగా అలా చేసి ఉండొచ్చు. జీవితంలో లో 12 మాత్రమే ముఖ్యమైన విషయాలు ఉంటాయా అని కాదు. ఒక రాశికి పదివేల కారకత్వాలు కూడా అన్న ఏం చేయవచ్చు.
భావాలు:
లగ్నం నుంచి మొదలుకొని 12 రాశుల వరకు లెక్కించడమే.
లగ్న భావం – శరీరం గురించి చెప్తుంది. జీవితంలో ఏదైనా సాధించాలంటే మనం ఉండాలి మనం ఉంటేనే అనుభవిస్తాం. ఏ సందర్భంలో అయినా తిరిగి ముందుకెళ్లాలి నిలదొక్కుకోవాలి అంటే లగ్న భావం బాగుండాలి. అలాగే 12 భావాలు కూడా లగ్న భావం లో కలిసి ఉంటాయి. ఏ విషయం పరిశీలించాలన్నారు ముందుగా లగ్న భావం పరిశీలించాలి.
ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే మనకి ఈ 12 భావాలు సునాయాసంగా అర్థమవుతాయి. ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు అనుకుదాం అది లగ్న భావాన్ని సూచిస్తుంది.
పిల్లవాడు పుట్టగానే ఆకలితో ఏడుస్తాడు. అందుకే ద్వితీయం ఆహారాన్ని సూచిస్తుంది.
వాడు ఏడవ గాని వచ్చే శబ్దం తృతీయ అని సూచిస్తుంది. అలాగే వాడు తప్పటడుగులు వేయడానికి ఏదో ఒకటి పట్టుకొని ముందుకు వెళతాడు. దానికంటూ ఒక ఆసరా కావాలి అందుకే తీయని విక్రమ క్షేత్రం అంటారు. అది బలాన్ని సహాయ సహకారాన్ని సూచిస్తుంది.
పుట్టిన పిల్ల వాడికి చిన్న చిన్న మాటలు, ఆలనా పాలనా సౌఖ్యం, సుఖం అన్ని తల్లి ఇస్తుంది. అందుకే చతుర్ద స్థానమని, మాతృ స్థానమని, సుఖ స్థానమని, గృహ స్థానమని అంటారు. ప్రాథమిక వైద్య అంత దీంట్లో నుండి చూస్తారు.
వాడు కొంచెం పెరిగాక వాడి ఆలోచన శక్తి ఆలోచించే విధానం అన్నీ పెరుగుతాయి అలానే ఉన్నత విద్య ఇవన్నీ కూడా పంచమ స్థానాన్ని సూచిస్తుంది.
చిన్నతనంలో పిల్లవాడు రోగనిరోధక శక్తి తో పోరాడాలి, దాన్ని గెలిచి ఆరోగ్యాన్ని పొందుతాడు. అందుకే ఆరోవ స్థానాన్ని రోగ స్థానం, శత్రు స్థానం అని ఉంటారు.
సప్తమ స్థానం ఎదుటి వ్యక్తిని ఎలా సమాజంలో ఇతరులతో నడుచుకుంటూ ఉన్నాడు ఇలాంటివన్నీ చెబుతుంది. ఇదే పెద్ద పెరిగాక వివాహానికి వ్యాపారానికి కూడా చూస్తారు.
అష్టమ స్థానం ఆకస్మిక ప్రమాదాలు, ఆరోగ్యం ఇవన్నీ సూచిస్తుంది. ఈ స్థానాన్ని బట్టి అతని వ్యక్తిత్వాన్ని కూడా పరిశీలిస్తారు.
తొమ్మిదవ స్థానం పూర్వ పుణ్య స్థానం. పాత రోజుల్లో తండ్రి గురువు ఉపనయనం చేయడం పేద నేర్పించడం అన్ని చేసేవాళ్ళు అందుకే తొమ్మిదవ స్థానం గురు స్థానం అని పిత్తు స్థానమని సూచిస్తారు. ఇక్కడ అ విచక్షణ ఉన్నత విద్య, పరిశోధన, జ్ఞానం, దైవానుగ్రహం వంటివి ఉంటాయి.
ఒక వ్యక్తి అన్ని రకాల విద్యలు నేర్చుకున్న తర్వాత సామర్థ్యం కలిగినప్పుడు ఒక పనిని అద్భుతంగా చేయగలుగుతాడు. అందుకే దశమ స్థానం కర్మను, ఉద్యోగాన్ని కీర్తిని సూచిస్తుంది.
లాభ స్థానం ఆ వ్యక్తికి కష్టపడకుండా వచ్చే లాభాన్ని సౌఖ్యాన్ని లాభం సూచిస్తుంది. అతను కన్నా ముందు పుట్టిన అన్నయ్యను గానీ అక్కను కూడా సూచిస్తుంది. ఇది ఎలా అంటే మన మన తర్వాత పుట్టిన వాళ్ళని తృతీయం తో సూచిస్తాం. అలాగే మన ముందు వాళ్ళని లాభంతో సూచిస్తాం.
ఉదాహరణకి మీది మేష లగ్నం అనుకోండి. పుట్టబోయే వాడిది ఈ లగ్నమైన మీ జాతకంలో లో తృతీయ స్థానమైన మిధునం నుంచే పరిశీలిస్తారు. అలాగే ముందుగా పుట్టిన అన్నయ్యది కుంభ లగ్నం అయింది అనుకోండి అప్పుడు మేష రాశి ని పరిశీలించాలి. దీనికి అర్థం మీది మేష లగ్నం అయితే అన్నయ్య కోసం లాభం అయిన కుంభరాశిని పరిశీలించాలి.
12వ స్థానం ఖర్చును మనం కోల్పోయే దాన్ని, ఇద్దరును సూచిస్తుంది. ఉదాహరణకు ఇక్కడ శుభగ్రహాలు ఉంటే మంచి ఖర్చును పదిమందికి ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతుంది. అదే పాప గ్రహాలు ఉంటే మనము నష్టపోవడం గాని మనకు నచ్చని పని చేయాల్సి రావడం గానీ జరుగుతూ ఉంటుంది.
లగ్న భావం – శరీరం గురించి చెప్తుంది.
ద్వితీయ భావం – ధనం, కుటుంబం, వాక్కు.
తృతీయ భావం – తమ్ముళ్ళు, చెల్లెళ్ళు
చతుర్ధ భాగం – తల్లి, సౌఖ్యం
పంచమ భావం – విద్య, సంతానం
షష్ట భావం – రోగం, శత్రువులు, వాహనాలు
సప్తమ భావం – వివాహం, వ్యాపారం
అష్టమ భావం – ఆరోగ్యం
నవమ భావం – తండ్రి, గురువు, ఉన్నత విద్య
దశమ భావం – ఉద్యోగం, కీర్తి
లాభ భావం – అన్న, అక్క, లాభం
వ్యయ భావం – ఖర్చు, నిద్ర
బావ కారకులు:
జాతక పరిశీలన ఒకే విషయం తో ఫలితాన్ని ముగించారు అనేక విషయాన్ని పరిశీలనలోకి తీసుకుంటారు. దానిలో కారక గ్రహం ఒకటి.
అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే రాజకీయాలలో ఉండే మంత్రులు లాగా అన్నమాట. ఉదాహరణకు రైల్వేమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి, రోడ్డు రవాణా మంత్రి మొదలైనవి.
తృతీయ నికి కుజుడు బాత్రు కారకుడుగా ఉంటాడు. అంటే అన్నయ్య గాని తమ్ముడు గాని మనతో ఎలా ఉంటాడు అనే విషయాన్ని పరిశీలించడానికి అన్నయ్య అయితే 11వ స్థానాన్ని తమ్ముడైతే తృతీయ స్థానాన్ని పరిశీలిస్తూ కుజుని యొక్క పరిస్థితి ఏంటి అనేది కూడా పరిశీలిస్తారు.
చతుర్దానికి చంద్రుడు మాతృ కారకుడు గా ఉంటాడు.
పంచమానికి గురుడు పుత్ర కారకుడుగా ఉంటాడు.
సప్తమానికి శుక్రుడు కళత్ర కారకుడు గా ఉంటాడు.
అష్టమానికి శని ఆయు: కారకుడు గా ఉంటాడు.
నవమస్థానానికి రవి పితృ కారకుడుగా ఉంటాడు.
ముగింపు:
నేను ఇక్కడ కొంత ఉదాహరణతో తెలియజేసే ప్రయత్నం చేశాను మరింత వివరణ కోసం మీరు ఏదైనా సాంప్రదాయ జ్యోతిష్యం గ్రంధాన్ని పరిశీలించవచ్చు. ( సారావళి, బృహత్ పరాశర హోరా శాస్త్రం)
సహజంగా ఏ విషయం ఏ భావానికి సంబంధించింది అని తెలిస్తే ప్రపంచంలో ఈ విషయం వచ్చినా ఏ భాగానికి సంబంధించి ఉండవచ్చు అని మీరు అంచనా వేయవచ్చు.
ఒక చిన్న ఉదాహరణ తో దీన్ని ముగిస్తాను. మీయొక్క జిమెయిల్ పాస్వర్డ్ పోయింది అనుకుదాం. అంటే ఇప్పుడు జాతకచక్రంలో దీన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ గ్రంథంలో కూడా రాసి ఉండదు కదా. ఇప్పుడే మన విచక్షణ పని చేయాలి.
ఇక్కడ పాస్వర్డ్ కోల్పోవడం 12వ స్థానాన్ని సూచించవచ్చు. కానీ ఇతరులు దాన్ని మార్చేస్తే (హ్యాకింగ్) అప్పుడు 8వ స్థానం నుంచి చూడాలి. ఆరవ స్థానం శత్రు స్థానం అవుతుంది. రాహువు తెలియని వ్యక్తుల గురించి సూచిస్తాడు. దీనిని మనము తిరిగి పొందగలుగుతాము లేదా అనేది. లగ్నము భాగ్యము (5, 9), లాభ స్థానం చూసి ఫలితాన్ని చెప్పవలసి ఉంటుంది.
Bhavalu are most impotent in vedic astrology. to predict anything like how a person behaves or how he deal anything depends on his bhava.